ఆధ్యాత్మికత అంటే...
ఆధ్యాత్మికత ఆంటే మనం నిత్యం చేసే పనుల్ని వదిలిపెట్టకుండా ఇంకా నైపుణ్యం తో చేయాలి అని అర్ధం..నీలోనిని శక్తి గ్రహించి, నువ్వంటే ఎవరివో , తెలుసుకుని జ్ఞానాన్ని జీవితం లో ఆచరించడమే ఆధ్యాత్మికత. ఈ. ఆధ్యాత్మికత మనల్ని
ఇంకా శక్తి మంతుడిని జ్ఞాని ని ప్రతిభావంతుడిని చేస్తుంది..
అందుకే " నహి జ్ఞానేన సదృశం "
అన్నది భగవద్గీత..మన లో జ్ఞానం ఆధ్యాత్మికత ఎంత ఉన్నాయో కనీసం వారానికి. ఒక్కరోజు అయినా పరిశీలించు కోవడం మంచింది.. కాలం కర్పూరం కొద్దిగా కూడా ఉపయోగించక పోయినా కరిగి పోతాయి.
గతం లో మనం చేసుకున్న సత్కర్మల వలన లభించే గొప్ప అవకాశాలు మన నిర్లక్ష్యం బద్ధకం అజాగ్రత్త వలన చేజారి పోతాయి..
ఆధ్యాత్మిక ప్రస్థానం లో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షణ కాలమైనా
దాని పైనుండి దృష్టి మరల్చని స్థితి యే ఏకాగ్రత. ఏ ఆకర్షణలు లౌకికమైన ఇంద్రియ సుఖాలు , ఆఖరికి జీవితం లోని మమతా మొహాలు కూడా నీ దృష్టిని మరల్చ కూడదు.
నీవు నీ ఆధాత్మిక ప్రస్థానం తో తాదాత్మ్యం కావాలి. ఇదే సమయం లో మనం మన స్వధర్మాలను ఎంత మాత్రం మరచి పోకూడదు. నిత్య జీవితం లోని మనం నెరవేర్చ వలసిన ప్రతి పనిని. మరింత నైపుణ్యం తో శ్రద్ధ గా చేయాలి. లక్ష్యం స్థిరం గా ఉండాలి
ఆధ్యాత్మికత పేరుతొ దీనికి లోపం కలిగిస్తే ఏ వ్యక్తి తో మనకి ఉన్న ఈ జన్మ లో తీర్చ వలసిన కర్మ ఋణాన్ని అయినా తీర్చక పోతే, అది రాబోయే జన్మ జన్మ లకి వాయిదా పడే ప్రమాదముంది.ఇది కుటుంబం లోని వ్యక్తుల కీ వర్తిస్తుంది, అనుబంధాలకీ, శత్రుత్వాలకీ కూడా వర్తిస్తుంది.
ఈ కారణం గానే మనం కోరుకున్న వారి తో కంటే , మనం కోరుకోని వారితోనే వేదనా భరితం గాఎక్కువ జీవితం గడప వలసి వస్తుంది ఆనివార్యమైన బంధాలు బంధనాల్లా. వేదనకు గురి చేసినా సహనం తో భరించక తప్పదు..
మీకు ఓ సందేహం రావచ్చు. వేధిస్తూ మనతోటే అనివార్యం గా జీవించే వారిని ఎదిరించి దూరం గా వెళ్లి పోకూడదా. ? అని..
అన్ని. బంధాల ను వదిలించుకోవడం సాథ్యం కాదు..ఋణానుబంధ రూపేణా. పశు పత్నీ సుతాదాయా. అన్నారు..
జీవులని ఋణాలు కలుపుతాయి ప్రేమలు కలుపుతాయి. రుణం తీరి పోతుంది..ప్రేమ తో ఏర్పడ్డ బంధం పెరుగుతుంది. రుణం తీరిపోయిన వాళ్ళు ఒక్క క్షణం కూడా మనతో. ఉండరు..
ప్రేమ బంధం కలిగిన వారు ఎప్పటికి వెంటే ఉంటారు.
అందరినీ ప్రేమిద్దాం. అందరితో ఋణానుబంధం కాక ప్రేమానుబంధం పొందుదాం. ఏకాగ్రత సాధిద్దాం.

No comments:
Post a Comment