Saturday, May 2, 2020

యథా..యథాహి.. ధర్మస్య!

యథా..యథాహి.. ధర్మస్య!

👉చిన్నా పెద్దా లేకుండా వాడు వీడు అంటిమి

👉వావి వరుసల్లేకుండా ఆడవాళ్ళని చెరబడితిమి

👉టెక్నాలజీ పేరుతో కొండనాలిక్కు మందేస్తే.. అన్నట్టు ఉన్న సంప్రదయాల్ని వదులుకుంటిమి

👉సాధికారత పేరుతో చంకలు గుద్దుకుంటూ ఆడతనాన్ని పూర్తిగా వదిలేస్తిమి

👉 తల్లీ తండ్రిని బరువు గా భావించి అనాధాశ్రమాల్లో వెస్థిమి

👉అక్రమ సంబంధాల మోజులో అగ్నిసాక్షిగా తాళికట్టిన బతుకుల్ని అగ్గిపాలు చేసి కోర్టు గడపలెక్కితిమి

👉అడ్డేమంటే తెడ్డమనే మూకలుగా తయారైతిమి

👉విదేశీ మోజులో కన్నతల్లిని జన్మభూమిని వదిలి సప్త సముద్రాలు దాటి అస్తకష్టాల పాలైతిమి.

👉నీతి కి అతి దూరం అవినీతికి మహారాజులం ఐతిమి

👉 ప్రేమ కరుణ జాలి పదాలు ఏనాడో మర్చిపోతిమి.

👉 నారాయణ సమానులైన వైద్యులను డబ్బు పిశాచులుగా మార్చుకుంటిమి

👉 పుట్టేది ఆడ కడుపులో అయినా కడుపులో ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా చంపుకుంటిమి

👉 డబ్బును సృష్టించి దానికి బానిసలైతిమి.

👉 మందు,మాంసం ,మగువే జీవన లక్ష్యాలు గా సాగిపోతిమి.

👉 మంచికన్నా చెడునే ఆదరిస్థిమి.

👉వేదాలంటే..వేదన పడితిమి.

👉వైదీకులను మనుధర్మం పేరుతో పట్టి పీడిస్తుంటిమి.

👉పరోపకారం అనే పదానికి పరమార్థమే మార్చేస్థిమి..

👉అందుకే అప్పుడే..యధా యధా హి ధర్మస్య..అన్నట్టు భగవానుడు కరోనాను ప్రయోగించి..ధర్మస్థాపనకు పూనుకున్నాడు.

👉ఇప్పుడు నీ డబ్బు,నీ హోదా, నీ కుర్చీ, నీ రియల్ ఎస్టేట్, ఏదీ నిన్ను కాపడలేదు..ఒక్క నువ్ చేసిన "మంచి" తప్పా ! ఇప్పటికైనా తెలుసుకో మనిషీ..

👉నీ జీవితం క్షణ భంగురం..అంతా నీవేననుకుని ఎన్నో ఎన్నెన్నో మోసాలు ద్రోహాలూ చేస్తావు..నీ బ్రతుకే నీ చేతుల్లో లేదు బాగా గుర్తుంచుకో.. ఈ "కరోనా" (సంస్కృతంలో చేయు అని అర్థం) ధర్మ యుద్ధం లో మిగిలితే..ఇకనైనా నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకో...

No comments:

Post a Comment