Thursday, May 7, 2020

బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధుని కొన్ని బోధనలు

::బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధుని కొన్ని బోధనలు::

1. ధనం లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడు ధనికుడే. -బుద్ధ చరితం.
2. నీళ్ళ తాకిడికి శిలకూడా అరిగి చిన్నదవుతుంది. అలాగే ప్రయత్నం వలన కష్టం చిన్నదవుతుంది
3. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు
4. వాదవివాదాలు కొనసాగించినంత కాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది
5. ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టం.
6. మనకు బాధ కలిగిందని ఇతరులను బాధ పెట్టడం మూర్ఖత్వం
7. సంతృప్తి లేకపోవడమే అన్ని దుఃఖాలకు కారణం
8. ప్రశాంతమైన మనస్సే స్వర్గం.. చెడు ఆలోచనలతో కలుషితమైన మనస్సే నరకం
9. ఇంకొకరితో పోరాడి జయించిన విజయంకంటే, ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం
10. మాతృభాషలో వింటే, చదివితే కలిగే తృప్తి పరభాషలో వినడం, చదవడం ద్వారా రాదు
11. మనిషి చేసిన పాపాల తాలుకు పరిణామమే వేదన
12. భగవంతుణ్ణి సేవించాలనుకునేవారు ముందుగా దిక్కులేని వారిని సేవించుకోవాలి
13. చదువు కంటే మంచి నడవడిక ముఖ్యం
14. మనం పవిత్రంగా జీవించినంత కాలం అపనిందలకు భయపడాల్సిన అవసరంలేదు

No comments:

Post a Comment