సంకష్టహర చతుర్థి వ్రతం_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
సంకట హర చతుర్థి నిజానికి ఈ తిథిని సంకట హర చవితి" అని వ్యవహరించాలి. అయితే, "సంకట హర చతుర్థి, సంకష్ట హర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు.
సంకటహర చవితి ప్రతీ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే రాత్రిగల చవితి తిథి (బహుళ చతుర్థి)
నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోష కాలంలో "చవితి " ఉన్నరోజే " సంకట హర చవితి".
ఎప్పుడైనా, ప్రదోష కాలంలో చవితి రెండు రోజులు ఉంటే, రెండవ రోజే "సంకట హర చవితి".
చవితి తిథి అధిపతి వినాయకుడు. సకల
సంకటములు హరించే చతుర్థిగా ఈ తిథికి ఆ పేరు వచ్చింది. ఈరోజు సంకట హర వినాయకుని భక్తీ శ్రద్ధలతో పూజిస్తే సకల కామ్యములు సిద్ధిస్తాయి అని
గణపతి పురాణంలో చెప్పబడి ఉంది.
ఈ వ్రతమును 3, 5, 11, 21 నెలలు ఆచరిస్తారు.
సంకట హర చవితి "వ్రతము" ప్రారంభించే వారు తెల్లని లేదా ఎర్రని కొత్త బట్టను తీసుకొని దానికి పసుపు పెట్టి, గణపతి ముందర ఉంచి, కొంచం కుంకుమ వేసి, మనసులోని కోరికను స్వామివారికి విన్నవించి; మూడు దోసిళ్ళ బియ్యము పోసి, మూడు తమలపాకులు ఉంచి, రెండు వక్కలు, రెండు ఖర్జురములు, దక్షిణ, తమలపాకుల పై ఉంచి; మరోసారి స్వామికి కోరికను విన్నవించి, ముడుపు కట్టి; నమస్కరించి, పూజించాలి.
ఈ వ్రతము పూర్తి చేసిన తరువాత, అంటే, మీరు సంకల్పముచేసిన నెలలు (3, లేదా 5 లేదా 11 నెలలు లేదా 21 నెలలు) పూర్తి అయే ఆఖరి నెలనాడు ఆ ముడుపులోని బియ్యముతో పొంగలి చేసి స్వామివారికి నివేదన చేయాలి.
ఈ చవితితిథి నాడు, సూర్యొదయం పూర్వమే
లేచి ఇల్లంతా శుభ్ర పరచుకొని, మంగళ స్నానం చేసి,ఉపవాస దీక్షతో (ఉడికిన, ఉప్పు సంపర్కం ఉన్న
పదార్ధములు నిషిద్ధము -- అంటే,పాలు, పండ్లు,
పచ్చి కూరలు సేవించ వచ్చును) ఉండాలి .
(ఉపవాసం చేయలేని వారు, వృద్ధులు, శారీరక ఆరోగ్యం సహకరించని వారు సాత్విక ఆహారాన్ని(అంటే శరీరం నిలబడటానికి అవసరమైన ఆహారాన్ని) తీసుకొని "సంకట నాశన గణేశ స్తోత్రము" నాలుగు సార్లు పారాయణ చేసి, గణపతిని భక్తి శ్రద్ధలతో సేవించి, సమీపములో గణేశ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని, రాత్రి చంద్ర దర్శనం, నక్షత్ర దర్శనం చేసి నమస్కరించుకుని అటుపై భోజనము చేయాలి.)
సాయంత్రం స్నానం ఆచరించి, సంకల్పంతో గణపతికి అధర్వణ శీర్షం 11 లేదా 21 సార్లు చెప్తూ అభిషేకం (చెరుకు రసంతో అభిషేకం స్వామికి ప్రీతి)ఆచరించి, షోడస ఉపచారములతో పూజ, అష్టోత్తరశత నామాలతో అర్చన,
ఏకవింశతిపత్రములతొ, పూలతో పూజించి (తులసి తో చేయరాదు ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే తులసితో పూజించ వచ్చు), ఇరవై ఒక్క నామాలతో దూర్వాయుగ్మ పూజ చేస్తూ,గణపతిని స్మరించాలి....
నివేదనగా ఆవు నేతితో చేసిన 21 మోదకములు (21 రకాల పిండి వంటలు చేయడం కూడా చెప్పబడి ఉంది) నివేదనచేసి 21 మోదకములు బ్రాహ్మణ బ్రహ్మచారికి దానంగా ఇచ్చి, మంగళ హారతి ఇచ్చి, సంకష్టహర గణపతి స్తోత్రం చేసి, తరువాత చంద్రదర్సనం చేసికొని, చంద్రునికి మూడు మార్లు అర్ఘ్య ప్రదానం చేసి, ఈ వ్రతాన్ని సంపూర్ణం చేసుకొని,తరువాత వీలును బట్టి కొంతమంది పేదవారికి భోజనం పెట్టి, తరువాత వ్రతం చేసుకొన్నవారు భోజనం చేయాలి. ఇలా చేస్తే,ఆ సంకష్ట హర గణపతి యొక్క సంపూర్ణ కృపకు పాత్రులై, తలచిన,సంకల్పించిన,సకల కార్యములు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. విద్యార్ధులకు విశేష ఫలితం లభిస్తుంది అని చెప్పబడి ఉంది.
సంకటహర గణపతి స్తోత్రం*
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

No comments:
Post a Comment