Monday, February 3, 2020

ఒక వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం అతని గుణాన్ని బట్టి ఇవ్వాలి కానీ అతని దగ్గర ఉన్న ధనాన్ని బట్టి కాదు.

కూటికి పేద అయినా కులానికి పేద కాదు, అని ఒక సామెత ఉండేది.

నిజానికి అక్కడ కులం అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం.

మనిషి వ్యక్తిత్వానికి అంత విలువ ఇచ్చేవారు కాబట్టే ఆ సామెత పుట్టింది.

నేటి రోజుల్లో మాత్రం బహుశా ఆ సామెతకు ఉన్నంత ప్రాధాన్యత కూడా మనిషి గుణానికి ఉండడం లేదు.

ఒక వ్యక్తి కోటీశ్వరుడు కాబట్టి అతన్ని గౌరవించి తీరాల్సిందే అన్నట్టు ప్రవర్తిస్తుంది లోకం,

విచిత్రం ఏమిటంటే ఎంత ధనవంతుడైనా చివరికి మంచి గుణం గలవారినే గౌరవిస్తాడు.

పెద్ద పెద్ద రాజ్యాలు, ఎంతకీ తరగని ధనాగారాలు, రత్న మకుటమైన కోశాగారాలు కలిగిన మహారాజులు సైతం సన్యాసి అయిన బుద్ధుడి పాదాలకు నమస్కరించారు

అంటే మంచి గుణం కలిగిన వ్యక్తి ముందు ధనం ఎంత తుచ్చమైనదో అర్ధం అవుతుంది.



ధనం ఎవరి దగ్గరా శాశ్వతంగా ఉండదు.

కానీ మనిషి అలవరచుకున్న గుణం ప్రాణం పోయేవరకూ అతనితోనే ఉంటుంది.

ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని జీవితానికి పునాది లాంటిది, ఆ పునాది ఎంత దృఢంగా ఉండాలంటే ఆ వ్యక్తికి గుణం అంత అవసరం.

జీవితానికి అవసరమైన పునాదులను ఎన్నటికీ డబ్బుతో నిర్మించలేము.

కేవలం ధనానికి గౌరవం ఇచ్చేవారి ఇంట్లో కూడా జీవితం విలువ చెప్పిన బుద్ధుడు లాంటి ఉన్నతమైన వారిని పూజిస్తారే కానీ డబ్బు సంపాదించి మహాధనవంతులను పూజించరు.

గుణం కలిగిన వారిని పూజించి,
ధనం కలిగిన వ్యక్తులకు గౌరవం ఇస్తున్నామంటే తప్పు మనలోనే ఉంది.

మన మనఃసాక్షిని మనమే మోసగించుకుంటున్నట్టు.

సంపాదించేవరకూ నాన్నకు గౌరవం,వండిపెట్టే వరకూ అమ్మ విలువ,

అడిగింది ఇచ్చేవరకూ భర్తకు గౌరవం,

చెప్పేది వినేవరకు భార్యకు విలువ.

ఇలాగే కొనసాగుతూ పోతే చివరకు మనిషి అనే పదానికి కూడా విలువ లేకుండా పోతుంది.

జీవితంలో విలువ ఇవ్వవలసిన వాటికి విలువ ఇచ్చినప్పుడే మన జీవితానికి కూడా విలువ ఉంటుంది,

ఆ విలువే లేని రోజు జీవితం పాతాళానికి దిగజారిపోతోంది.

No comments:

Post a Comment