Friday, May 1, 2020

క్రైస్తవ లవ్ జిహాద్

క్రైస్తవ లవ్ జిహాద్

మిస్సమ్మ, సీతాకోకచిలుక, ఆరాధన, ఎం మాయ చేశావే -
ఈ నాలుగు సినిమాలలో కథానాయిక క్రైస్తవురాలే. ఇవి హిందూ పురుషుడు, క్రైస్తవ స్త్రీల పెళ్ళిళ్ళని ప్రోత్సహించడానికి తీసి ఉండవచ్చు. సినిమా పరంగా చూస్తే, ఈ చిత్రాలలో కథానాయిక హిందువు అయినా కథకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా సరే, కథానాయికని క్రైస్తవురాలిగా చూపారు.

కనీసం నాకు గుర్తున్నంత వరకూ ఈ సినిమాలలో కథానాయికల క్రైస్తవాన్ని చూపించినంత బలంగా నాయకుడి హిందుత్వాన్ని చూపరు. ఇలా ఆడవారిని ఉపయోగించుకోవడం, క్రైస్తవ మత మార్పిడి వ్యూహాలలో మొదటి నుండీ కీలకమే. రెండవ శతాబ్దంలో ఒక క్రైస్తవురాలు రోమన్ సామ్రాజ్యపు రాజవంశంలోకి వివాహం ద్వారా ప్రవేశించి, కొంత కాలం తరువాత భర్త ద్వారా తన చర్చ్ బిషప్ సలహా మేరకు ఎందరో క్రైస్తవ ఖైదీలను విడుదల చేయించింది. క్రైస్తవ వ్యాప్తిలో అత్యంత కీలకపాత్ర పోషించిన కాన్స్టాటిన్ తల్లి కూడా, చిన్న తనంలో క్రైస్తవంలోకి మారింది. ఆవిడ వల్లనే కాన్స్టాటిన్ క్రైస్తవుడిగా మారాడు. కాన్స్టాటిన్ తండ్రి ఆ క్రైస్తవురాలిని పెళ్లి చేసుకోకపోయి ఉంటే, పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. ఇక మన దేశంలో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో చూసినా ఈ విషయం మనకు అర్థం అవుతుంది.

పిల్లల మీద తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కనుక తల్లి క్రైస్తవురాలు అయితే, తండ్రి హిందువుగానే ఉన్నా, పిల్లలు క్రైస్తవులుగా మారిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ. క్రైస్తవ మత ప్రచారకులు ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని 1 - 2వ శతాబ్దాలకు చెందిన చరిత్రకారుడు ఒరేగాన్ కూడా నిర్ధారించారు.

భార్య క్రైస్తవురాలు అవ్వడం వలన, హిందువులుగా ఉన్న భర్తలు ఎందరో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారు స్వయంగా ఎందరినో మీరూ చూసి ఉంటారు. ఇదేదో కాకతాళీయంగా జరుగుతోంది కాదు, పక్కా వ్యూహం ప్రకారం జరుగుతోంది. కొంతకాలం క్రితం నేను గోవా వెళ్ళినప్పుడు కూడా ఇటువంటివి చాలా విన్నాను. అక్కడ సమాజంలో ప్రముఖ స్థానాలలో ఉన్న వారి కొడుకులను అమ్మాయిల ద్వారా క్రైస్తవంలోకి మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అక్కడి వాళ్ళు చెప్పారు.

లవ్ జిహాద్ ఒక రకమైన సమస్య అయితే.....ఇది మరొక రకమైన సమస్య.
దీని మీద కూడా చర్చ అవసరం

వడియాల రంజిత్ Face Book

No comments:

Post a Comment