*#మన_చిన్నతనం_లో ......*
*చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి' అనేవాళ్ళం*
*4 రంగుల్లో ఒక పెన్ ఉంటే, అన్నీ బటన్స్ ఒకేసారి నొక్కేసేవాళ్ళం ఏం జరుగుతుందో చూసేందుకు*
*భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాళ్ళం*
*లోపలకి వచ్చేవారిని భౌ* *అని భయపెట్టే వాళ్ళం*
*నిద్రపోయినట్టు నటించేవాళ్ళం ,అమ్మ నాన్న ఎవరో ఒకరు మంచం వరకు ఎత్తుకొని తీసుకు వెళ్తారు కదా అని.*
*బస్సులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని ఫాలో అవుతున్నదని గుడ్డి నమ్మకం.*
*రెండు చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వర్షంలో తడిచేవాళ్ళం*
*పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమోనని భయపడేవాళ్ళం*
*రూమ్ బయటకు పరుగెత్తుకువచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తేవాళ్ళం*
*గుర్తుందా ! మనం చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహల పడేవాళ్ళం*
*పెరిగి పెద్దయిన తరువాత, చిన్నతనం ఎంత బావుండేది అని బాధ !!*
*బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం.*
*ఎందుకంటే మనం ఈ మెసేజ్ చదువుతున్నపుడు తప్పనిసరిగా మన మోహం పై చిరునవ్వు విరిసి ఉంటుంది.*
*దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి మన బాల్యం లోకి పంపు అని కోరుకుంటాము*
*స్కూల్ జీవితం !!*
*కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!*
*రంగు రంగుల యూనిఫామ్ !!*
*చిన్న చిన్న ఫైటింగ్ లు !!*
*ఆప్యాయంగా చూసే టీచర్లు !!*
*ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ లు...!!*
*ఫ్రెండ్స్ పుట్టించే పుకార్లు!*
*గ్రూప్ ఫోటోలు !!*
*కాంబినెడ్ స్టడీలు !!*
*ఎప్పటికి తరగని బోరింగ్ పీరియడ్స్*
*తొందరగా అయిపోయే డ్రిల్ పీరియడ్!!*
*రోజూ ఉదయం 7-8 అయినా గానీ నిద్ర లేవని నేను, జెండా పండుగ రోజు మాత్రం ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం!!*
*ఎడతెగని వాదోపవాదాలు !!*
*మిత్రులతోనే చిలిపి తగాదాలు!!*
*మరిచిపోలేని మార్కుల కాగితాలు !!*
*భయపెట్టే ప్రోగ్రెస్ రిపోర్ట్ లు !!*
*సొంతంగా చేసిన "నాన్న సంతకం"*
*తప్పుని కరెక్ట్ అని వాదించే సొంత ప్రయత్నం !!*
*అబ్బో.... అదొక గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!!*
*ప్రతి మనసులో కరిగి, కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం !!*
*బాల్యం అంటే — నిర్దోషమైన నవ్వు, బుర్రలో భ్రమలు, గుండెల్లో కలలు.*
*పెద్దయ్యాక మనం అందుకున్న ప్రతిదానికంటే,*
*ఆ చిన్నప్పటి పూవుల గంధం, పసితనపు చిలిపితనం మించినదేమీ లేదు.*
*మీ మొహంలో చిన్ని నవ్వు కోసం... మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ..*
No comments:
Post a Comment