Wednesday, October 1, 2025

 *పొలం లో పని చీరను పైకి లాగి రెండు కాళ్ళ మధ్య నుంచి చీరను గట్టిగా లాగి వెనక్కి దోపి పైట కొంగును  నడుం కి బిగించి మగవాళ్ళతో సమానం గా పనిలోకి తిగుతారు వారితో ధీటుగా పొట్లాడుతూ సరసాలు సరదాలు ఇక్కడ ఎక్కడ ఆడ మగ అందరూ చూస్తున్నారు* *సంస్కృతి,సాంప్రదాయం అంటూ ఏమి ఉండవు కదా...*

*10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా ఇంటి కి స్లాప్ వెయ్యడానికి ఆడ,మగ ఓ50 మంది వచ్చారు...*
*వాళ్ళల్లో ఓ ఇద్దరు నన్ను బాగా ఆకర్షించారు ఆమె చామన ఛాయా లంగా ఓణి వేసుకొని జడని ముడిలా వేసుకొని మెడలో చిన్న నల్లపూసలు దండ తో లంగా ని గోచిలా కట్టుకొని నవ్వుతూ బిడియం గా ఓ పక్కన నుంచుంది...*
 *పని మొదలవ్వ గానే ఓ కుర్రోడు ఆమెకు షర్ట్ ఇచ్చాడు అది వేసుకొని పనిలోకి దిగింది...*
*ఆమే సిమెంట్ బొచ్చ నెత్తిని పెట్టుకొని పైకి ఎక్కి లోపు,*
 *అతను అతని బొచ్చ వేసేసి ఆమె పై దాకా రాక ముందే ఎదురు వచ్చి ఆమెది అందుకునే వాడు...*
*అందరూ నవ్వుకుని ఎరా దాన్ని నడవనివ్వవా?*
*అని జోక్స్ వేస్తూనే పనిలో పడ్డారు...*
*మధ్యలో బ్రేక్, టి ముందు ఆమెకే ఇచ్చాడు అందరూ ఎడిపించడం చూసి కొత్తగా పెళ్ళయిందా అన్నాను...*

*అక్కడ ఉన్న ఒక పెద్దావిడ అంది అయ్యింది అమ్మా వీళ్ళ ఇద్దరికి కాదు వేరేగా అంది...*
*ఇద్దరికి ఇష్టమే ఇంట్లో ఒప్పుకొల ఇదేమో భయస్థురాలు అంతే ఇద్దరు వేరూ అయిపోయారూ అన్నది...*

*పనిలోకి వచ్చినప్పుడు ఇలా ప్రేమ చూపిస్తాడు అంది నవ్వుతూ ఆ పిల్లాడిని చూస్తూ ...*

*పని అయి పోయే సమయానికి ఆ అమ్మాయి భర్త బండి మీద ఆమె కోసం వచ్చాడు...*

*ఆమె బండి ఎక్కి కూర్చుంది వెంటనే అక్కడే చూస్తూ ఉన్న ఈకుర్రోడు అరే సీనుగా మెల్లగా తీసుకు పోరా అసలే దానికి భయం అన్నాడు...*

*బండి మీద సీను భార్య వైపు చూసి జాగ్రత్తగా కూర్చోవే నువ్వు పడితే ఆడు నన్ను సంప్పేసేలా ఉన్నాడు అన్నాడు నవ్వుతూ...*

*ఆ కుర్రోడితో సహా అందరూ ఒక్కసారే నవ్వేశారు...*

*ఆమె నవ్వుతూ భర్త భుజం పై చెయ్యి వేసి ఒద్దిగ్గా కూర్చుంది...*

*అతను నవ్వుతూ చూస్తున్నాడు... నేను ఆశ్ఛర్యం గా చూస్తూ ఉన్నా...*
*ఎంత హుందాగా ఉన్నారు...*
*ఎంత బోల్డ్ గా ఉన్నారు...*
*ఎక్కడ సంస్కృతి, సాంప్రదాయం అంటూ చెత్త వాగుడు లేదు చక్కటి అవగాహన తో ఉన్నారు...*

*ప్రేమించిన వాడి దగ్గర పనికి పోతే అనే అనుమానం అతనికి లేదు...*

*నన్ను ప్రేమించి వాడిని పెళ్ళి చేసుకొని బండి ఎక్కి పోతుంది అనే అసూయ లేదు అతనిలో...*

*ఇద్దరి దగ్గర ఏమి నాటకమే అంటూ ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను నిందించడము లేదు...*
 *కొన్నాళ్ళు ఆడి మనసు అలాగే ఉంట్టుంది మెల్లగా అదే సర్దుకుంటుంది లే అనే పెద్దరికం...*

*ప్రేమించిన వాడితోనే పెళ్ళి అని ఎక్కడ రాసి లేదే అనే ఆలోచన..*

*వీళ్లంతా పెద్దగా ఏమి చదువుకోలేదు జీవితాన్ని పరిస్థితులను వ్యక్తుల ఫీలింగ్స్ మాత్రమే చదివారు ...*

 *ప్రేమించడం అంటే కలిసి ముందుకు నడవడమే కాదు ప్రేమించడం అంటే ప్రేమ వదులుకోవటంలో కూడా ప్రేమ ప్రేమించడం ఉంట్టుంది....*

No comments:

Post a Comment