POSTCARD (9) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=es72MSjMO7s
Transcript:
(00:01) స్నేహం ప్రేమ అభిమానం ఇవేవి నిలబడాలన్నా అండర్ కరెంట్ గా గౌరవం ఉండాలి. గౌరవం అన్నది నిజమైన స్నేహానికి స్వచ్ఛమైన ప్రేమకి ఎక్స్పెక్టేషన్ లేని అభిమానానికి ఒక పునాది లాంటిది. పూజారి అందరికీ ఒకేలా తీర్థం ఇస్తాడు. సూర్యకాంతి అందరిపై ఒకేలా పడుతుంది. వర్షం అందరినీ ఒకేలా తడుపుతుంది. గౌరవం ఇలా ఉండాలి. గౌరవం అతిగా ఉండకూడదు అలాగని లేకుండా ఉండకూడదు. గౌరవం మన స్వభావం కావాలి.
(00:47) మానవ సంబంధాలు చెడిపోవడానికి కారణం ఈ గౌరవం దెబ్బ తినటమే మనకి కొందరి పట్ల స్నేహం ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరి పట్ల ప్రేమను ప్రదర్శిస్తాం. కొందరంటే అభిమానం ఉంటుంది. ఒక వ్యక్తి తన ప్రియురాలని ప్రేమిస్తాడు. తన క్లాస్మేట్ ని స్నేహంగా చూస్తాడు. అట్లాగే ఒక సినిమా హీరోని అభిమానిస్తాడు. మూడు వేరే వేరే పదాలుగా కనిపిస్తున్నాయి.
(01:16) మూడు భిన్న అభివ్యక్తులుగా కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ అండర్ కరెంట్ గా గౌరవం ఉంది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందుకే గౌరవించడం అనేది మన స్వభావం కావాలి. గౌరవించడం అంటే నువ్వు కలిసిన ప్రతి ఒక్కరికి దండేసి దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని అంగీకరించగలగడం ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాల్ని నువ్వు కించపరచకపోవడం అట్లాగే తన భావాలని తగ్గించకపోవడం అతను ఎలా ఉండాలనుకుంటున్నాడో అతను ఉండే విధంగా తనకు ఒక స్పేస్ ని ఇవ్వడం మన ఈగోని పక్కన పెట్టి నీతో సమానంగా పక్క వ్యక్తిని ట్రీట్ చేయడం గౌరవం యొక్క స్వభావం ఇది
(02:04) గౌరవం అహంకారం కాదు సో ప్రేమకి పునాది గౌరవం స్నేహానికి ప్రాణం గౌరవం అభిమానానికి విన్నముక లాంటిది గౌరవం నీ అవసరాల కోసం నీ పని జరిపించుకోవడం కోసం ఒకరిని సార్ అని పిలవడం కాదు గౌరవం అంటే ఎదుటి వ్యక్తి కూడా నీలాంటివాడే అని లోపల తెలుసుకోవడం ఇమాన్యల్ కాంట్ అంటాడు ట్రీట్ హ్యూమానిటీ వెదర్ ఇన్ యువర్సెల్ఫ్ ఆర్ ఇన్ అనదర్ ఆల్వేస్ యస్ న్ ఎం అండ్ నెవర్ మేర్లీ యస్ ఏ మీన్స్ అంటాడు.
(02:41) మనిషిని నీతో సమానంగా చూడు నీ యొక్క లక్ష్యాలు పూర్తి చేసుకోవడానికి అతను ఒక సాధనంగా ఉపయోగించకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక ఇంటికి ఒక కొత్త కోడలు వస్తుంది అతిగా గౌరవిస్తారు. ఇప్పుడే ఒక ఫ్రెండ్ పరిచయమయ్యాడు అతిగా గౌరవిస్తారు. దీని వల్లే నష్టం ఆ తర్వాత మెల్లమెల్లగా ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. మనం ఎన్నో ఇన్స్టాన్సెస్ చూసాం.
(03:10) ప్రతి ఇంట్లో మానవ సంబంధాలు దెబ్బ తినటానికి గొడవలు అవ్వడానికి అర్థం పడతం లేని ఆర్గ్యుమెంట్స్ చేరడానికి కారణం ఏంటి? రెస్పెక్ట్ దెబ్బ తిన్నది. సో ప్రేమ అన్నది గౌరవం గనుక లోపిస్తే అది మెల్లగా స్వాధీనంగా మారుతుంది. స్నేహం గౌరవం లేకుంటే అది హద్దులు దాటుతుంది. అభిమానం గౌరవం లేకుంటే అది ఒక అహంకారపు చేష్టగా మారుతుంది.
(03:41) సో ప్రేమించినా ఒకవేళ స్నేహం చేసినా ఒకవేళ ఒకరిని అభిమానించిన వాళ్ళందరి పట్ల గౌరవాన్ని ఈక్వల్ గా కలిగి ఉండు. రోడ్డు మీద ఉన్న ఒక అటెండర్ లేకపోతే ఆఫీస్ లో ఉన్న ఒక సఈఓ వాళ్ళతో వ్యవహరించే తీరు వేరేగా ఉండొచ్చు భాషపరంగా బట్ అంతర్గతంగా గౌరవం ఒకేలా ఉండేలా చూసుకో ఇది జీవితాన్ని చాలా ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. మన జీవితంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చేస్తుంది.
(04:11) మన మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూస్తుంది. సో నీ గౌరవం నీ స్వభావం కావాలి. అది ఎదుటివాడి స్థితిని బట్టి మారకూడదు. సందర్భాన్ని బట్టి మాటతీరు మారని ఒకరిని ఒరే అనొచ్చు ఒకరిని సార్ అనొచ్చు బట్ అంతర్గతంగా గౌరవం ఏమన్నా మారుతుందా లేదా అన్నది ఒక ఎరుకతో గమనిస్తే అప్పుడు మానవ సంబంధాలు బాగుంటాయి. కన్ఫ్యూషియస్ అంటాడు ఫేమస్ ఫిలాసఫర్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ విల్ రెస్పెక్ట్ యు అని నీకు నువ్వు ఎలా గౌరవించుకుంటావో అదే గౌరవాన్ని అందరికీ ఇవ్వు అంటాడు.
(04:46) ఎవరనా నిన్ను తిడితే నీకు ఎట్లా అనిపిస్తుంది ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నీకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు అలా చేస్తే అందరికీ అలాగే అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ నిన్ను ఎలా ట్రీట్ చేయాలని నువ్వు అనుకుంటావో అదేవిధంగా అందరిని ట్రీట్ చెయ్ మెకానికల్ గా కాదు ఆర్గానిక్ గానే ఒకరిని గౌరవించడం అన్నది నటన కాకూడదు. చాలామంది నటిస్తారు గౌరవాన్ని అతిగా దండాలు పెడతారు వంగి వంగి దండాలు పెడతారు కాళ్ళు మొక్కుతారు కానీ లోపట లాభాపేక్ష ఉంటుంది.
(05:18) నిజంగా రెస్పెక్ట్ ఇస్తున్నారా ఆహా అవసరం కోసం రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎవరెవరైతే అవసరం కోసం రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళకి ఆ వ్యక్తులతో మెల్లమెల్లగా సంబంధాలు దెబ్బతింటాయి. మనుషులని వదిలేస్తారు. నీకు కావలసిన పని జరగలేదు ఆడఎవడైతే మనకేంటి అనుకుంటారు. ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు. ఒక వ్యక్తి యొక్క హోదాను చూసి గౌరవించే వాళ్లే ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ.
(05:42) సో ఒక వ్యక్తి హోదాను చూసి ర్యాంకును చూసి కాదు ఆ వ్యక్తిని చూసి అతని స్థితిని చూసి గౌరవించాలి. అతను నీలాంటి వాడే అని తెలుసుకొని గౌరవించాలి. ఒక వ్యక్తి వల్ల మనకు ఉండే ఉపయోగం చూసి కాదు ఆ వ్యక్తి ఉనికిని చూసి గౌరవించాలి. సో గౌరవం ఒక సహజమైన రెస్పాన్స్ గా ఉండాలి. అప్పుడు మానవ సంబంధాలు హాయిగా ఉంటాయి. నేను గొప్ప నీవు చిన్న అనే భావన లేకపోవడం యాక్చువల్ గా గౌరవం.
(06:13) సో మనం మాట్లాడే మాటల కంటే మనసులో వచ్చే ఒక అంగీకార స్వభావం గౌరవానికి మూలం. ఒక ఎదుటి వ్యక్తిని మార్చాలన్న ప్రయత్నం కంటే ముందు అతన్ని అర్థం చేసుకోవడం గౌరవం. తాను అనుసరించే మార్గమే ఏకైక మార్గం అని ఒకరిని ఒత్తిడి చేయకపోవడం గౌరవం. వినడం నిజమైన గౌరవం ఆధ్యాత్మికత ఆనందం జీవితం ఇవేవి బ్రహ్మ పదార్థాలు కావు చిన్న చిన్న పనుల్లో అవి రిఫ్లెక్ట్ అవుతాయి.
(06:46) స్నేహితుడు కదా చాలా ఏళ్లుగా తెలిసినవాడు కదా అని మాట జారకండి. మీ పరిధిలో మీరు ఉండండి. కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో మాట జారితే ఆ స్నేహితుల హృదయాన్ని కలుపుకోమనొచ్చు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళు మనల్ని అవాయిడ్ చేయొచ్చు. మనకు పెద్దగా కారణం తెలియదు ఎందుకు ఆ ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదు ఎందుకు ఈ కుటుంబం మాకు దూరమైంది ఎందుకు నాకు ఇతని నుంచి ఫోన్ రావడం లేదు ఎక్కడో మీరు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టారు మాటలతో సో గౌరవం అన్నది మనం వ్యక్తపరచడానికి మాట ఒక ఆధారం మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒక ఆధారం మన స్పందన ఒక ఆధారం అదర్వైస్ నువ్వు మూలకి
(07:26) మౌనంగా కూర్చుంటే నువ్వు ఒకరికి గౌరవిస్తున్నావా లేదా ఎట్లా తెలుస్తుంది అది ఎప్పటికీ తెలియదు సో నేను మాత్రమే కాదు మనం అన్న ఒక భావన ఉండాలి. ఈ సమాజంలో నువ్వు ఒక్కడివే మనగడ సాగించలేవు నువ్వు మనగడ సాగించాలంటే నీకు వేరే వాళ్ళ సహాయం కూడా కావాలి. ఇది ఓన్లీ లాభాపేక్ష లేకపోతే ఎక్స్పెక్టేషన్ దీని ఆధారంగా కాకుండా ఒక మనిషి ఉన్నాడు.
(07:52) ఒక మనిషి యొక్క ఉనికి నాకు చాలా అవసరం అని గుర్తించడంతో జీవితంలో నిజంగా గౌరవం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనందరికీ తెలుస్తుంది. సో ఇతరుల్లో ఉన్న లోపాలు చూడు కానీ దాంతో పాటు అతనిలో ఉన్న వెలుగును కూడా చూడు ఇతరులు చేసే తప్పులను చూడు కానీ ఆ తప్పులు మార్చడానికి నువ్వు సాధనంగా చేసుకుంటున్న మాధ్యమం ఏంటో కూడా చూడు.
(08:17) అప్పుడు జీవితంలో ఒక చేంజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు చేయవలసిందల్ల నీ యొక్క ఎగ్జిస్టెన్స్ వల్ల ఒకరు నష్టం లేకుండా చూడడం అది మాట వల్ల కానీ చూపు వల్ల కానీ చేష్ట వల్ల కానీ ఇది మనకు స్కూల్లో లేకపోతే సమాజంలో ఎవరు నేర్పించరు. మన కుటుంబంలో కూడా ఎవరు నేర్పించరు. ఇది వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో గౌరవం అన్నది ఒక ఆధ్యాత్మిక భావన.
(08:43) ఎవరైనా సరే వారి జ్ఞానోదయం కలిగిందంటే సమస్త ప్రాణకోటి పట్ల సమస్త జీవ రాశి పట్ల సమస్త మానవ సమాజం పట్ల ఒక సహజమైన గౌరవ భావం ఉదయిస్తుంది. అది అనివార్యం ఎక్కువ తక్కువలంటూ ఏమ ఉండవు. ఎప్పుడైతే ఎక్కువ తక్కువలు వస్తాయో కచ్చితంగా అక్కడ కొన్ని సమస్యలు రావడం మొదలవుతుంది. నేను చెప్పిన విషయాల గురించి సరదాగా ఆలోచించండి.
(09:10) మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒకసారి చూడండి. ఒకరిని చూడగానే మనలో ఒక రకమైన అగౌరవ భావన కలుగుతుంది. అది ఏదైనా ఉంటే తీసేయండి. ఒకరిని అగౌరవంగా చూడడం వల్ల అతనికి నష్టం ఉందో లేదో అలా చూస్తున్న మనకే నష్టం. అందరినీ గౌరవించండి. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారందరికీ ఒకే విధంగా ప్రసాదం పెట్టినట్టు తీర్థం ఇచ్చినట్టు షటగోపం పెట్టినట్టు ఆశీర్వాదం ఇచ్చినట్టు వాటిలో ఎక్కువ తక్కువలు ఉండవు ఎక్కువ ఆశీర్వాదం తక్కువ ఆశీర్వాదం అలాంటిది ఏమి ఉండదు శుభేచ్చ ఎక్కువ తక్కువలు ఏమీ ఉండవు.
(09:44) అట్లాగే ఒక సూర్యకాంతి అన్నిటి మీద ఒకేలా పడుతుంది. మర్రి చెట్టు మీద ఒకలాగా చింత చెట్టు మీద ఒకలాగా తులసి మొక్క మీద ఒకలాగా ముళ్ళ కంపు మీద ఒకలాగా ఏం పడదు. అట్లాగే మీ గౌరవాన్ని అందరి మీద ఒకేలా ప్రదర్శించండి. మాటతీరు మారవచ్చు చనువు వేరు గౌరవం వేరు చనువు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ గౌరవం అందరి పట్ల ఒకేలా ఉండటం అన్నది ప్రేమకు కానీ స్నేహానికి కానీ నిజమైన అభిమానానికి కానీ పునాది.
(10:14) సో మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా నాకు మీరు తెలిసిన తెలియకపోయినా మీ అందరి పట్ల నాకున్న గౌరవం ఒక్కటే చనువు వేరుండొచ్చు మా అన్నతో ఒకలా మాట్లాడతాను. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ తో ఒకలా మాట్లాడతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతుందంటే నా మాటను వినకి తీసుకుంటాను. సో మన స్నేహం పెరగకూడదు తగ్గకూడదు.
(10:38) దానికే స్నేహం అని పేరు. ఈ విషయాల గురించి ఒకసారి ఏకాంతంగా ఆలోచించండి. మానవ సంబంధాలు చెడిపోతే మన మనుగడ మన ఉనికి కాస్త ఇబ్బంది పడుతుంది. అందుకని మానవ సంబంధాలు చెడిపోకుండా ఒకరి మనసులను గాయపరచకుండా మనం జీవితాన్ని జీవించే చిన్న ప్రయత్నం చేద్దాం. సో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను.
(11:04) అందరికీ సమాన గౌరవాన్ని ఇచ్చి చూడండి. జీవితం చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికతకి నిజమైన ఆనందానికి ఇదే పునాది ప్రీసవైస
No comments:
Post a Comment