Sunday, April 19, 2026

Pearls of Wisdom: Sri Ramana Maharshi on Breaking Worldly Bonds

Pearls of Wisdom: Sri Ramana Maharshi on Breaking Worldly Bonds

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oyOXVuP019Y



Transcript:
(00:01) భగవాన్ వారి యొక్క లీలలు అనంతముగా దేశమంతటా వ్యాపించి ఎందరో భక్తులు భగవాన్ దర్శనానికి విదేశీయులతో సహా వచ్చిపోతుండేవారు. వారు ఎన్నో గొప్ప విషయాలు ఆత్మ సాక్షాత్కారం గురించి భగవాన్ దివ్యమైన ఆత్మబోధలను ఎన్నో చేశారు. నిజానికి భగవాన్ గురించి రాయమంటే ఏం రాయగలం వారు చెప్పిన బోధలు సముద్రమంతా వైశాల్యము కలిగి సముద్రమంతా లోతులో ఉండేటటువంటి బోధలు ఎన్నెన్నో కలవు అన్నీ రాయుట కష్టం ఎందుకంటే వారు చెప్పిన ప్రతి మాటలో అంతరార్థం దాగి ఉన్నది.
(00:38) అన్ని ఏరి పట్టుకొని రాయడం అంటే నాబోటి వారికి ఎంతో కష్ట సాధ్యమైనది. భగవాన్ని అనన్య శరణాగతి కోరి సముద్రము వంటి వారి బోధల్లో కొన్ని ఆణిముత్యాలను స్వీకరించి తెలియపరుచున్నాము. ఇక నుంచి వచ్చే ప్రతి అధ్యాయము ఆణిముత్యములుగా పరిగణించబడుతుంది. భగవాన్ వారి తల్లి నిర్యాణము చెందిన పిదప వెంటనే లేచి వచ్చి అందరితో భోజనం చేసినారని చెప్పుట జరిగింది.
(01:05) భగవానుకు ఎటువంటి మహిళా ఆచారాలు పట్టింపులు చూపేవారు కాదు వారి వద్ద వచ్చిన భక్తులను వారికి ఉన్న ఆచారాలఅనే బంధాన్ని తప్పించుటకు భగవాన్ ప్రయత్నించేవారు. పైగా భగవాన్ ఎల్లప్పుడూ ఏది వద్దు నిశ్చలముగా కూర్చో అదే సరైనది ఏ యాత్ర అవసరము లేదు ఈ అరుణాచలమే కాశీ హిమాచలం అని అనేవారు. మురుగనార్ తల్లి ఆబ్దికము రోజున ఒక పెద్ద పనసకాయను తెచ్చి ఆశ్రమంలో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను అదే సమయమున భగవాన్ అక్కడికి వచ్చి ఈ మమకారాలు ఇంకా పోలేదన్నమాట అని అన్నారు.
(01:41) భగవాన్ ఇట్లనెను క్రతువులు కూడా మనిషికి బంధాలే ఇది వినటానికి సంశయముగా ఉన్నప్పటికీ భగవాన్ చెప్పింది అక్షర సత్యం మనిషి జీవించి ఉండగానే ముక్తి పొందవలెను వారే జీవన్ముక్తులు దానికి మనిషి బంధాలను తెంచుకోవటమే మార్గము ఏ బంధము లేనివాడు జీవన్ముక్తుడే కర్మానుగుణముగా కర్తవ్యానుసారముగా మనిషి తల్లి తండ్రి భర్త భార్య పుత్రులు ఈ విధమైన సంబంధం మన శరీరానికి మాత్రమే పెట్టుకున్న బంధాలే తప్ప లోన ఆత్మకు కాదు భగవాన్ మురుగనార్ గారి తల్లి ఆబ్దికము రోజున పనసకాయ పంచుట చూచి మమకారము ఇంకా వీడలేదని గ్రహించిన భగవాన్ తన భక్తునికి సూచననిఇచ్చినారు.
(02:22) చివరకు క్రతువులు చేసినను అవి బంధాలే అవుతాయని నిర్ధారించినారు. సుందరేశయ్యర్ అనునతుడు భగవాన్ భక్తుడు వీరి విషయంలో కూడా ఒకసారి వారి తండ్రి గారికి తర్పణము వదలాలనే ఉద్దేశ్యంతో ఆ తర్పణము చేసే రోజున ఏ ఫలహారము తీసుకొనక కార్యనిమగ్నులై ఉన్నారు. అది గమనించిన భగవాన్ తన భక్తుని ఫలహారము చేసినంత మాత్రమున వారికి ఏ హాని జరగదని హామీ ఇచ్చినారు.
(02:51) సంపూర్ణమ్మ అనే భక్తురాలు అరుణాచలంలో రమణాశ్రమమున కొన్ని రోజులు వంటపని చేసినారు. ఆశ్రమంలో ఆడవారు బయట ఉన్న సమయమున ఆశ్రమ భోజనము చేయరు. ఎక్కడో వేరే చోట ఏర్పాటు చేసేవారు. ఒకసారి సంపూర్ణమ్మ బయట ఉన్న సమయమున ఆమెకు భోజనము ఎక్కడా ఏర్పాటు కాలేదు. కావున ముష్టివారు ఉన్న మంటపంలో కూర్చొని ఉన్నది. భగవాన్ ఆరోజు సంపూర్ణమ ఏది అని అడిగినారు జరిగినది భగవానుకు చెప్పగా భగవాన్ ఆమెకు భోజనము పెట్టండని ఆజ్ఞాపించారు.
(03:18) ఆశ్రమంలోని వారు భోజనమును మంటపమునకు తీసుకొని పోయి పెట్టెదమని భగవాన్నని వేడగా అందుకు భగవాన్ కోపించి ఏం కర్మం ఆమెను రమ్మనండి బయట ఉంటేనే అంతా బ్రహ్మం ముట్టేమిటి ఇక్కడికి రమ్మనండి అని భగవాన్ ఆజ్ఞాపించినారు. భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడు కూడా ఆ ఆశ్రమమునకు కట్టెలు తెచ్చేవానికి భోజనం పెట్టమని తల్లికి చెప్పేవారు భగవాన్ తల్లి మడి ఆచారము ఉన్నను భగవాన్ ఏ మనిషిలోను తారతమ్యాలు చూసేవారు కాదు అలాగే రంగన్న అనే భక్తుడు తన తండ్రికి తర్పణం విడవడానికి ఊరికి వెళ్తానంటే భగవాన్ ఒక గ్రూపు ఫోటోలో ఉన్న అతని తండ్రిని చూపి నీ తండ్రి ఇక్కడే ఉన్నారు అని అన్నారు.
(04:00) ఒకసారి ఆశ్రమం వండింట్లో పని చేసే ఒక ఆడమనిషి బయట ఉన్నదని ఆమెకు ఫలహారం వేరుగా చేసి ఇవ్వబోగా అది గమనించిన భగవాన్ అదేమిటి బయట ఉంటే మైళ ఏ మైళ ఎందుకు మైళ అట్లా బేధం చూపకండి అని అన్నారు భగవాన్ చెప్పిన పలుకులు ఆణిముత్యాలు వారి బోధనలో ఎన్నో రహస్యాలు ప్రకాశించి ధైర్య శక్తిని కలగజేయును అయితే వాటిని దృఢముగా నమ్ముకొని విశ్వసించి భగవాన్ చెప్పిన ప్రతి మాటలో గూడార్థమును గ్రహించి శరీరము అనే మాటను మరిచి ఆత్మ అనే మాట ఎల్లప్పుడూ తలచి ఉన్నవారికి ఎటువంటి బంధములు క్రతువులు ఆచారములు మైలా మడి అనువంటివి ఏవి ఉండవు ఆ దృఢమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని
(04:43) ధైర్యాన్ని మనకు కూడా కలగాలనని భగవాన్ శ్రీ రమణ మహర్షిని శరణు వేడదాం రమణ నీవే మాకు శరణాగతి

No comments:

Post a Comment