దైవం అంటే ఎవరోకాదు ,దైవమ్ ఆంటే చైతన్యం .చైతన్యం ప్రాణరూపంలో ఉంది .ప్రాణము మానవదేహంలో ఉంది .చైతన్యం ప్రాణరూపంలో మానవదేహంలో స్థితమై ఉంది . అంటే దైవం మనవదేహంలో ఉంది . అని మీరు తెలుసుకోవాలి .మరి దైవం మనవదేహంలో స్థితమై ఉన్నప్పుడు మనము ఏవిధంగా ఉంచాలి ,ఈ దేహాన్నీ ? ఈ దేహాన్ని దేవాలయంగా ఉంచాలి . దేహమే దేవాలయం ,జీవుడే దేవుడు ,ఆత్మే పరమాత్మ . .అంటే దేహమనే దేవాలయంలో దేవుడు జీవుడిగా నడియాడుతున్నప్పుడు .ఈ దేహమనే దేవాలయాన్ని పరిశుబ్రముగా ఉంచుకోవాలి .అంతేగాని ఈ దేవాలయాన్ని అపరిశుభ్రంగా వుంచుకోరాదు .బాహ్యంగా మనముంటున్న ఇల్లే అపరిశుబ్రముగా ఉంటె మనము ఇంటిలో ఉండలేము .వెంటనే శుభ్రపరుచుకుంటాము .ఎందుకు శుబ్రపరుచుకుంటాము ?అపరిశుబ్రంగా ఇల్లు ఉంటే అనారోగ్యాలు వస్తాయని .మరి బాహ్యంగా ఉండే ఇంటిని శుభ్రపరుచుకుంటున్నారు కానీ ,దేవుడు ప్రాణరూపంలో ఉన్నప్పుడు మరి ఈ దేహాన్ని మత్తు పానీయాలతోను , జీవహింసతో జీవులను చంపి తింటూ , ఈ దేహంలో వుండే భగవంతుని మలిన పరుస్తున్నప్పుడు భగవంతుడు ఈ దేహాన్ని వదిలి పోవడానికి సిద్దపడుతుంటాడు .సిద్దపడి తానూ ప్రతిష్ఠచేసిన దేహంలో ఉండే అవయవాలను క్షిణింప చేస్తుంటాడు .మరి ఈ దేహదారి పాడైపోతున్న అవయవలను బాగుచేసుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు .తిరగవలసినది హాస్పిటల్ చుట్టూ కాదు , భగవంతుని చుట్టూ తిరగాలి .మరి భగవంతుని చుట్టూ తిరగడానికి భగవంతుడు ఎక్కడున్నాడని ,తిరుగుతావు ,?భగవంతుడు ఎక్కడో బయట ఉండడు .భగవంతుడు ఈ దేహములోనే ఉన్నాడు .మరి ఈ దేహంలో ఉన్న భగవంతుని సేవించుకుంటే నీకు భగవంతుడు నీకు ప్రసన్నుడవుతాడు .మరి భగవంతుడు దేహంలో నీకు ప్రసన్నుడవాలనుంటే దేహాన్ని పరిశుబ్రముగా ఉంచుకుంటూ ,నీలో ఉన్న భగవంతుని నిరంతరం చూస్తూ ,బయట ప్రపంచాన్ని ,బంధాలను ,బంధువులను మానసికముగా వదిలి నిరన్తరం భగవంతుని సేవిస్తున్నప్పుడు నీ అవయవాలు అన్ని బాగుపడుతుంటాయి .నీవు ఆరోగ్యముగా ఉంటావు .నీవు భగవంతునితో ఉంటావు .నీవు భగవంతునిగా మారుతావు .నీవు భగవంతునిగా మారినరోజు నీకు ఈ దేహంపై మొహం పోతుంది .నీకు ఇతరదేహాలలో భగవంతుడు కనిపిస్తాడు .ఇతర దేహాలలో భగవంతుడు కనిపిస్తున్నప్పుడు ,ఇతర పదర్థాలలో భగవంతుడు కనిపిస్తాడు .ఇతర పదర్దాల్లో భగవంతుడు కనిపిస్తున్నప్పుడు నీకు ఏవిధమైన అజ్ఞానం ఉండడానికి అవకాసమ్ లేదు .......
No comments:
Post a Comment