Wednesday, March 11, 2020

అక్షర సత్యాలు

💐అక్షర సత్యాలు💐

🍏తీర్చగలిగే సమస్యలకు ఏడ్చే అవసరం లేదు.. తీర్చలేని సమస్యల కోసం ఏడ్చినా లాభం లేదు..అందుకే హాయిగా ఉండడం మంచిది...!!

🍏అరగంట కంటే ఎక్కువ దేనిగురించి అయినా ఆలోచిస్తున్నావు.. చింతిస్తున్నావు అంటే జ్ఞానం ఇంకా పట్టు బడలేదని అర్థం...!!

🍏మీ లో తృప్తి ఉంటే మీరు ధన వంతులా లేక పేదవారా అన్నదానితో సంబంధం లేదు...!!

🍏శక్తి మంతుడే క్షమించ గలుగుతాడు. క్షమించ గలిగిన వాడే శక్తి మంతుడు అవుతాడు...!!

🍏సత్యం వేరు. పదాలపై పట్టు వేరు.పదాలతో ఆడితే అది పాండిత్యం. సాధనతో వెలువడితే అది సత్యం...!!

🍏మీరు సత్యం చెప్పేటప్పుడు వినేవాడు మీకు తక్కువగా కనిపిస్తున్నాడు అంటే మీకు ఇంకా సత్యం సంపూర్తిగా అర్థం కాలేదని అర్థం...!!

🍏సజ్జనులతో, గురువులతో సాంగత్యము వల్లే అసలు ఏది ఉన్నతమో, ఏది అసలు జీవిత లక్ష్యమో అర్థమయ్యేది...!!

🍏ఎక్కడికి వెళ్లినా మీకు సరికాని వాళ్ళే ఎదురవు తున్నారా...!!

🍏అయితే మీలో మీకు తెలియకుండానే ఏదో సరికాని తత్వం ఉందని అర్థం. అదేంటో తెలుసుకోవాలి ముందు...!!

💧🌷💧🌷💧🌷💧🌷💧

No comments:

Post a Comment