కోట్ల విలువైన రేసింగ్ జీవితాన్ని వదిలి ఎందుకు ఇలా నడుస్తున్నాడు? I Axel Pons Barefoot Walk
Author Name:Telugu Deep Vision
Youtube Channel Url:https://www.youtube.com/@telugudeepvision
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XzkpGOZwoLQ
Transcript:
(00:00) మీటర్ల వేగంతో రైసింగ్ బైక్ నడిపిన ఒక వ్యక్తి ఇప్పుడు చెప్పులు కూడా లేకుండా ప్రపంచాన్ని నడుస్తున్నాడు. అతని పేరు అక్సెల్ పోన్స్ ఒకప్పుడు మోటోట రేసింగ్ లో కనిపించిన అక్సల్ ఇప్పుడు రోడ్లపై ఒక చిన్న బ్యాగ్ తో నడుస్తూ కనిపిస్తున్నాడు. అసలు ఇంత పెద్ద మార్పు ఎందుకు వచ్చింది? రేసింగ్ లో ఉన్నప్పుడు అతని జీవితం ఎలా ఉండేది? చివరికి అన్ని వదిలేసి ఇలా ఎందుకు నడవాల్సి వచ్చింది? ఈరోజు మనం ఈ వీడియోలో అక్సల్ పాన్స్ గురించి తెలుసుకుందాం.
(00:30) వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్సల్ పోన్స్ 1991 లో స్పెయిన్ లోని బార్సిలోనాలో జన్మించాడు. అతనికి చిన్నప్పటి నుంచే రేసింగ్ ప్రపంచం తెలుసు. ఎందుకంటే అతని తండ్రి సిటోపోన్స్ స్వయంగా ప్రపంచ ఛాంపియన్ రేసర్ సిటోపోన్స్ 1988లో మళ్ళీ 1989లో 250సిసి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు.
(00:57) అంటే అక్సల్ పెరిగిన ఇంట్లోనే రేసింగ్ గురించి చర్చలు, బైక్లు, రేస్ ట్రాక్లు అన్ని సాధారణ విషయాలే. అందుకే అక్సల్ కూడా చిన్న వయసులోనే అదే ప్రపంచంలోకి వెళ్ళాడు. 2007 లో అక్సల్ తన రేసింగ్ కెరియర్ ను స్పెయిన్ జాతీయ 250సి ఛాంపియన్షిప్ లో ప్రారంభించాడు. తర్వాత 2008 లో మొదటిసారి వరల్డ్ ఛాంపియన్షిప్ లో 125సి క్లాస్ లో రేస్ చేశాడు.
(01:25) మళ్ళీ 2009 లో 250సి వరల్డ్ ఛాంపియన్షిప్ లో పూర్తి సీజన్ రైడర్ గా మారాడు. ఆ తర్వాత 2010 లో మోటో 2 ప్రారంభమైనప్పుడు ఎక్సెల్ కూడా ఆ కొత్త క్లాస్ లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి 2017 వరకు అతని జీవితం దాదాపు పూర్తిగా రైసింగ్ చుట్టూనే తిరిగింది. అంటే మోటో టు రైసింగ్ అంటే మనం సాధారణంగా రోడ్లపై చూసే బైక్ నడపడం కాదు. ప్రత్యేకంగా రేసింగ్ కోసం తయారు చేసిన బైక్లతో ట్రాక్ పై చాలా ఎక్కువ వేగంతో పోటీ పడాలి.
(01:53) ఒక్కో మూలలో బ్రేక్ వేయాల్సిన సమయం బైక్ ను వంచే విధానం అన్ని క్షణాల్లో నిర్ణయించాలి. అక్సల్ కూడా ఎన్నో సంవత్సరాలు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు.మోటో మోటో 2 లో అతను మొత్తం 126 రేసుల్లో పాల్గొని 176 పాయింట్లు సాధించాడు. అయితే అతనికి మోటో 2 రేస్ విజయం లేదా పోడియం మాత్రం రాలేదు. 2017 సంవత్సరం అక్సల్ జీవితంలో పెద్ద మలుపు తీసుకొచ్చింది.
(02:17) ఆ సీజన్ లో ఒక ప్రమాదం తర్వాత అతని రెండు మణికట్టులకు గాయాలు అయ్యాయి. అప్పటికీ అతని వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అక్కడితో అతని ప్రొఫెషనల్ రేసింగ్ ప్రయాణం ముగిసింది. ఇంత చిన్న వయసులో రేసింగ్ లాంటి జీవితాన్ని వదిలేయడం అంత సులభం కాదు కానీ అక్సల్ అక్కడితో ఆగిపోలేదు. కొంతకాలం మోడలింగ్ కూడా చేశాడు. అంటే రేసింగ్ ప్రపంచం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతనికి వేరే అవకాశాలు ఉన్నాయి.
(02:44) కానీ కాలం గడిచే కొద్ది ఆ తక్సెల్ ఆలోచనలు మారిపోయాయి. బయట నుంచి చూస్తే రేసింగ్ పేరు సౌకర్యాలు అన్నీ ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ అతనికి మాత్రం జీవితంలో ఇంకేదో కావాలనిపించింది. ఎప్పుడూ వేగంగా వెళ్ళడం ఏదో ఒక లక్ష్యం కోసం పరిగెత్తడం కంటే కొంచెం నెమ్మదిగా జీవితం ఎలా ఉంటుందో చూడాలి అనిపించింది. చివరికి అతను సాధారణ జీవితానికి కూడా దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు.
(03:09) అక్కడి నుంచే అతని జీవితంలో మనం ఇప్పుడు చూస్తున్న మార్పు మొదలైంది. 2023 లో అక్సల్ బార్సిలోనా నుంచి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈసారి అతని దగ్గర రేసింగ్ బైక్ లేదు పెద్ద లగేజ్ కూడా లేదు ఒక చిన్న బ్యాక్ ప్యాక్ తీసుకొని బయలుదేరాడు. ముఖ్యంగా చెప్పులు లేకుండా నడవాలని నిర్ణయించుకున్నాడు. అతని లక్ష్యం తూర్పు వైపు ప్రయాణిస్తూ చివరికి ఇండియా చేరుకోవడం ఒకప్పుడు రైజింగ్ బైక్ అతన్ని ముందుకు తీసుకెళ్లేది.
(03:36) ఇప్పుడు మాత్రం అతని రెండు కాళ్లే అతన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రయాణం కూడా సాధారణ టూర్లా సాగలేదు. అక్సల్ చాలా తక్కువ వస్తువులతో ప్రయాణించాడు. హోటల్లలో ఉండడానికి బదులు చాలా సింపుల్ గా జీవించడానికి ప్రయత్నించాడు. ఉదయం మెడిటేషన్ యోగా చేయడం ఆ తర్వాత నడవడం ఇలా రోజులు గడిపేవాడు. స్పెయిన్ నుంచి తూర్పు వైపు వెళ్తూ అనేక దేశాలను దాటాడు.
(04:00) సుమారు 15 నెలల ప్రయాణం తర్వాత 2024 లో పాకిస్తాన్ చేరుకున్నాడు. అంటే ఒకప్పుడు రైజింగ్ ట్రాక్ పై కొన్ని గంటల్లో దాటే దూరాలను ఇప్పుడు నెలల తరబడి నడుస్తూ దాటాడు. అయితే ఇక్కడ అక్సల్ తండ్రి సిటోఫోన్స్ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కొడుకు ఇలా అన్ని వదిలేసి చెప్పులు లేకుండా నడుస్తుంటే సిటో అతన్ని బలవంతంగా ఆపలేదు.
(04:24) అతని నిర్ణయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అంతేకాదు 2023 లో నార్త్ మెసిడోనియాలో అక్సల్ తో కలిసి దాదాపు ఒక వారం పాటు నడిచాడు. ఇద్దరు కలిసి అడవిలో కూడా ఉన్నారు. కొడుకు ఎంచుకున్న జీవితం ఎలా ఉందో తండ్రి స్వయంగా అనుభవించాడు. ఇది అక్సల్ ప్రయాణంలో చాలా ప్రత్యేకమైన విషయం. ఆ తర్వాత కూడా అక్సల్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
(04:47) పాకిస్తాన్ చేరుకున్నప్పుడు అతని రూపం కూడా పూర్తిగా మారిపోయింది. పొడవైన జుట్టు, గడ్డం, చిన్న బ్యాక్ ప్యాక్ ముఖ్యంగా కాళ్ళకు చెప్పులు లేవు. సోషల్ మీడియాలో అతని వీడియోలు వైరల్ కావడంతో ఒకప్పుడు మోటార్ట రేస్ లో చేసిన అక్సల్ ఫోన్స్ గురించి ప్రపంచానికి మళ్ళీ తెలిసింది. అయితే ఈసారి అతను రేసింగ్ కోసం వార్తల్లోకి రాలేదు.
(05:09) తనకు తాను ఎంచుకున్న ఈ కొత్త జీవితం కారణంగా వార్తల్లోకి వచ్చాడు. అక్సల్ ఈ ప్రయాణాన్ని కేవలం ప్రపంచం చూడడానికి చేస్తున్న ప్రయాణంగా మాత్రమే చూడలేదు. తనను తాను అర్థం చేసుకోవడం ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆధ్యాత్మికంగా తనలో తాను వెతుక్కోవడం కూడా ఈ ప్రయాణంలో భాగమే. కొన్ని సందర్భాల్లో అతను తనను తాను ఇసా అని పరిచయం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
(05:32) కానీ అతను ఏదైనా మతంలోకి అధికారికంగా మారిపోయాడని ఖచ్చితంగా చెప్పడానికి సరైన ఆధారం లేదు. అందుకే అతని ప్రయాణాన్ని ఒక ఆధ్యాత్మిక అన్వేషణగా చెప్పడం సరైంది. ఒక అక్సల్ ఫోన్స్ దగ్గర ఎంత ఆస్తి ఉంది అనే విషయం గురించి ఇంటర్నెట్ లో రకరకాల నెంబర్స్ కనిపిస్తాయి. కానీ అతని మొత్తం ఆస్తుల విలువ ఎంత అనేది నమ్మదగిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ లో స్పష్టంగా లేదు.
(05:55) కాబట్టి అతను కోట్ల ఆస్తులు అమ్మేసి అన్ని వదిలేసాడని చెప్పడం సరైంది కాదు. మనకు తెలిసిన విషయం మాత్రం ఒకటే ప్రపంచ ఛాంపియన్ తండ్రి ఉన్న రేసింగ్ కుటుంబంలో పెరిగి ప్రొఫెషనల్ రేసర్ గా జీవించి మోడలింగ్ కూడా చేసిన వ్యక్తి చివరికి చాలా సింపుల్ జీవితాన్ని ఎంచుకున్నాడు. ఒకప్పుడు వేగంతో ప్రపంచాన్ని ఎదుర్కున్న అక్సల్ ఇప్పుడు నెమ్మదిగా నడుస్తూ తన జీవితానికి అర్థం వెతుక్కుంటున్నాడు.
(06:18) మరి అక్సల్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం తెలుగు డీప్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ జై భారత్
No comments:
Post a Comment