ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒక రోజు ఉదయం మహర్షి ఇడ్లీ తీసుకున్న తర్వాత సావధానముగ అదే చోటున కూర్చొని ఉన్నారు. మహర్షి కోసం అక్కడే కాచుకొనిఉన్న ఒక భక్తురాలు మహర్షికి త్రాగుటకు వేడినీళ్ళు ఇచ్చి 'భగవాన్! భక్తవిజయము అనే పుస్తకంలో నామదేవునితో పండరినాథుడు(మహారాష్ట్ర పాండురంగ విఠలుడు) సహపంక్తిలో కూర్చొని భుజించినట్లుగ వ్రాసి ఉన్నదే. అది వాస్తవముగ అట్లా ఉండునా?' అని నసుగుతూ చెప్పడం ప్రారంభించింది....
అందుకు మహర్షి, ఆ భక్తురాలి వైపు తిరిగి "ఔను! అట్లే వ్రాసి ఉన్నది. ఇప్పుడు నీవు, నేను ఎంత వాస్తవమో, ఆ విషయము కూడ అంత వాస్తవమే. ఇది నిజమైతే అది కూడా నిజమే. ఇది అసత్యమైతే అదికూడా అసత్యమే. అంతా భావనే కదా అంటారు కొందరు! కానీ అట్లా చెప్పకూడదు. ఎందుకంటే భక్తి యొక్క భావన చెడిపోవును. భక్తి యొక్క పూర్ణత్వము నందు భక్తుడు తనకు తానే స్వయముగా ఆ స్థితిని అనుభవించినపుడు అతడు తానుగానే దానిని తెలుసుకోగలడు. ఆ స్థితిలో అతడికి తానువేరు, పండరినాథుడు వేరు అని తోచదు" అని అంత వరకు ఈ విధముగా చెప్పిన మహర్షి గంభీరముగ దివ్యోపదేశమును ఆ భక్తురాలికి ఇట్లా చేశారు...
"నామదేవుడను ఇంకా విఠలుడు పక్వము చేయవలసి ఉన్నది. ఏమి చేసేది! భక్తులు అడిగినదంతా మహర్షి ఇవ్వవలసి, చెప్పవలసి ఉన్నది. కానీ తనను తానుగ చూస్తే ఈ భావనలన్నియు తోచవు. చూచే తాను(కర్త) తప్ప వేరేదియు సత్యము కాదు."
No comments:
Post a Comment