Saturday, October 18, 2025

 *🍁చలించనివారే చరితార్థులు...🍁*

మన అంతరంగంలోని స్వేచ్ఛను సుఖదుఃఖాలేవీ భంగపరచకూడదు. బాహ్య పరిస్థితులేవీ మన మనో నిశ్చలతకు ఆటంకం కలిగించకూడదని తరచూ చెప్పేవారు వివేకానంద. ఇదే అంశంపై విదేశాల్లో ఓ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ.. ఓ ఎద్దు కథను దృష్టాంతంగా వివరించారు.

ఒకరోజు ఓ వృషభం కొమ్ముపైన దోమ ఒకటి వచ్చి వాలింది. చాలాసేపటి తర్వాత దాని దృష్టి ఎద్దుపై పడింది. తాను ఎంతో సేపటి నుంచి దీని కొమ్ముపై కూర్చున్నాను. దానికి భారమై ఉంటాననుకుంది దోమ. అదే బాధతో ఆ ఎద్దు కొమ్మువైపు నుంచి ముందుకు వచ్చి . 

‘అయ్యో! నేను ఎప్పటి నుంచో నీ కొమ్ముపై కూర్చున్నాను. నీకు చాలా బరువై ఉంటాను. నేను అలా కూర్చోవటం వల్ల నువ్వు ఎంతో కష్టపడి ఉంటావు. నన్ను క్షమించు’ అంది. 

అప్పుడు వృషభం.. ‘అబ్బే! అదేమీ లేదు. అసలు నువ్వొక జీవివి నాపై వాలావన్న స్పృహే లేదు. 

నువ్వు నీ కుటుంబ పరివారంతో వచ్చి కలకాలమూ నా కొమ్ముపై కూర్చో,. దాని వల్ల నాకేమీ హానీ లేదు’ అని సమాధానమిచ్చింది. వివేకానంద ఈ కథ చెబుతూ మన మానసిక స్థితి కూడా అంత దృఢంగా ఉండాలి. 

👉ఈ ప్రాపంచిక సుఖదుఃఖాలేవీ మనల్ని చలింపజేయకూడదు అనేవారు.🍁.

No comments:

Post a Comment