🌷. బుద్ధిని ఆత్మలో లీనం చేయడమునే బ్రహ్మ యజ్ఞం లేక జ్ఞాన యజ్ఞం అంటారు. నిరంతర ఆత్మిక ధ్యాసను కలిగి ఉండడమే మోక్ష మార్గం. 🌷
కొంత మంది దైవ యజ్ఞము చేస్తారు. దైవ యజ్ఞము అంటే దేవతలను పూజించడం, అరాధించడం, దేవతలను ఉపాసించడం, ధ్యానం చేయడం, వివిధ వస్తువులను కైంకర్యం చేయడం, దేవతలను ప్రార్ధించడం మొదలగు కార్యములన్నీ దైవయజ్ఞాలే.
కాకపోతే ఇవన్నీ భక్తితో శ్రద్ధతో, కర్తృత్వభావము విడిచిపెట్టి, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పరంగా కర్తవ్య నిష్టతో చేయాలి. వీరినే కర్మయోగులు, భక్తియోగులు అని అనవచ్చు.
ఇంక రెండవ యజ్ఞం పేరు బ్రహ్మ యజ్ఞము. దీనినే జ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు. ధ్యానంలో కూర్చోవడం. మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలపడం. తానే బ్రహ్మగా భావించడం. చివరకు బ్రహ్మలో ఐక్యం కావడం..
నిరంతరం బ్రహ్మను గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ, మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటే. తుదకు బ్రహ్మగా మారిపోవడం సులభమే. అప్పుడు మనోబుద్ధి అహంకారాలకు ప్రతిరూపమైన చిత్తము పరమాత్మవైపు మళ్లుతుంది. చిత్తము పరమాత్మలో లీనం అవుతుంది. దానినే మోక్షమార్గము అంటారు.
నిరంతరం పరమాత్మను గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ పరమాత్మ గురించి మాట్లాడు కుంటుంటే మనసు బుద్ధి ప్రాపంచిక విషయముల నుండి పరమాత్మ వైపుకు మళ్లుతుంది. చిత్తము సాత్వికంగా మారి పోతుంది. దుష్ట ఆలోచనలు మనసులోకి రావు. మనం ఏ వస్తువు అగ్గిలో వేసినా అది అగ్గిరూపాన్ని పొందుతుంది. ఒక ఇనప గుండు వేసినా అది కాలి ఎరగా అగ్గిగోళం మాదిరి అవుతుంది.
అదే ప్రకారము మనము ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న మనసును, అహంకారమును, పరమాత్మ వైపు మళ్లించి పరమాత్మ అనే అగ్గిలో హెమం చేస్తే, పాపంచిక విషయములు, పూర్వజన్మ వాసనలు అనీ కూడా ఆ అగ్గిలో పడి, తమ అస్తిత్వాన్ని కోల్పోయి, పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి.
సూక్ష్మంగా చెప్పాలంటే మనసును, బుద్ధిని ఆత్మలో లీనం చేయడం. దానినే బ్రహ్మయజ్ఞము లేక జ్ఞానయజ్ఞము అని అంటారు.
🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
🌷 🌷 🌷 🌷 🌷

No comments:
Post a Comment