చెప్పుడు మాటలు గొడవలు సమస్యలు/audio topic/Director A D
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ynblSGZMUyE
Transcript:
(00:09) భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరికి అయిష్టం అనేది పెరిగిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది తగ్గిపోయి గొడవల వల్ల విడిపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే చుట్టుపక్కల వల్ల అంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొత్తగా పెళ్లి అయిన సందర్భంలో ఒకరి ఒకరికి ఉన్నటువంటి ఆకర్షణ ఆ కొత్తదనంలో ఉన్నటువంటి ఆ మురిపం అన్నిటి కారణంగా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా వీళ్ళు చాలా అన్యోన్యంగా సంతోషంగా కలిసి గడపడం అనేది జరుగుతుంది సో అలా గడుపుతున్న వాళ్ళని చూసి చుట్టుపక్కల
(00:54) వాళ్ళు ఓర్వలేక భరించలేక ఎన్నో చాడీలు చెప్పి ఆ భార్య భర్తల మధ్య శిక్షలు పెట్టడం లేదా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేసి ఒకరికొకరికి పడకుండా చేసి క్రియేట్ చేసి ఆ ఇంటిని మొత్తం ఒక నరకంగా మార్చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు సో దీన్ని దీంట్లో జరిగే విషయం ఏంది అంటే వినే వాళ్లకు తెలియలేకపోవడం చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు వినేవాళ్లకు అవగాహన అనేది లేకపోవడం వల్లే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పిన విషయాలని అనుసరించడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఇవి సో ఇలా జరగడం వల్ల ఇలా తెలివి లేకపోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని
(01:41) భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు గొడవలు పెట్టుకోవడం లేదంటే ఆ ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ప్రేమాభిమానాలు అనేటివి పోగొట్టుకొని నానా రకాల మానసిక సమస్యలు ఎదుర్కొని ఇబ్బందులు పడుతుంటారు దీనికి కారణం ఏందంటే చెప్పే వాళ్ళ మాటలు వినే టైం లో మనకు అంటూ ఒక మంచి అవగాహన వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఏ కారణంతో చెప్తున్నారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళని గమనించినప్పుడు మనకంటూ ఒక అవగాహన వస్తుంది దాని కారణంగా వాళ్ళు చెప్పే విషయాన్ని మనం గ్రహించి వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం పాటించకుండా అక్కడనే విని అక్కడే వదిలేసేటువంటి అవకాశం ఉంటుంది సో
(02:24) మనకు తెలివి లేకపోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు చెప్పే ప్రతి మాటని అనుసరిస్తూ వాటినే నమ్మి వాళ్ళు చెప్పే మాటలకు ఎమోషన్ అయిపోయి ఆ ఎమోషన్ తో వాళ్ళు చెప్పిన మాటల్ని ఫాలో అవుతూ ఇంట్లో మన సొంత మనుషుల్ని మనమే దూరం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని జీవితాన్ని నరకంగా తయారు చేస్తుంది సో ఇదన్నమాట ఇది తెలివి లేకపోవడం వల్ల జరుగుతుంది అయితే చుట్టుపక్కల వాళ్ళు ఒక భార్య భర్తలు హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా గడుపుతూ ఉంటే చూసి భరించలేకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితంలో సంతోషం
(03:10) ఆనందం అనేది లేకపోవడం ప్రశాంతమైన జీవితం అనేది లేకపోవడం సో దీంట్లో చిన్న లాజిక్ ఏందంటే ఎవ్వరికైనా కొత్తగా పెళ్లి అయినప్పుడు ఆ కొత్తదనంలో ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆకర్షణ వల్ల ప్రేమ అనేది అధికంగా ఉంటుంది సంతోషం కూడా అధికంగా ఉంటుంది ఆ కొత్తదనంలో వాళ్ళలో ఒకరికి ఒకరికి చాలా రకాల ఎమోషన్స్ చాలా పాజిటివ్ ఆలోచనలు అన్ని అద్భుతంగా ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళ నడవడిక వాళ్ళ మాటలు వాళ్ళ చేతులు అన్నీ కూడా
(03:55) చాలా హుందాగా సంతోషంగా కనిపిస్తూ ఉంటాయి అలా వాళ్లకు తెలియకుండానే వాళ్ళు ఆటోమేటిక్ గా సంతోషంగా అలా మెదులుతూ ఉంటారు అలా గడిపేటువంటి వాళ్ళు కాలక్రమైన కొంత కాలానికి ఒకరినొకరికి ఆకర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ ఆకర్షణ తగ్గిపోతూ ఉంటే వాళ్ళలో ఒకరినొకరికి ప్రేమ అనేది తగ్గిపోతుంది అలా ప్రేమ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళలో ఒకరినొకరికి శ్రద్ధ అనేది తగ్గిపోతూ ఒకరి గురించి ఒకరు కామన్ గా ఆలోచించుకోవడం పట్టించుకోకపోవడం ఒకరంటే ఒకరికి ఎలాంటి
(04:40) ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం వల్ల కొత్తదనం అనేటువంటి ఆకర్షణ లేక వాళ్ళలో ఆ నిరాశక్తి వల్ల ఒకరి ఒకరికి ఎలాంటి ఆ ఆకర్షణీయమైన అభిప్రాయాలు లేకుండా పోతాయి అలా దాని కారణంగా వాళ్ళు ఎప్పుడు నిరుత్సాహంగా ఉండేటువంటి వాళ్ళు ఆ ప్లస్ ఆ పెళ్లి అనే బంధంలో ఉండేటువంటి నానా రకాల సమస్యల వల్ల వాళ్ళలో పెరిగేటువంటి స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు మానసికంగా సో ఆ సమస్యల కారణంగా ఒకరినొకరికి కూడా ఆసక్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది అదే విధంగా చుట్టుపక్కల జీవితాల్లో కూడా
(05:27) జరిగేవి ఇవి సో ఇది కామన్ గా జరుగుతుంది అటువంటి విషయం మీద వాళ్ళకి ఎలాంటి అవగాహన లేక మేము సంతోషంగా లేవు మేము ఎప్పుడు నరకంగా ఎప్పుడు లొల్లిలతో గొడవలతో కొట్లాటలతో ఒకరికొకరికి ప్రేమ అనేది లేకుండా ఒకరినొకరికి ఇష్టం అనేది లేకుండా తన్నుకుంటున్నాను అనేటువంటి ఆ ఇంటర్నల్ వాళ్ళలో వాళ్ళకి తెలియకుండానే బలపడిపోయినటువంటి ఒక సమస్య మానసిక సమస్య అది సో దాని కారణంగా ఎదుటి వాళ్ళు సంతోషంగా కనబడ్డప్పుడు ఇది కామన్ గా అందరిలో జరిగేదే ఆకర్షణ తగ్గిపోయి విడిపోయి తన్నుకోవడం కొట్టుకోవడం ఆ మళ్ళీ బంధాల మధ్య ఏర్పడేటువంటి కొన్ని బరువు
(06:14) బాధ్యతలు ఇలాంటి కొన్ని సమస్యల వల్ల ఎన్నో రకాల సమస్యల వల్ల భార్య భర్తల మధ్య మానసిక సమస్యలు వచ్చి విడిపోవడం అనేది జరుగుతుంది గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి ఇది కామన్ అని తెలియక వాళ్ళు ఈర్ష అనేది పెంచుకుంటూ ఉంటారు సో ఈ కారణంగా వాళ్ళలో పెరిగేటువంటి ఈర్ష వల్ల వాళ్ళు అంటే మేము సంతోషంగా ఉండలేము ఉండే పరిస్థితులు మాకు లేవు కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారేమో అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఈర్ష అనేది పెంచుకుంటూ ఉంటారు చూసి వాళ్ళ అన్యోన్యతను చూసి వాళ్ళ సంతోషాన్ని చూసి భరించలేక వాళ్ళు ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్యలో సంతోషాన్ని చెడగొట్టే ప్రయత్నాలు మొదలెడతారు అది
(06:54) చుట్టుపక్కల వాళ్ళు చేసినటువంటి పని సో తెలివిలేక వాళ్ళ మాటలు విని మనం అవగాహన లేక బంధాల్ని చెడగొట్టుకునే ప్రయత్నాలు మనం చేస్తుంటాం తెలియక తెలిసిన వాళ్ళు చేయరు తెలియని వాళ్ళు మాత్రమే ఫాలో అవుతారు వాళ్ళు ఎలా చెప్తారంటే ఇంట్లో కొన్ని పరిస్థితులను ఇద్దరి గురించి తెలిసినటువంటి కొన్ని పరిస్థితులను తీసుకొని ఏం చేస్తారంటే నాకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చెప్తున్నా నీ కోసమే నేను చెప్తున్నా నీ మంచి కోసమే నేను చెప్తున్నా అనేటువంటి ఒక ఆలోచనని మైండ్ లో నాటి చెప్పడం మొదలు పెట్టారండి అది నీ కోసమే నేను చెప్తున్నా నీ బావ కోసమే నేను చెప్తున్నా లేకపోతే నీ జీవితం
(07:36) బాగోదు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసి కొన్ని రకాల ఆ పరిస్థితులు అంటే భర్తకు నచ్చనటువంటి పనులు భార్యతో చేయించే ప్రయత్నం చేస్తుంటారు సో భార్యకు నచ్చనటువంటి పనులు భర్తతో చేయించే ప్రయత్నాలు చేస్తుంటారు ఇది తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడుతుంటారు ఇలాంటి పనులు చేయడానికి అలా చేసి ఏం చేస్తారంటే కొత్తగా నచ్చని పనులు భార్య చేయడం లేదా అలాంటి పనులు చేయమని చెప్పడం ఇలాంటివి చేయడం వల్ల భర్తకి నచ్చక కోపం వచ్చి ఆ కోపంలో భార్యకి భార్య మీద రకరకాల అపోహలన్నీ పెరిగిపోతూ ఉంటాయి భర్తకి అదే విధంగా భార్య కూడా భర్త మీద
(08:20) ఇలా తెలివి తక్కువ తనంతో ఇతరులు చెప్పేటువంటి మాటల్లో ట్రాప్ లో పడి ఇరుక్కొని వాళ్ళ మాటలు వింటూ ఇంట్లో ప్రయాణాలు చేస్తూ ఆ లేకుంటే నీకు విలువ ఇయ్యరు ఆ నువ్వేం తక్కువ నువ్వు ప్రతి పని నువ్వే చేయాలనా వాళ్ళు ఎందుకు ఇయ్యరు ఇగో ఇట్లాంటివి కొన్ని నాకు తెలిసిన ఉదాహరణలు ఇవి రకరకాల టాపిక్లు వాడుతుంటారు వాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను చూసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకొని ఆ విషయాల మీద వాళ్ళ అవగాహనతోనే వాళ్ళు వీళ్ళని ట్రాబ్ లో పెట్టుకొని అని ఆ నరకాన్ని సృష్టించే ప్రార్థన చేస్తుంటారు అవే విషయాల మీద వీళ్ళు
(09:05) కొన్ని ఆ రాళ్లు వేస్తుంటారు అన్నమాట వాటిని పట్టుకొని భార్య భర్త మీద గాని భర్త భార్య మీద గాని ఇలాంటి త్యాగాలు చేసుకుంటూ వాళ్ళకు తెలియకుండా అమాయకత్వం వల్ల నరకంలోకి వెళ్ళిపోతుంటారు మామూలుగానే పెళ్లి జీవితంలో పెళ్లి అంటేనే ఒక సమస్యల బంధం ఆ బంధంలో ఉన్న వీళ్ళు ఇలాంటి సమస్యలు కూడా కొన్ని కారణం అవుతాయి చుట్టుపక్కల వాళ్ళ కారణం వాళ్ళలో చుట్టుపక్కల వాళ్ళకి ఉన్నటువంటి ఈర్ష వల్ల వాళ్ళు చెప్పే కొన్ని మాటల వల్ల ట్రాప్ లో పడతారు ఎవరైనా కామన్ గా నీ మనిషి కోసం చెప్తున్నా నీ కోసమే చెప్తున్నా అంటే ఎవరైనా పాపం ట్రాప్ లో పడరు ఇట్లాంటివి
(09:47) చెప్తుంటారు అన్నమాట చెప్పి వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే ఇట్లా నీ భర్త నీ మాట వినాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు ఎందుకు వింటాడు అని ఇట్లాంటివి చెప్పడం ఆ నువ్వు ఏది చెప్పినా అది చేయాలి చేయనప్పుడు నీ ప్రేమ లేనట్టే నీ మనసు కోసం చెప్తున్నా అట్లా చేయి జారిపోతారు సో అలాంటి ఎప్పుడు కనిపెడుతూనే ఉండాలి భర్త నన్ను చెప్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు భర్త ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి నువ్వు ఏదైనా పని చెప్పినప్పుడు చేయకపోతే వాళ్ళని అబ్సర్వ్ లో పెట్టాలి ఎందుకు చేయాలి ప్రేమ లేనట్టే ఇలాంటి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు నీ సంసారం నాశనం అయిపోద్ది అప్పుడు నీ జీవితం
(10:31) ఎక్కడ కాకుండా అయిపోద్ది ఇలాంటి లేనిపోని భయాలు చెప్తూ ఇటు భర్త ఒకవేళ వేరే వాళ్ళ ట్రాప్ లో పడితే వాళ్ళ వల్ల భర్త భార్య ట్రాప్ లో పడితే వాళ్ళ వల్ల భార్య ఇద్దరు ఏదో ఎవరి వాళ్ళనో ఎవరి ట్రాప్ లోనో పడి వాళ్ళు చెప్పే మాటలు వినుకుంటూ ఇంట్లో కొన్ని నరకాలను సృష్టించుకుంటారు అప్పుడు లేనిపోని అపోహల వల్ల అవగాహన లేక సో ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో చుట్టుపక్కల చెప్పేటువంటి మాటలు వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మనకు అవసరం లేదు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలో బట్టి మనం ఏం చేసుకోవాలి ఎలా ఆలోచించుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఒకరి గురించి ఒకరు ఎలా
(11:15) ఆలోచించుకోవాలి ఒకరి అభిప్రాయాలు ఏంది ఒకరికి నచ్చనివి ఏంటి నచ్చనివి ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ వాటిని బట్టి మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో చెప్పిన సలహాలు ఇంకా వాళ్ళ సలహాలు పట్టుకొని ఇంట్లో గొడవలు సృష్టించుకొని మన స్పర్ధలు పెంచుకుంటూ జీవితాన్ని నరకంగా మార్చుకోవద్దు ఇది నేను చెప్పేటువంటి సలహా సో ఎందుకు అంటే వాళ్ళు కూడా జీవితం అంటే పెళ్లి జీవితం అంటే ఒక అవగాహన లేకపోవడం వల్ల మేము సంతోషంగా లేము అది కామన్ గా ప్రతి ఒక్కరి భార్య భర్తల మధ్య జరిగేటువంటి సమస్యలే కొత్తగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఉండవు మళ్ళీ ఆ ఇద్దరి మధ్యలో ఒకరి ఒకరికి
(11:55) ఉండేటువంటి అభిప్రాయాలు తగ్గిపోవడం ఆ మనస్పర్ధలు రావడం ఎందుకు అంటే మానసిక పరమైనటువంటి ఈగో సమస్యలు గాని లేకపోతే వాళ్ళ జీవితంలో ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలు గాని బంధువుల వల్ల ఏర్పడేటువంటి సమస్యలు గాని ఆ ఇంటి భారం ఒకరినొకరు పోషించుకున్నటువంటి సమస్యల వల్ల కానీ మనస్పర్ధలు అనేటివి పెరిగిపోయి విడిపోవడం అనేది జరుగుతుంది విడిపోవడం అంటే దూరంగా విడిపోయేటువంటి పరిస్థితి లేకున్నప్పటికీ మనశాంతి అనేది లేకుండా సంతోషం అనేది లేకుండా పోతుంది ఇది కాదు కామన్ గా ప్రతి ఒక్కరి భార్య భర్తల జీవితంలో జరిగేటువంటి విషయాలు సో ఈ అవగాహన వాళ్లకు లేక వీళ్ళు సంతోషంగా ఉంటున్నారు
(12:38) అని చెప్పేసి వాళ్ళు కొత్తలో సంతోషంగా ఉన్న ఆ కొన్ని పరిస్థితులను చూసి వాళ్ళ మీద ఈర్ష పెంచుకొని ఆ ఈర్షతో వాళ్ళని ఎలాగైనా ఈ ట్రాప్ లో పెట్టుకొని నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అది కామన్ గా జరుగుతూ ఉంటది అది తెలివి తక్కువ వాళ్ళు తెలివి లేక వాళ్ళ మాటలు విని వాళ్ళ ట్రాబ్ లో పడటం వల్ల జరుగుతాయి తప్ప అలాంటి వాళ్ళు ఎన్నో చెప్తారు చెప్పినంత మాత్రాన వినాల్సిన అవసరం లేదు వినకూడదు కూడా సో అలాంటి వాళ్ళని అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు తెలియలేదు అని చెప్పేసి మనం ఆలోచించుకొని మనమే కొన్ని తెలివిగా ముందుకు నడుచుకునే ప్రయత్నాలు
(13:17) ఆలోచనలు చేసుకుంటూ ఉండాలి సో ఇదన్నమాట సో చుట్టుపక్కల వాళ్ళు నేను కొన్ని ఉదాహరణలు చెప్తే నాకు తెలిసినాయి కొంతమంది సమస్యలు నేను విని అర్థం చేసుకొని చెప్తున్నా సో జాగ్రత్త ఎందుకు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ కారణాల వల్లే కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు ఈర్షతో వాళ్లకు కూడా అవగాహన లేకపోవడం వల్లే చేసేటువంటి ప్రయత్నాలు ప్రతి ఒక్కరి జీవితంలో భార్య భర్తల మధ్య జరిగేటువంటి ఎన్నో సమస్యలు అది పెళ్లైన కొత్తలో ఉండవు కాలక్రమైన జీవితాన్ని గడుపుతా ఉంటే సమస్యలు అనేటివి పెరుగుతా ఉంటాయి మనస్పర్ధలు అనేటివి పెరుగుతా ఉంటాయి సమస్యల వల్ల ఒత్తిడి వల్ల ఇద్దరి మధ్యలో
(13:55) సంతోషం అనేది లేకుండా పోయి నానా రకాల ఇబ్బందులతో బతికేటువంటి పరిస్థితిలో తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క భార్య భర్తల మధ్యలో జరిగేటివి ఇవే కానీ వాళ్లకు అవగాహన లేక మేము మాత్రమే సంతోషంగా ఉండలేము అందరూ సంతోషంగా ఉంటున్నారు అన్నటువంటి అపోహలో చుట్టుపక్కల వాళ్ళని కావాలని ఆ ఉన్న కొద్దీ సంతోషాన్ని కూడా ఆ కొద్ది రోజుల సంతోషాన్ని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు సో తెలివి అన్నది ఉండాలి కొంచెం అవగాహన పెంచుకుంటే ఇలాంటి సమస్యలు ఇరుక్కోకుండా వాళ్ళు ట్రాప్ లో ఇరుక్కోకుండా సమస్యలు అనేటివి లేకుండా బతికే ప్రయత్నం చేయాలా సో చాలా
(14:34) తెలివిగా చేస్తారు వాళ్ళు వాళ్లకున్న అవగాహన జీతం మీద ఉండదు కానీ ఇంకొక నిల చెల్లగొట్టాలి అనే దాని మీద చాలా అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్లకు మనుషుల్ని ఎట్లా ట్రాప్ లో పెట్టాలి ఎట్లా వాడుకోవాలి అని చెప్పేసి వాళ్లకు ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసేటువంటి పనులు అన్నమాట ఇవి సో దయచేసి చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినడం వాళ్ళ మాటల్ని ఫాలో అవ్వడం వాళ్ళ ట్రాప్ లో పడడం ఫస్ట్ మొట్టమొదటి తప్పు తెలివి తక్కువతనం మనదే అని ఆలోచించుకోవాలి ఆ రెండో తప్పుగా వాళ్ళని వర్ణించాలి తప్ప మనం డైరెక్ట్ గా ఎదుటి వాళ్ళదే తప్పు అని మాత్రం మాట్లాడకూడదు మనకు తెలియలేకపోవడం
(15:12) వల్ల వాళ్ళ మాటలు వినే ఆ పరిస్థితుల్లోకి ఇరుక్కుంటున్నాం కాబట్టి మనం ఆలోచించుకోవాలి మన గురించి మనం మనకు తెలివి ఉంటే ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనం వాళ్ళు ట్రాబుల్ అవ్వడం మనం అలాంటి ఆ కఠినమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి నరకాన్ని చూసేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయి ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉండదు సో అది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంది అంటే ఎప్పుడైనా మనం ఆలోచన చేసే విధానం ఎలా ఉండాలి అంటే మన పరిస్థితులు మనతో జీవితాన్ని పంచుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
(15:56) భార్య కానీ పిల్లలు గాని అమ్మ గాని నాన్న గాని తమ్ముడు గాని గాని చిల్ల గాని ఇలాంటి వాళ్ళందరి మనస్తత్వాలు ఏంది ఫస్ట్ వాళ్ళ ఇష్టా ఇష్టాలు ఏంది వాళ్ళకి ఇవి నచ్చితే అవి నచ్చాయి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కొన్ని పనులు ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ పని చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగే పరిస్థితులు ఉంటాయా ఏమైనా సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటాయా అనేటివి ఆలోచించుకొని మన పరిస్థితుల గురించి మనమే ఆలోచించుకోవాలి తప్ప ఇంకోరు సలహాలు ఇందులో తీసుకొని మనం ఎప్పుడు గాని ఫాలో అయ్యే
(16:39) ప్రయత్నాలు మాత్రం చేయొద్దు ఇదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మన పరిస్థితులు మన ఇంట్లో వాళ్ళ పరిస్థితులు మనస్తత్వాలు అన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మనమే ఆలోచించుకొని చేసుకోవాలి తప్ప చుట్టుపక్కల వాళ్ళ సలహాలు వినడం చుట్టుపక్కల వాళ్ళని ఫాలో అవ్వడం నీ కోసమే నేను చెప్తున్నా నీ మంచి కోసమే చెప్తున్నా నీ బావు కోసమే నేను చెప్తున్నాను అనేటువంటి కొన్ని చెప్పేటువంటి మాటలు వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పరిస్థితులు మనకు తెలిసి ఉంటాయి సో మన పరిస్థితులలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో మనకు తెలిసి ఉంటది కానీ చుట్టుపక్కల వాళ్ళకు ఎవ్వరికీ తెలిసి
(17:13) ఉండదు కాబట్టి దయచేసి చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేయొద్దు మన ఇంట్లో పరిస్థితులను బట్టి మన ఇంట్లో మనస్తత్వాలను బట్టి ఒక పని మనం ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు అని చెప్పేసి ఆలోచించుకొని ఒకరినొకరు నొప్పించుకునేటువంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్తగా పడుతూ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కొంతలో కొంత మానసిక పరమైన ఉత్తి అనేది తగ్గిపోతుంది అనేది నా ఉద్దేశం సో జాగ్రత్త
No comments:
Post a Comment