Wednesday, March 11, 2020

ధనలక్ష్మి ఏమంటుంది. నన్నుబంధించి బలైపోకండి అంటుంది.

ధనలక్ష్మి ఏమంటుంది. నన్నుబంధించి బలైపోకండి అంటుంది.

"ఓయీ మానవులారా ! మీరందరూ నన్నెంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. నన్ను మీఇంటికి రమ్మని, ధనరాశులతో సిరులపంట పండించమని వేడుకొంటున్నారు, మీ ప్రార్ధన కాదనలేక నేను మీ ఇళ్ళకు వస్తూ మిమ్మల్ని భాగ్యవంతులుగా మారుస్తున్నాను. మీకు బంగళాలు కార్లు, తోటలు, మొదలైన సమస్త సౌకర్యాలు సమకూరుస్తున్నాను.

ఆ తరువాత మీరు చేసే పనులే నాకు నచ్చటం లేదు, నన్ను మీ ఇనప్పెట్టెల్లో, బ్యాంకు లాకర్లలో, బంగారం రూపంలో బంధించాలని ప్రయతిస్తున్నారు. ఎల్లప్పుడూ నన్ను మీ బందీగా వుంచుకొని నా ద్వారా స్వర్గసుఖాలు అనుభవించాలని పథకాలు వేస్తున్నారు.

మీ అసలు స్వరూపం నాకు తెలుసుగానీ, నా అసలు స్వరూపం మీకు తెలియదు. మీ నిజ స్వరూపం కూడా మీకు తెలియదని నేను భావిస్తున్నాను. మీరు తల్లి గర్భంనుండి వచ్చేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకురారు. తిరిగి భూమిగర్భంలోకివెళ్ళేమరణయాత్రలో కూడా ఒక్క పైసాతీసుకుపోలేరు.

రోజు మీ కళ్ళముందు చనిపోయే ఎందరెందరో కోటీశ్వరులను, జమీందారులను చూస్తూ కూడా, రేపు మన దుస్థితి కూడా అంతే కదా, అనే అసలు నిజాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ ఆశలకు, కోరికలకు హద్దు లేకుండా | పోతుంది. ఇది మీరు తెలుసుకోలేని మీ నిజ స్వరూపం.

ఇకనాస్వరూపం గురించి చెబుతాను. నేను ఎవరి దగ్గర ఎప్పుడూ నిలకడగా వుండను, ఆది నా ధనరూపం యొక్క | సహజగుణం, ఒకచోటి నుండి మరో చోటికి తరలి పోవటమే నా ధర్మం. అది మిమ్మల్ని నన్ను సృష్టించిన ఆ పర్వమేశ్వరుని లీలా వినోదం. నన్ను బంధించాలని చూసిన ప్రతి వాణ్ణి, దొంగల ద్వారానో, దాయాదుల ద్వారానో, ఇన్ కంటాక్స్ వారి ద్వారానో కొల్లగొట్టించి నేను బయట పడుతుంటాను.

అయితే దేవుడు నాకొక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటంటే నేను కొందరి దగ్గర ఎల్లప్పుడూ శాశ్వతంగా వుండే అవకాశం. . అలా నేను ఎవరి వద్ద స్థిరంగా వుంటానంటే, “ఎవరు నా ధనకటాక్షంతో విర్రవీగకుండ, అహంకారులు కాకుండ, ధనమదంతో సాటి మానవులను హింసించకుండ, తమ అవసరాలకు మించిన ధనాన్ని పుణ్యకార్యాలకు, దైవకార్యాలకు, ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తూ వుంటారో, వారిని మరింత కుబేరులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి వద్దనే నేను శాశ్వతంగా వుండిపోతాను. వారి కుటుంబాన్ని | వెయ్యికళ్ళతో కాపాడుతుంటాను.


ఇప్పుడు నా నైజం మీకు అర్థమైంది కాబట్టి నన్ను బంధించి బలైపోకుండ, నన్ను మంచి కార్యాలకు వినియోగించి జీవితాలను చరితార్థం చేసుకోమని సలహాలిస్తున్నాను. వింటే మీతో వుంటా - లేదంటే టాటా చెప్తా పారాహుషార్, ....
👏👏👏👏

No comments:

Post a Comment