Monday, March 23, 2020

సోకాల్డ్ హైందవ స్వయంకృతాపరాధాలు...

🌹ఇకనైనా కళ్లుతెరువు🌹
💥🔥💥🔥💥🔥💥🔥💥🔥
సోకాల్డ్ హైందవ స్వయంకృతాపరాధాలు...

01. పిల్లలకి బొట్టు పెట్టుకోమని నేర్పించటం నామోషీ...
ఒకవేళ పెట్టుకున్నా కనపడీ కనపడనట్లు నల్ల స్తిక్కర్లు...

02. కనీసం వారానికి ఒక్కమారు గుడికెళ్ళటానికి నామోషీ...

03. రోజూ త్రిసంధ్యలు చేసుకోటానికి నామోషీ...

04. పొద్దునే దీపం వెలిగించి వచ్చిన నాలుగు స్తోత్రాలు చదవటానికి నామోషీ...

05. భగవద్గీత ఇంట్లో పెట్టుకోటానికి నామోషీ...

06. సాయంకాలం పురాణ పఠనం చేయటానికి నామోషీ...

07. బ్రాహ్మణులకు పంచ కట్టుకోవటం నామోషీ - పిలక పెట్టుకోవటం నామోషీ ...

08. రామాయణ, భారత, భాగవతాలని పిల్లలకి కథలుగా చెప్పటానికి బద్దకం....

09. జంధ్యప్పోగు ఒంటి మీదుంచుకోడానికి నామోషీ...

10. పండగల్లో, పార్టీకో స్టేజి - కులానికో స్టేజి ఊరంతటికీ ఒక్కటి సరిపోదు...

11. రికార్డింగు డాన్సులకి తగలెయ్యటానికి లచ్చలు లచ్చలు ఉంటాయి గానీ - ఊర్లో గుడి బడి బాగుచేయటానికి ఉండవు...

12. పంచాగాల్లో వీడు చెప్పింది తప్పని వాడు - వాడు చెప్పిందని తప్పని వీడు. పండగెప్పుడొచ్చి చస్తుందో క్లారిటీ ఉండి చావదు...

13. కిట్టీ పార్టీలని తలపిస్తున్న వారాంతపు సత్సంగాలు...

14. భర్త బ్రతికి వుండగానే, వాడు కట్టిన తాళి మెడలో ఉంచుకోవటం నామోషీ...

15. సుమంగళి గా ఉన్నా కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటం నామోషీ..

16. నేను బ్రతికి ఉండగా ఇవన్నీ విసర్జిస్తున్నావేమీటి అని అడగటానికి ధైర్యం లేని మగ బ్రతుకులు...

17. మనం ఆచరించకుండా మన పిల్లలకు బుద్ధి చెప్పలేము అనే కనీస ఆలోచన లేని చదువులు...

18. పిల్లలు తప్పుచేస్తుంటే మందలించవలసిన పెద్దలే సాంప్రదాయాలను గౌరవించలేని కుసంస్కారం....

19. జాంబవంతుడెవర్రా అంటే జాంబియా దేశాద్యక్షుడు అని చెప్పుకునే స్థాయి చదువులు...

20. అందరు దేవుళ్ళు ఒక్కటే అనే సెక్యులర్ వాదనలు...
ఏ మతం వారు ఐనా మా కులం వారు అయితే చాలు అని సిగ్గులేకుం డా జరిపించే పెళ్లిళ్లు...

వీటన్నిటీనీ గాలికొదిలేసి - సోకాల్డ్ హైందవాన్ని వాడొచ్చి నాశనం చేసాడు - వీడొచ్చి నాశనం చేసాడని ఏడుస్తారేం ...

💥నీ ఇంట్లో నీకు నచ్చిన పద్దతినీ నువ్వు సరిగ్గా పాటించేడిస్తే బలవంతంగా నీ బొట్టు చెరిపి మతం మార్చే దమ్మెవడికి ఉంటుంది.. ??

💥నీ ఇంటికి తాళం సరిగా వేసుకొని ఏడిస్తే ఎవడన్నా దొంగతనం చేయగలడా..??

💥ఒకడొచ్చి సర్వం దోచుకుపోతున్నాడంటే అది వాడి ప్రతిభా లేక ద్వారాలు బార్లా తెరుచుకొని కూర్చోవడం నీ అసమర్ధతా...??

💥మనసు తలుపులు మూసుకోవటం చేతకాక - వాడి మీద వీడి మీద పడిఏడిస్తే మార్పొస్తుందా...??

💥భావం అర్థమైతే ఇప్పటికైనా మారి బ్రతకండి - లేకుంటే ఇట్టాగే వాడ్నీ వీడ్నీ తిట్టుకుంటూ చావండి.. !!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
------------------------------------------------------
🤔 ఆరోజులే వేరు...🤔

నా చిన్నతనం అంటే షుమారు 50 సంవత్సరాలు వెనక్కి వెడితే ---

ఆ రోజుల్లో గ్యాస్ లేదు .

వంటంతా కుంపటి , పొట్టు పొయ్యి , కట్టెల మీదే చేసేవారు .

వేడి నీళ్ళకు గీజర్ లు ఉండేవి కావు.

దొడ్లో వెనుక వైపు ఇటుకలు పేర్చి దాని మీద డేగిశా పెట్టి, కొబ్బరి డొప్పలు , కొబ్బరి మట్టలు వేసి పొయ్యి రాజేసి స్నానానికి నీళ్ళు కాచుకునేవారు, కావలసిన వారు.

చాలా గ్రామాలకు కరెంటు సదుపాయం ఉండేది కాదు .

సాయంత్రం నాలుగు అయ్యేసరికి లాంతరు , చిమ్నీలకు ముందు రోజు పట్టిన మసి ముగ్గుతో శుభ్రంగా తుడిచి , వత్తులు సరి చేసి , వాటి నిండా కిరోసిన్ పోసి చీకటి పడక ముందే వెలిగించటానికి సిద్ధం చేసుకునేవారు .

మాకు ఊహ తెలిసే నాటికి కరెంటు ఉన్నా రాత్రి పూట ప్రైవేటుకు వెళ్ళే సమయంలో లాంతరులు పట్టుకు వెళ్ళి అక్కడ వెలిగించి ఆ వెలుగులోనే చదువు కునే వాళ్ళం.

వేసవి కాలం పరీక్షల సమయంలో మేడ మీదకు వెళ్ళి చదువుకోవాలనుకునే సమయంలో మేడ మీద కరెంటు ఉండేది కాదు .

లాంతరు వెలిగించి మేడ మీదకు పట్టుకు వెళ్ళి ఆ దీపపు వెలుగులోనే చదువుకునే వాళ్ళం.

ఈ రోజుల్లో AC లు , గది గదికి ఫానులు , కరెంటు పోతే Invertor లు .

ఈ సదుపాయాలు ఆ రోజుల్లో ఏవి?

శివరాత్రికి ముందే డాబా మీదకు వెళ్ళి పడుకునే వాళ్ళం.

దాదాపుగా దసరా వరకు మేడ మీదే పడకలు .

ఇప్పటిలా ఒకరి మీద ఒకరు పడి పోతున్నట్లు ఆనించేసి ఇళ్ళు కట్టే వారు కాదు.

అపార్ట్ మెంట్ కల్చర్ ఆ రోజుల్లో లేదు .

దాదాపుగా అన్నీ తాటాకు ఇళ్ళు పెంకుటిళ్ళు .
మండువా లోగిలి ఇళ్ళు .

అక్కడక్కడ కలిగిన వాళ్ళకు మాత్రమే ఉండే డాబాలు , రెండతస్థుల మేడలు .

ఇక మేడ మీదకు వెళ్ళి చాప దిండు వేసుకుని పడుకుంటే ప్రాణం ఎటు పోయేదో!

ప్రతి ఇళ్ళల్లోనూ చుట్టూరా కొబ్బరి చెట్లు , అరటి చెట్లు ,రకరకాల పూలు మరియు పళ్ళ చెట్లు ఉండేవి .

వాడుకున్న నీళ్ళన్నీ మొక్కల లోకి గాడి తీసి వదిలేవారు.

మొక్కలు ఆ వాడిన నీరు పీల్చుకుని , మరి ప్రత్యేకంగా నీరు పోయవలసిన అవసరం లేకుండా ఏపుగా ఎదిగేవి .

మురుగు లేదు కాబట్టి దోమలు తక్కువ.

ఇంక ఆ చెట్ల నుండి వీచే కమ్మని గాలికి నిద్రపోతున్న ప్రాణం ఎటు పోయేదో , ఉదయాన సూర్య భగవానుడు తన వేడి వాడి కిరణాలతో చుర్రు చుర్రు మని పించే దాకా మెలుకువ వచ్చేది కాదు .

ఈ రోజుల్లో దోమలకు , వాటి వల్ల వచ్చే రోగాలకు భయపడి , కిటికీలన్నీ తలుపులతో సహా మూసుకుని , Jet లు , All Out లు వెలిగించి ,ఫాన్ మరియు AC కూడా వేసుకుని ఆ పొగ మరియు ఈ AC తో ఉక్కిరిబిక్కిరై ముక్కులు మూసుకు పోయి , ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ కాలుష్యాల గాలులు పీల్చడం వలన , తల అంతా పట్టుకు పోయి ఉదయాన్నే ఏ బకరా దొరుకుతాడా ఎవడి మీద విరుచుకుపోదామా ? అనే రీతిన చికాకుగా తయారవుతున్నాము.

ఇంక భోజనాల విషయం .

కలిగిన వాళ్ళిళ్ళల్లో మాత్రమే ఉదయం కాఫీలు , టిఫిన్లు . అదికూడా పెద్దవారికి మాత్రమే

మిగిలిన వాళ్ళందరికీ రాత్రి మిగిలిన చద్దన్నాలు , తర్వాణి అన్నాలే .

అమ్మమ్మ కాని , బామ్మ కాని వేసవి శలవులకు వచ్చిన పిల్లలందరినీ తమ చుట్టూ కూర్చో పెట్టుకుని , మధ్యలో పెద్ద కంచం పెట్టుకుని ఆ చద్దన్నంలో కొత్తగా పెట్టిన కొత్తావకాయ బాగా నెయ్యి వేసి కలిపి ముద్దలు పెట్టేవారు . తర్వాత రాత్రి మిగిలిన చారు కాని పులుసు కానీ రాచిప్ప లోనుండి తీసి చద్దన్నం లో కలిపి అందరికీ ముద్దలు పెట్టేవారు .

అప్పుడు చాలామంది ఇళ్ళల్లో ఒకటో రెండో ఆవులో గేదెలో ఉండేవి.

ఒక్కొక్కటి కనీసం శేరున్నర , రెండు శేర్లు పాలు ఇచ్చేది . వాడకానికి సరిపడా ఉంచుకోగి మిగిలిన పాలను పాడిలేని వారికి ఏదో ధర కట్టి పోసేవారు.

వంటంతా అయిపోయిన తర్వాత, బొగ్గుల మంట బాగా తగ్గాక, మట్టి కుండలో పాలు పోసి సన్నని మంటన ఎర్రగా దళసరిగా తొరక కట్టేలా పాలు కాచి , పళ్ళెంలో నీళ్ళు పోసి బాగా కాచిన పాలకుండ అందులో పెట్టి , పాలు తోడు వేయటానికి అనువుగా ఉన్న వేడిలో పెరుగు బిళ్ళ వేసి తోడు పెట్టేవారు .

ప్రొద్దుటకల్లా ఆ పెరుగు గట్టిగా జున్ను ముక్కలా తోడుకునేది .

ఉదయాన్నే ఒక పొడవాటి కర్రకు పెరుగు చిలికే కవ్వం కట్టి కొద్ది నీళ్ళు పోసి కవ్వంతో వెన్న చిలికే వారు .

దాదాపుగా సవాశేరు అంటే 350 గ్రాముల వెన్న వచ్చేది .

ఆ వెన్న గట్టిగా గుండ్రంగా పెద్ద ముద్దలా చేసి , ఆ మజ్జిగ కుండలోనే వేసే వారు .

మధ్యాహ్నము దాకా ఆ వెన్న మజ్జిగలోనే తేలుతుండేది .

అలా కుండలో చేసిన మజ్జిగతో కాని , లేదా మీగడ పెరుగు వేసి కాని, చద్దన్నంలో ముద్దలు కలిపి , ఆవకాయ కలిపిన ముక్కలు కంచం అంచులతో తుంపి చిన్న చిన్న ముక్కలుగా చేసి మీగడ పెరుగు అన్నం ముద్దలో పైన నంచు కోవడానికి పెట్టి , అందరికీ పెట్టే వారు .

ఆహా !! ఏమి రుచి .

వర్ణించ నా తరమౌనా ?


🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇

శ్రీ ధర్మశాస్త సేవాసమితి🐆విజయవాడ🏹7799797799

No comments:

Post a Comment