Saturday, October 25, 2025

 *ఓం నమో శ్రీ శివ కేశవాయ నమః*🙏🙏🙏

భస్మధారణలోని ఆంతర్యం!

*చాలామందికి విభూతి పెట్టుకున్నవాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది.భస్మం శివారాధన చేసేవాళ్ళో, లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారంటే చాలా పొరపాటు పడినట్లే.*

అది సరికాదు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరయినా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది. స్నానం చెయ్యకుండా వెళుతున్నా పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళవచ్చు. తడి విభూతిని పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తిచేత మీరు దానిని అనుసంధానం చేయాలి. 

*భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ* 
*సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ* 
*భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ* 
*తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!*
అని చెప్పాలి.

ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూతప్రేతపిశాచరాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు. తేజస్సును ప్రసాదిస్తుంది. విశేషమయిన ఐశ్వర్యమును ఈయగలదు. మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి.

*_భస్మ ధారణ ఎందుకు చేయాలి?_*

*భస్మం శివారాధన చేసేవాళ్ళో, లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారంటే చాలా పొరపాటు పడినట్లే.. ఐశ్వర్యం గోషు సంపన్నం (మహాభారతం ) లో చెప్పబడినది.*

అంటే.....

*ఐశ్వర్యం గోవు తో పోల్చారు. గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని అర్ధం.*

కొంతమంది అడగవచ్చు. ఏమని?

*గోవు ఉంటే ఐశ్వర్యం ఉండటం ఏమిటి అని.?*

*మహాభారతం (గో మాహాత్మ్యం పర్వం ) లో చెప్పబడినది గోమయం లో లక్ష్మీదేవి ఉంటుంది అని. ఆ గోమయాన్ని మనం ముఠాలు అనగా గుండ్రముగా తయారుచేసి దానిని హుతం చేసి అనగా కాల్చి వచ్చినటువంటి బూడిదని (భస్మాన్ని) మనం ధారణ చేస్తున్నాము.*

*అంటే మనము సాక్షాత్తు లక్ష్మిదేవిని ధారణ చేస్తున్నాము. అందుకనే భస్మాన్ని (విభూతిర్భూతిరైస్వర్యం) అన్నారు.*🙏🙏🙏

*భస్మము ధారణ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు, పెద్దలు, చెప్తూ ఉంటారు.* 

*కొన్ని పురాణాలలో..... త్రి పుమ్డ్రేన వినదానం త్రి పుమ్డ్రేన వినా జపం త్రి పుమ్డ్రేన వినా శ్రాద్ధం తోయం నిష్ఫలదాయకం అన్నారు.*

*దాని అర్థం.....భస్మం లేకుండా చేసిన దానం ,భస్మం లేకుండా చేసిన జపం, భస్మం లేకుండా చేసిన శ్రాద్ధం ఫలితం ఇవ్వవు అని.*

*భస్మం ఎవ్వరైనా ధారణ చేయవచ్చు ,భస్మ ధారణ చేసి మహాలక్ష్మి ,పరమేశ్వర అనుగ్రహము పొంది అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు, ఏ మాత్రము సందేహము లేదు.*🙏🙏🙏


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

No comments:

Post a Comment