Monday, April 13, 2020

పంచ పునీతాలు

🙏🦋 పంచ పునీతాలు🙏🦋

మొదటిది..వాక్ శుద్ధి:
వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు
మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.

రెండవది..... దేహశుద్ధి:
మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.

మూడవది.....భాండ శుద్ధి:
శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.

నాలుగవది.......కర్మశుద్ధి:
అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.

ఐదవది..........మనశ్శుద్ధి:
మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి. 👍

No comments:

Post a Comment