Wednesday, April 22, 2020

మనం ఏ కర్మలు చేస్తే చెడు కర్మలు సృష్టించి నట్లవుతుంది?

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹🌹🌹🌹🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

తేదీ ... 15 - 04 - 2020,
వారం ... సౌమ్యవాసరే 【 బుధవారం

నేటి మాట

మనం ఏ కర్మలు చేస్తే చెడు కర్మలు సృష్టించి నట్లవుతుంది?

మన ఆరోగ్యాన్ని సరి గా చూసుకోక పోయినా డ్రగ్స్ తీసుకున్న , డ్రింకింగ్, పొగ తాగడం , అతి గా తిన్నా , పోషక ఆహారం తీసుకోక పోయినా , వ్యాయామం చేయక పోయినా , వ్యతిరేక ఆలోచనలు వున్నా , ఇవి చెడు కర్మ ని సృష్టిస్తాయి.

ఇతరులకు శారీరకం గా హాని చేసినా, ఉద్వేగ పరం గా హాని చేసినా, చెడు కర్మ ను సృష్టించినట్లే.

ఏదైనా పరిస్థితి ఎదురైతే దానిని ఎదుర్కొని , సమస్య పరిష్కారానికి , తగిన విధం గా కృషి చెయ్యక పోయినా , వాస్తవాన్ని అంగీకరించక పోయినా, చెడు కర్మ పొగవుతుంది.

ముఖ్యం గా మన చుట్టూ వున్న వ్యతిరేక ఆత్మల చెడు ప్రవర్తనను సహించినా,

వారికి ఎక్కడ తప్పు చేస్తున్నారో చెప్పక పోయినా , చెడు కర్మ పోగవుతుంది.

ఒకవేళ వారు మీరు చెప్పిన విషయాలు వినక పోతే వారి ఇష్టం.

వారి ని దూరం గా ఉంచేయాలి. ఒక వేళ వారి తో దగ్గర గా, వారి భావాలను గౌరవిస్తూ ఉన్నారంటే వారిని మనం ప్రోత్సహిస్తున్నట్లే.

అప్పుడు మనం కూడా వారి కోవ లోకే చేరి పోతాము.

తల్లిదండ్రులు, పిల్లలు, ప్రియతములు పట్ల బాధ్యత ను విస్మరించినా చెడు కర్మ పొగవుతుంది.

ఆత్మహత్య చేసు కోవడం , దీని వల్ల ఒక ఆవరణ మొత్తం కిందికి పడిపోతాము.

చెడు కర్మ పోగైనట్లే.

దేవుడు ఆత్మ కు తన ఆధ్యాత్మిక ధ్యేయం కోసం శరీరమనే వాహనాన్ని ఇచ్చాడు.

దానిని ధ్వంసం చేసే అధికారం మనకు లేదు.

ప్రతి ఒక్కరు ఏదో ఒక కర్మ ను చేయాలి.

ఏ కర్మ చెయ్య కుండా ఉన్నా చెడు కర్మ పోగ వుతుంది.

వినోదం కావాలను కోవడం, యుక్త వయసు లో ఉన్నప్పుడు జీవితాన్ని స్త్రీల తో అనుభవించాలి అనుకుంటారు.

ఒక్క చిన్న తప్పు తమ జీవితాల్ని నాశనం చేస్తుంది.

మరలా సరిదిద్దు కోనీయ కుండా చేస్తుంది.

ఈ విధంగా చేస్తే ఆత్మ కు హాని చేసినట్ల వుతుంది.

యుక్త వయస్సు లో ప్రలోభాలకు లోను కాకూడదు.

చెడు కర్మ పోగవుతుంది.

🌹శుభమస్తు🌹

🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

No comments:

Post a Comment