👉 సాక్షి యొక్క గుణ ధర్మం ఏమిటి?
అతను ఏదీ పూసుకోవడం ఉండదు. ఎందులోనూ మునిగిపోవడం ఉండదు. అతను ఎప్పుడు బయటే ఉంటాడు. అతను కర్మలతో లీనమౌతాడు కానీ అతని లోపల నున్న తత్త్వం లీనమవదు. ఇదే ధర్మం.
కృష్ణుడు ఆఖరి విషయం చెప్తున్నాడు. సాక్షికి ఆవల ఇంకేదేనా ఉన్నదా అని ఎవరు తెలుసుకోవడం జరుగలేదు. దానికి ఆవల అస్థిత్వమే సమాప్తమౌతుంది. సాక్షి కన్నా వెనక్కి వెళ్లడం కుదరదు. సాక్షికి సాక్షి అవడం ఉండదు.
కృష్ణుని ప్రకారం హింస అనేది అసంభవం. మీరు చంపినంత మాత్రాన ఎవరు చనిపోవడం ఉండదు. దేహం మరో దేహాన్ని వెతుక్కుంటుంది.
నీవు ఒక అభినయం చేసేవాడివి. కర్తవి కావు. జీవితం అనే రంగస్థలం మీద నీవు చాలా పెద్ద పని చేస్తున్నావు. అందుకనే నేను, నీవు ఇంటిని, గృహస్థు ధర్మాన్ని, పిల్లలని, కుటుంబాన్ని వదిలేయాలి అని చెప్పను. ఎందుకంటే అసలు వేటిని వదలి వేయాలో వాటిని వదలి వేయకపోతే, దేన్నీ వదలినట్లు కాదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ఎక్కడున్నా ఒక్కటే. అక్కడే ఉండి, మీరు వుండే పద్ధతిని మార్చుకోండి.
ఎప్పుడు లోపల కర్త ఉండడో, అప్పుడు జీవితంలో ఎంత నిశ్శబ్దం ఆవరిస్తుందంటే, ఆ నిశ్శబ్దాన్ని ఏదీ భంగం కలిగించ లేదు. ఎంత దట్టమైన శాంతి మీ జీవితంలోకి ప్రవేశిస్తుందంటే, ప్రపంచంలో ఎంత కోలాహలం వున్నా, దాని ప్రభావం మీ మీద ఉండదు. ద్వంద్వాల వలన మీలో ఎలాంటి తేడా ఉండదు.
ఈ జీవన రంగస్థలం మీదకు నీవు ఒక అభినయం చేసే వాడిలా రావాలి, పోవాలి. నాటకం అయిపోయిన తర్వాత రంగస్థలం మీద తెర క్రిందకు వస్తున్నట్లు, మీకు మృత్యువు రావాలి. అప్పుడు అందులో ఎటువంటి బాధ ఉండదు. ఒక పని పూర్తి చేయడం అయింది అని కృతజ్ఞతలు చెప్పుకునే భావనే ఉంటుంది. వచ్చిన పని అయిపోయింది. పరమాత్మ నుండి పిలుపు వచ్చేసింది. వెనక్కి వెళ్లి పోవాలి. తెర క్రిందకు పడి పోయింది.
సాక్షీభావం తాళపుచెవి. దానిని వాడడం మొదలు పెట్టు. అది పరమ ధ్యానం. మరచిపోతూ, మరచిపోతూ ఉంటే, తిరిగి గుర్తు చేసుకుంటూ ఉండు. భోజనం చేస్తున్నావు అంటే, ఒక నాటకం వేస్తున్నప్పుడు నీవు భోజనం చేస్తున్నట్లు ఎలా నటిస్తావో, ఆ విధంగా భోజనం చేయి. ఈ నాటకం చాలా పెద్దది. డెబ్భై, ఎనభై సంవత్సరాలు సాగినా, అది నాటకం మాత్రమే.
సాక్షి అనేది సూత్రము. మహా సూత్రము. వేదాలని వదిలేసినా, ఉపనిషత్తులను వదిలేసినా, ఈ రెండు అక్షరాల సాక్షి అనే శబ్దాన్ని మీరు గుర్తుంచుకున్నారు అంటే, మీరు అన్ని శాస్త్రములు, మీ లోపల జన్మను ఇచ్చినట్లే. ఎందుకంటే సకల శాస్త్రాల శిక్షణ ఒక్కటే, "నీవు కర్తవి అవ్వొద్దు, ద్రష్టవి అవ్వు" అని.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂
లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004
👍 VicTorY oF LiGhT🎇
💚aaa🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe

No comments:
Post a Comment