Monday, April 13, 2020

ప్రాయశ్చిత్త ప్రార్ధన

🙏 ప్రాయశ్చిత్త ప్రార్ధన 🙏
-------------------------
🌹ఓం శ్రీగురు దేవాయనమః 🌹

🌻 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా ! ఆది మధ్యాంత రహితా ! అనంత కళ్యాణ గుణధామా ! అఖండ పరమాత్మ స్వరూపా ! ఆర్తత్రాణ పరాయణా ! కరుణాసాగరా ! నమో నమః 🌻

🌷 దేవాది దేవా ! దివ్య ప్రభావా ! తండ్రీ నిన్నే నమ్మితిని ; నీవే నాకు రక్షకుడవు ! నిన్ను నమ్మి కొలిచే వారికి కష్టాలు , నష్టాలు తొలగించి సమస్త శుభాలు చేకూర్చెదవని తెలుసు. 🌷

🌻 స్వామీ ! ఏనాడు , ఎప్పుడు , ఏ జన్మలో చేసిన కర్మ ఫలమో తెలియదు. కానీ దాని పర్యవసానంగా ఈరోజు ఈ సమస్యను అనుభవించవలసి వచ్చింది. పరమాత్మా ! నేను ఈ జన్మలో గానీ , గత జన్మలో గానీ , తెలిసి గానీ , తెలియక గానీ , అజ్ఞానంతో గానీ , అహంకారంతో గానీ , ఎవరినైనా ఇబ్బంది పెడితే , ఏ ప్రాణికైనా బాధ కలిగించితే క్షమించు స్వామీ ! 🌻

🌹 శరీరంతో గానీ , వాక్కుతో గానీ , ఇంద్రియాలతో గానీ , మనసుతో గానీ , ఏ ప్రాణికైనా బాధ కలిగితే అది తెలియక చేసిందే స్వామి ! పరమాత్మా ! అజ్ఞానంతో తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపంతో వేడుకుంటే మన్నించి అనుగ్రహిస్తానని గీతలో మీరే చెప్పియున్నారు స్వామీ ! అందుకే మిమ్మల్ని ఈరోజు ఈ గురు సన్నిధిలో వేడుకుంటున్నాను. కనుక నా యొక్క దోషపూరితమైన కర్మలన్నింటినీ దగ్దమొనర్చి నన్ను పవిత్రుని చేయుము. తల్లి , తండ్రి , బంధువు , మిత్రుడు అన్నీ నాకు నీవే స్వామీ !🌹

🌷తండ్రీ ఈ క్షణం నుండి ఏ హృదయాన్ని గాయపరచను. ఏ తప్పు చేయకుండా నీవు చెప్పిన ధర్మానికి కట్టుబడి జీవించే విధంగా ప్రయత్నిస్తాను. అనంతమైన నీ శక్తి చైతన్యములు నాలో ప్రసరించి నీ సేవలో తరించేట్లుగా చూడు స్వామీ !🌷

🌻నా పిల్లలు , నా కుటుంబం యొక్క భారము , బాధ్యత నీదే స్వామీ ! చక్కటి ఆరోగ్యము మానసిక ప్రశాంతతను కలిగించుము. క్షేమ , స్థైర్య , విజయ , అభయ , ఆయురారోగ్య , ఐశ్వర్యాభివృద్ధితోపాటు , ఇహపర సౌఖ్యాలను కలిగించి చివరకు మోక్షసిద్ధిని ప్రసాదించి అనుగ్రహించుము. 🌻

🌻ముఖ్యంగా నేను ( మేము )ఈ సమస్యతో బాధపడుతున్నాను. కనుక అపారమైన మీ కృపను వర్షించి , అతి శీఘ్రముగా నా సమస్యను పరిష్కరించమని త్రికరణశుద్ధిగా ప్రార్ధించుచున్నాను. 🌹

💐🙏 సర్వం పరమాత్మ పాదారవిందార్పణమస్తు.🙏💐

- అచల గురువు శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారు.🙏🙏🌹🌹

అచల ఆశ్రమం జీడిమెట్ల హైదరాబాద్.

జై గురుదేవా🙏🙏🌹🌹🚩🚩

No comments:

Post a Comment