Tuesday, June 30, 2020

ఏది మరణం

ఏది మరణం

మనిషిగా పుట్టింది మహాత్ముడయ్యేందుకే
అని తెలిసినా అలా జీవించలేక పోవటం ...మరణం

మానవసేవే మాధవసేవని మనుస్మృతులు ఘోషిస్తున్నా...
గోవిందుడు గుళ్లో ఉన్నాడని
గంగిరెద్దులా జీవించటం.... మరణం

అర్హత లేని వాడి దగ్గర ఆత్మాభిమానం చంపుకుని బతకటం...మరణం.

కళ్లముందు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్యం మరణం

రోడ్డు మీద కొన ఊపిరి తో ఉన్న వాణ్ణి చూసి మొహం తిప్పుకొని మన దాకా వస్తే గాని పట్టించుకోకపోవటం... మరణం

ఇనప్పెట్టెల్లో నోట్లకట్టలు ఇరుక్కుని
ఇమడలేక పోతున్నా...
పక్కవాడికి పది రూపాయలు
ఇవ్వలేకపోవడం...మరణం.

బ్యాంకు లాకర్లలో కోట్లు కోట్లు మూలుగుతున్నా
బడుగుజీవి బాగు కోసం ఒక్కరూపాయి
ఉపయోగించలేక పోవడం...మరణం

నమ్మిన వాళ్లని నట్టేట ముంచి
చేసిన సాయం మరచి పోవటం..మరణం

నా అనుకున్న వాళ్ళని నగుబాటుకు గురిచేసి..
నాలుక మడతేసి నాకేంటి అనుకోవటం..మరణం

ఎందుకు పుట్టామో తెలియక
జీవించి వున్నా జీవచ్చవం లా
బతకడం.. మరణం.

ప్రాణం పోవటం కాదు.. మరణం
ఎలా జీవించాలో తెలియకపోవడం..
మరణం.

Source - whatsapp message

మనం వేరేవారికి ఏం చేస్తామో, తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ, దుఃఖం కానీ సంతోషంకాని, మోసగించటం కానీ మోసపోవటం కానీ, తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.

ప్రతిఫలం ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో
జీవనం సాగిస్తుండేవాడు. కొన్ని పాలని ఊరిలో అమ్మి
ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు.
భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్
సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది,ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి అక్కడి యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు , పప్పు, బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది.. 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.యజమాని అన్నీ తూకం చేసి చూస్తే అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది
ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే.నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు..

మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు
అప్పుడు యజమాని చెప్పాడు.. నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి..నెయ్యి 1kg అని 900gm ఇస్తావా.. ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు...

అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ మోసగాణ్ణి కాదు.. నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర ఆధారంగా ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు..
అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు..

మిత్రులారా.. మనం వేరేవారికి ఏం చేస్తామో
తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ, దుఃఖం కానీ సంతోషంకాని, మోసగించటం కానీ మోసపోవటం కానీ, తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.👏

Source - whatsapp sandesam

విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి ‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక.. ‘మీరెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి.. ‘మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి.. ‘నాకు తెలియదు. గొంతు ఎండిపోతోంది. ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. ‘మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి. మీరేమో అలిసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు!’ అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి.. ‘మాతా నీళ్లు ఇవ్వండి. దాహంతో చనిపోయేలా ఉన్నాను..’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి.. ‘మీరెవరో సెలవివ్వండి.. నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా.. ‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు. ‘మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది. కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.

ఓపిక నశించిన కాళిదాసు.. ‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ.. ‘ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.

గమనిక;- విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి .

Source - whatsapp sandesam

అద్దంలాంటి జీవితాన్ని.. అర్థం చేసుకుని జీవించాలి.ధ్యానం తో ముందుకు వెళ్లాలి.మన జీవితం.మన ఇష్టం.

మనం ఎవరికో నచ్చాలని నటించకూడదు..ఎవరికో నచ్చలేదని మనలో ఉన్న సహజమైన వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదు... మనమంటే నచ్చినవారే మనతో ఉంటారు ...నచ్చని వారు వెళ్ళిపోతారు, వెళ్లేవారికి దారిని వదిలేయండి. .ఒకరికి నచ్చలేదు అని కోయిల తన గానమాధుర్యం,మార్చుకోదు..మల్లె తన సువాసన, మార్చుకోదు.. వెన్నెల అందం మారదు..నెమలి నాట్యం మారదు...ఇలా ప్రకృతిలో ఎవరి ప్రత్యేకతను వారు,చాటుకుంటుంటే..మనం ఎందుకు మన సహజత్వాన్ని కోల్పోవాలి.. మనకు నచ్చినది నిజాయితీతో కూడుకున్నది అయి ఉంటే చాలు.. నీ మనసుకు నీవు సమాధానం చెప్పుకోగలిగితే చాలు.. నీకు నీవే,మహోన్నతుడివి..అద్దంలాంటి జీవితాన్ని.. అర్థం చేసుకుని జీవించాలి.
ధ్యానం తో ముందుకు వెళ్లాలి
.మన జీవితం..
మన ఇష్టం.....
🙏🏻🥳🙏🏻🥳🙏🏻🥳🙏🏻
మీ...పి.సారిక

Source - whatsapp sandesam

Monday, June 29, 2020

ప్రశ్న: ధ్యానం చేస్తూ తప్పులు చేయవచ్చా? తప్పులు చేస్తూ ధ్యానం చేయవచ్చా?

ప్రశ్న: ధ్యానం చేస్తూ తప్పులు చేయవచ్చా
తప్పులు చేస్తూ ధ్యానం చేయవచ్చా

ఓ సాధువు. దగ్గర
బోలెడంత మంది శిష్యులున్నారు.
ఓ రోజు ఆయన వద్దకు
ఓ పాత శిష్యుడు వచ్చాడు.
గురువుగారికి నమస్కరించాడు.
అవీ ఇవీ మాట్లాడుకున్నాక అతను
‘‘గురువుగారూ నాకో సందేహం. మనసెప్పుడూ గందరగోళంగా ఉంటోంది’’ అన్నాడు శిష్యుడు.‘‘ఎందుకు?’’ గురువుగారు ప్రశ్నించారు.‘‘నేను మీ దగ్గరున్న రోజుల్లో పద్ధతి ప్రకారమే ధ్యానపద్ధతులు నేర్చుకున్నాను. అంకితభావంతోనే అనుసరించాను. ఆ ధ్యానపద్ధతులు నాకు తగిన ప్రశాంతతనే ఇచ్చాయి. మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాను కూడా. ఇది అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను’’ అన్నాడు ఆ పాత శిష్యుడు. ‘‘అటువంటప్పుడు సంతోషమేగా... మరెందుకు గందరగోళం?’’ అన్నాడు గురువు.‘‘నేను ధ్యానంలో లేనప్పుడు పూర్తి మంచి వాడిగా ఉంటున్నానో లేదో అనే సందేహం కలుగుతోంది. ఆ విషయం నాకే తెలుస్తోంది. కొన్నిసార్లు సరిగ్గా లేనని అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఒకటి రెండు తప్పులు కూడా చేస్తున్నాను.

ధ్యానం తెలిసిన నేను ఇలా చేయడం సముచితమేనా. అది ఆలోచించినప్పుడు నా మనసు కలవరపడుతోంది’’ అన్నాడు శిష్యుడు.అతను చెప్పిన మాటలన్నీ విన్న గురువుగారు ఓ నవ్వు నవ్వారు.‘‘ఆహా, నువ్వు ధ్యానమూ చేస్తున్నావు. తప్పులూ చేస్తున్నావు. అంతేగా నీ మాట’’ అన్నాడు గురువు.‘‘అవును గురువుగారూ...’’ అది తప్పు కదా అని అడిగాడు గురువు:‘‘కాదు. నువ్వు రోజూ ధ్యానం చెయ్యి. తప్పులూ చెయ్యి. ఇలాగే చేస్తూ ఉండు. ఏదో రోజు ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆగిపోతుంది’’ అన్నాడు గురువు.
‘‘అయ్యో.. గురువుగారూ అలా అంటే ఎలాగండీ... ఒకవేళ తప్పులకు బదులు ధ్యానం ఆగిపోతే..?’’ అని ప్రశ్నార్థకంగా చూశాడు శిష్యుడు గురువు వంక.‘‘అదీ మంచిదేగా....నీ నైజమేంటో నీ సహజత్వమేదో తెలిసొస్తుంది కదా’’ అన్నాడు గురువు. అర్థమైందన్నట్లుగా చిరునవ్వుతో తల పంకిస్తూ గురువుగారికి నమస్కరించాడతను.
🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻
మీ....పి సారిక..

Source - whatsapp sandesam

శరీరానికి భోజనం ఆహారం ఎలాగో, మనసుకు దైవ ధ్యానం, దైవ నామ స్మరణ అలాగా!

ఒక ఊర్లో వున్న గుడిలో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తాడు..

అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి సాధించేది ఏమి వుంది? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను.

ఒక్కటైనా గుర్తుందా? అందుకే గుడికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు''.
అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట ...

''నాకు పెళ్ళి అయ్యి పదిహేనేళ్లు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం కొన్ని వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది.

నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా? కానీ నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందగలిగాను.

ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే నాకు ఆ శక్తి ఎక్కడిది? ఈ పాటికి చనిపోయి వుండేవాడిని''.

అందుకే,
శరీరానికి భోజనం ఆహారం ఎలాగో, మనసుకు దైవ ధ్యానం, దైవ నామ స్మరణ అలాగా!
అందుకే దైవస్మరణ నిరంతరం చేస్తూనే వుండాలి.

మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.

ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻

సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

Source - whatsapp message

సమర్ధత - చిన్న కథ

సమర్ధత.
ఒకసారి కుందేలుకు ఒక కోరిక పుట్టింది - తను అడవికి రాజునైతే బాగుండుననిపించింది. ‘ఎప్పుడూ సింహమే రాజు ఎందుకు అవ్వాలి? రాజవ్వటం అనేది వంశపారంపర్యం కాకూడదు.

సింహమూ, దాని కొడుకూ, మళ్ళీ దాని కొడుకూ - ఇదే క్రమం అయితే మిగతా జంతువులకు అవకాశం రాదు గద!’కొన్ని రోజులపాటు ఆలోచించిన పిమ్మట అది ఇక ఊరుకోలేకపోయింది. సింహంగారి దర్బారుకి వెళ్ళి అడిగేసింది -

"సింహంగారూ! అడవికి మీరే ఎప్పుడూ రాజవ్వటం బాగాలేదు. మేమూ ఉన్నాం జంతువులం. మాకూ అవకాశం ఇవ్వండి." అని.

సభికులంతా నివ్వెరపోయారు. సభంతా నిశ్శబ్దంగా వణికిపోయింది. సింహం ఇక కుందేలును రాజద్రోహ నేరంకింద శిక్షించి తీరుతుందని అందరూ ఊపిరి బిగపట్టారు.అయితే సింహం చిరునవ్వు నవ్వింది.

"అవును మిత్రమా, మరిచాను. ప్రజాస్వామ్య భావజాలం పరుచుకున్న ఈ రోజుల్లో మేం ఇంకా ఇలా రాజసింహాసనాన్ని అంటిపెట్టుకు కూర్చోవడం బాగాలేదు. నీకే ఇస్తున్నా మొదటి అవకాశం. ఈ క్షణం నుండీ ఈ అడవి మొత్తానికీ సర్వం సహా చక్రవర్తివి నీవే. నేను నీకు వెన్నుదన్నుగా రాజ్యరక్షణ భారం వహిస్తాను."

"అదికూడా అవసరం లేదు మిత్రమా! అన్నది కుందేలు రాజోచితంగా." రాజ్య రక్షణ ఇకపై మా బాధ్యత. మీరు అంత:పురంలో విశ్రాంతి తీసుకోండి, లేదా వనాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోండి."సభలోని వారికి ఎవరికీ నోటమాట రాలేదు.

సింహం గద్దె దిగుతూ" ప్రజలారా! ప్రజాస్వామ్య భావనలను గౌరవిస్తూ మేం రాజపదవి నుండి తప్పుకొని, కుందేలుకు తొలి అవకాశం ఇచ్చాం. మీరంతా రాజౌన్నత్యాన్ని గౌరవిస్తూ మీ కొత్త రాజు పట్ల విదేయులుగా వర్తిస్తారనీ, వనశాంతిని సంరక్షించడంలో మీ బాధ్యతల్ని గుర్తించి మసులుకుంటారనీ ఆశిస్తున్నాను" అని ముగించి నిష్క్రమించింది.

అందరూ కుందేలు మహారాజుకు జయం పలికారు. కానీ ఎవరికివారు నోళ్లు నొక్కుకున్నారు. ముఖ్యంగా పులి సేనాపతీ, గుంటనక్క మంత్రీ నోరు మెదపలేదు. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా రాజ్యాన్ని కబళించే యోచనలోనే ఉన్నారు. ఇప్పుడు సింహమే తమ మార్గాన్ని సుగమం చేసింది! కుందేలు పని ముగించటం ఎంతసేపు? ఇలా సాగుతున్నాయి వాటి ఆలోచనలు.

ఆ రోజు రాత్రి కుందేలుకు నిద్రపట్టలేదు. ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తోంది. తను తీసుకురావాల్సిన మార్పులు ఏమున్నాయని ఆలోచిస్తుండగానే తెల్లవారింది. అంతలోనే అంత:పురం గగ్గోలెత్తింది. పులి సేనానీ, గుంటనక్క మంత్రీ తిరుగుబాటు చేశారు. తమ బలాలతో కోటను పూర్తిగా ముట్టడించారు.

కుందేలు మహా రాజు అత్యవసర సమావేశం నిర్వహించింది. పులికీ, నక్కకూ తానే స్వయంగా బుద్ధి చెబుతానన్నది. జన నష్టం తనకు ఇష్టంలేదు కనుక , ఒక్క ఏనుగుపైనెక్కి తాను తన ప్రతాపం చూపిస్తానన్నది.

ఏనుగు పూర్తిగా తయారై, రాజుగారిని అంబారీమీద ఎక్కించుకొని, కోట తలుపులు తెరిచి, ముందుకు ఉరికింది. ఎదురుగా పులీ, నక్కా తమ సైన్యాలను మోహరించి నిలబడి ఉన్నాయి. ఏనుగు వాటికి ఎదురుగా నిలబడి, కుందేలు మహారాజు వేస్తానన్న శరపరంపరలకోసం ఎదురుచూస్తున్నది.

కానీ ఆశ్చర్యం! ఒక్క బాణమూ రాలేదు! ఏనుగు తొండంతో తన వీపును తడుముకొని చూసింది. అక్కడ కుందేలు మహారాజు లేడు. శత్రుమూకల శబ్దానికి వెరచి ఏనాడో పలాయన మంత్రం పఠించారు వారు!

భయంతో బిక్కచచ్చిపోయిన ఏనుగు ప్రళయకాల ఘర్జనలా వినవచ్చిన సింహనాదంతో అకస్మాత్తుగా మేలుకున్నది. తన పక్కనే నిలబడి సింహం భీకరంగా గర్జిస్తున్నది. శత్రుసైన్య సమూహం ఆ గర్జనకు కకావికలై దారీతెన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్నది! సింహం వారిని తరిమి, అందినవారిని అందినట్లు విసిరేస్తున్నది.

పులి సేనానీ, గుంటనక్క మంత్రీ ఇక ఎవ్వరికీ కనిపించలేదు.
కుందేలు కూడానూ!

తిరిగి అడవిని సింహమే పరిపాలించవలసి వచ్చింది.

"అసమర్థులైన రాజులు / నాయకులు రాజ్యానికి , వ్యవస్థకి వన్నె తేలేరని అందరికీ మరోసారి తెలిసివచ్చింది.
మన సమర్ధతకు మించి గొప్పలకు పోతే...మొదటికే మోసం వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త..."

సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

Source - whatsapp message

అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి. ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.

జీవితంలోంచి దువ్వెన అనే వస్తువును తీసేయ్.....
అపుడు ఏం జరుగుతుంది?నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు.

నీ జీవితంలోంచి అద్దం అనే వస్తువును తీసేయ్.....తర్వాత నిన్ను నువ్వే చూసుకోలేనంత అసహ్యం గా ఉంటావు.

ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక....మరుసటి దినం ఏపనీ సక్రమంగా చెయ్యలేవు...

నీ జీవితాన్నే అందంగా, సౌఖ్యం గా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా థాంక్స్ చెప్పావా????

3 పూటలా నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో....ఒక్క రోజైనా థాంక్స్ చెప్పావా....

ఒక్క 3 నిముషాలు చెట్లు స్ట్రైక్ చేస్తే....భూమండలం అంతా శవాల దిబ్బ ఐపోతుంది.....చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న నీవు ఒక్క రోజైనా చెట్టును ప్రేమగా స్పర్శిస్తూ థాంక్స్ చెప్పావా....

ఎండకూ, వానకూ, అమ్మకూ ,నాన్నకూ....నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతికీ.....గురువుకు....నువ్వు తినే తిండికి..
ఎప్పుడైనా, ఎలాగైనా థాంక్స్ చెప్పావా...

అంటే నీకు తీసుకోడమే తప్ప ......ఇవ్వడం రాదన్నమాట...
ఇస్తేనే ...తిరిగి లభిస్తుంది.

నిజానికి పై వస్తువులేవీ...నీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి.

నీకు సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు......నీ మనసు పవిత్రతతో కడిగివేయబడి నిష్కల్మషం ఐపోతుంది.
ఇదే అంతః శుద్ధి....ఇదే పవిత్రత...ఇదే దైవత్వం.
ఇలాగే స్వచ్ఛతను సాధించాలి.

సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ....అత్యంత శక్తి కల్గివుంటుంది.

ప్రతీ రోజూ....నీకు సహాయం చేస్తున్న ప్రతీ వస్తువూ, మనిషి,జంతువు,...ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి. ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.

Source - whatsapp sandesam

మంచి నీళ్ళు ఎప్పుడు ఎలా త్రాగాలి

మంచి నీళ్ళు ఎప్పుడు ఎలా త్రాగాలి ...
.....
భోజనం చేసిన 1 1/2 గంట తర్వాత నీళ్ళు త్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం జఠరస్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీపమై ఉంటుంది. నీరు త్రాగితే జఠరాగ్ని చల్లబడి తిన్న ఆహారము పూ ర్తిగా జీర్ణము కాక మలబద్దకం గ్యాస్ సమస్యలు వస్తాయి.

భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చు. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే , కాస్త అంటే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చు. భోజనం మగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి రెండు గుటకల నీరు త్రాగవచ్చును.

భోజనం తరువాత నోరు సుబ్బరంగా నీళ్లతో పుక్కిలించాలి

భోజనంతో తీసుకోతగిన ఉత్తమమైన పదార్థాలు, పండ్లరసాలు , మజ్జిగ , పాలు. మనం ఎల్లప్పుడు పండ్లరసాలను ( ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళు మాత్రమే) ఉదయం భోజనాంతరము, మజ్జిగ మధ్యాహ్న భోజనాంతరము , పాలు రాత్రి భోజనాంతరము మాత్రమే త్రాగాలి. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు , ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది.

నీటిని ఎప్పుడు నిలబడి త్రాగరాదు.

💦 రిఫ్రిజరేటర్ నీళ్ళు చాలా హానికరం.

💧గట గటా నీరుత్రాగే విధానం మంచిది కాదు.

💧కూర్చొని నింపాదిగా ఒక్కొక్క బుక్క నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి. వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి.

ఎందుకంటే నోటిలో లాలజలం తయారవుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. మనం నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగితే నోటిలోని లాలజలంతో కలసి పొట్టలోకి చేరుతుంది. పొట్టలోని ఆమ్లాలతో కలసి న్యూ ట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలజలం తయారయ్యేది పొట్టలోనికి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికే.

ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కోక్క గుటగా త్రాగుతుంది.

ఎడమ వైపు నిద్ర పోవడం

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు
వజ్రాసనం వేయండి .
# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం
2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది .
ఎడమ ప్రక్కకు తిరిగి పడుకొని విశ్రమించాలి .
# దీనిని
వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు .
# మన శరీరంలో
సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
ప్రయోజనాలు

1 . గురక తగ్గి పోవును .
2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .
6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .
14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .
ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .

# దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
కుదరక పోతే తూర్పు తల పెట్టి పడుకోవాలి
# ఉత్తరం వైపు తలపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు .
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Whatsapp message posted

తల్లికి కపిలుడి తత్త్వ బోధ - విష్ణు పురాణము నుండి

» హిందూ పురాణములు » తల్లికి కపిలుడి తత్త్వ బోధ(

ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు.
”నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్ళు చల్లావు. నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో.
కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి ”నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది.
”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుబోతూ ”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. ‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ ”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి.
”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. కపిలుడు మందహాసం చేసి ”అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యానిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం. కాయలు నరుకుతున్నాం. అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా.
నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. కపిలుడు మందహాసం చేసి ”అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా! నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు.
”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉంచి ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు.
అరటి పిలక మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం.
”మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు.
”ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషిడిగా’ తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది.
”ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి.
”ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?”
కపిలుడు అలా వివరంగా ఉపదేశించి ”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు.
దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాస్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రిడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. ”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు నా గర్భమున సుతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.
కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు.
– సేకరణ : విష్ణు పురాణము నుండి

Whatsapp message posted

కరోనాకు భయపడకండి... ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి..

కరోనాకు భయపడకండి... ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి..

కరోనా వ్యాధికి చికిత్సపై.. సీనియర్ జర్నలిస్టు రమణకుమార్ గారి స్వీయ అనుభవం..

Dear friends:

కరోనాకు భయపడకండి.

కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.

నేను వృత్తి రీత్యా జర్నలిస్టును. 24 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నాను. నా వృత్తి ధర్మంలో భాగంగా నేను విధులు నిర్వహించడానికి వెళ్ళినప్పుడు మరో మీడియా మిత్రుని ద్వారా నాకు కరోనా సోకింది.

నాకు positive వచ్చింది అని తెలియగానే ముందు నేను కొంత ఆందోళన పడ్డాను. వెంటనే మా కుటుంబ సభ్యులకు టెస్ట్ చేయించడంతో వారికి కూడా positive అని తేలింది.

ఆందోళన నుంచి తేరుకొని నా మిత్రులు, శ్రేయోభిలాషులు సూచన మేరకు వెంటనే మా కుటుంబ సభ్యులు అందరం నేచర్ క్యూర్ హాస్పిటల్ లో చేరాము.

హాస్పిటల్‌లో వైద్యులు ఇచ్చిన మెడిసిన్స్, అక్కడి వాతావరణం మమ్మల్ని వారం రోజుల్లోనే సాధారణ వ్యక్తులుగా మార్చింది.

మాకు ఇచ్చిన మెడిసిన్స్
ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
B-Complex,
C Vitamin Tablets,
Citrizen Tab,
Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)

నాకు కానీ, నా మిస్సెస్ కు కానీ పెద్దగా సింప్టమ్స్ ఏమి లేవు. టెస్ట్ positive వచ్చిన తర్వాత రెండవ రోజు నుంచి మా ఇద్దరికీ కొంచం పొడి దగ్గు ప్రారంభం అయింది. జ్వరం ఉండేది కాదు కానీ, బాడీ feverish గా ఉండేది. డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracitamal ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాము. పొడి దగ్గు ఉంది కాబట్టి దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాము. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు వేసుకున్నాము.

ఈ మెడిసిన్ తో పాటు మేము పాటించిన నియమాలు ఏమిటి అంటే.

తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని garlic చేయడం (పుక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.

వీటన్నిటినీ మేము వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడంతో వారం రోజుల్లోనే మేము సాధారణం స్ధితికి వచ్చేశాము.

వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, orenge వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు.

నేచర్ క్యూర్ హాస్పిటల్ లో...
మేము ఉదయమే హాస్పిటల్‌కు వెళ్ళాము. ఎంట్రెన్స్ లోనే టిఫిన్, వాటర్ బాటిల్స్, మాకు అవసరమైన సామాగ్రి ఇచ్చారు. మేము రూమ్ లోకి వెళ్లిన ఒక గంట తర్వాత డాక్టర్ వచ్చి మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు లంచ్, సాయంత్రం 4:30 గంటలకు హెర్బల్ టీ, సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మళ్లీ డాక్టర్స్ విజిట్. రాత్రి 8:00 గంటలకు భోజనం. ఇక్కడ హాస్పిటల్ లో సౌకర్యాలు, వైద్యులు, ఇతర అన్ని రకాల సిబ్బంది సేవలు అభినందనీయం. మరీ ముఖ్యంగా నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో వాతావరణం ఇక్కడికి వచ్చిన వారి రుగ్మతను సగం తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఉదయం, సాయంత్రం డాక్టర్స్ విజిట్. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం హెర్బల్ టీ.

ఇక్కడి వైద్యులు ఇచ్చే సూచన మేరకు మెడిసిన్స్ వాడడం, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే ఇక్కడికి వచ్చిన వారు నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఉదయం, సాయంత్రం ఇచ్చే హెర్బల్ టీ లో వేసే పొడి..."మిరియాలు, దాల్చిన చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ కప్పు, సాయంత్రం ఒక టీ కప్పు ఇస్తారు. ఈ నాలుగు కలిపి దంచి తయారు చేసిన పొడిని ఒక టీ కప్పుకు సగం చెంచా చొప్పున వేసుకోవాలి.

నిజంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ వైద్యుల, సిబ్బంది సేవలు అభినందనీయం.

కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి. వారిలో ముందు ఆత్మస్థైర్యాన్ని నింపండి. వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. గుండె జబ్బు, కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు లేని వారు కరోనా గురించి అస్సలు చింతించకండి. ఇవి ఉన్నవారు డాక్టర్ల సూచనతో చికిత్స పొందండి. ఏమీ కాదు.

కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుంది డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం అయిపోతుంది. కరోనా కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి.

- ఎ. రమణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్.

గమనిక.. ఇది నేచర్ క్యూర్ ఆసుపత్రి ప్రమోషన్ కోసం రాసినది కాదు. ఆ ఆసుపత్రిలో చేరిన తర్వాత వారి స్వీయానుభవం ఇది. ఏ ఆసుపత్రికి వెళ్లనవసరం లేకుండానే పైన చెప్పిన మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్న ప్రాక్టికల్ అనుభవం ఇది. ఆ రకంగానే దీన్ని చూడగలరు.
Copied

Have a nice day 🙏

Source - whatsapp message

స్వర్గీయ ప్రధాని పీ వీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా

(స్వర్గీయ ప్రధాని పీ వీ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా)

కోటిరత్నాల వీణలో ఒక భారత రత్న

కొందరు పుట్టుకతో గొప్పవాళ్ళు. కొందరు గొప్పతనం సంపాదిస్తారు. మరి కొందరికి గొప్పతనం ఆపాదించ బడుతుంది. అయితే వీటన్నిటికీ అతీతంగా ఎనిమిది పదులు దాటిన జీవితంలో గొప్ప అన్న పదం దగ్గరకు చేరనివ్వకుండా కూడా ఈ నేల మీద నడిచిన కొద్దిమందిలో నువ్వుంటావు. ఎవరూ చెప్పకుండానే వర్షించే మేఘంలా, ఎవరి ప్రమేయం లేకుండానే ప్రవహించే నదిలా, నిశ్శబ్ద ఆనందాన్ని అనుభవిస్తూ పాలిచ్చే గోవులా, తలలు వంచి చేతులకు పళ్ళను అందించే తరువులా ఈ జాతికి, ఈ నేలకు, ఈ దేశానికి నువ్వు చాలా ఇచ్చావు. పద్నాలుగు భాషలు నేర్చినా అనవసరంగా ఒక్క పదం కూడా పలకని నిన్ను చూసి విసుక్కున్న విలేఖరులు ఉన్నారు. అస్మదీయులు తస్మదీయులు అన్న భేదం లేకుండా ఉన్న నీ జీవన సరళి చూసి నిరాశ పడ్డ అభిలాషులు ఉన్నారు. అరకొర బలంతో ఉన్న నీవు ఏ సమస్య రాకుండా ఐదేళ్లు ఈ దేశాన్ని నడిపిస్తే చాలు అనుకున్న శ్రేయోభిలాషులు ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, ఒక యోగిలా, ఋషిలా, మౌనిలా ప్రపంచంలో నే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నువ్వు నడిపిన తీరు నభూతో నభవిష్యతి.

ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. లాలకృష్ణ అద్వానీ గారు వెక్కి వెక్కి ఏడవటం ఆకాశవాణిలో విన్నాను. ఆకాశంలో ఈ ఏడు రోజులు మబ్బులు కమ్ముకోవటం కళ్లారా చూసాను. ఒక మహావృక్షం నేలకు ఒరిగిపోయినప్పుడు భూమి కంపించటం మామూలే అంటే చలించి పోయారు కోట్లాది మంది. మళ్ళీ సెక్యూరిటీ గార్డులుగా సిక్కులనే ఎందుకు పెట్టారు అని ఇంటర్వ్యూ చేస్తున్న రష్యన్ ఉస్తినోవ్ అడిగితే "శతాబ్దాలుగా ఈ దేశం ఎన్నో దురాక్రమణలకు గురి అవుతూనే ఉంది. దండెత్తి వచ్చిన వాళ్ళందర్నీ ఈ దేశం అక్కున చేర్చుకుంది. అది ఈ నేల ప్రత్యేకత" అంటూ సమాధానం ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆకాశమంత ఎత్తు కనిపించారు. అలాంటి గొప్ప నేపథ్యంలో, అలాంటి విషాద సమయంలో రాజీవ్ గాంధీ నిన్ను అప్పుడే ప్రారంభించిన మానవ వనరుల శాఖకు మంత్రిని చేస్తే అందరు అంత ప్రాముఖ్యత లేదు అని పెదవి విరిచారు. అయితే నిన్ను అంతగా ఇష్టపడే రాజీవ్ గాంధీ అలా ఎందుకు చేస్తారు అని ప్రతి రోజూ నాగపూర్ నుండి వచ్చే హితవాద పత్రిక చదువుతూ ఉండే వాడిని. అప్పుడు తెలిసింది. రాజీవ్ గాంధీ ఈ దేశ ముఖ చిత్రం మార్చాలని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అని. అందరూ అన్ని సమస్యలకు కారణం ఈ దేశ జనాభా అంటే అదే దేశ జనాభాను ఉత్పాదక శక్తిలా మార్చాలని అనుకున్నారని. అందుకు నిన్ను ముఖ చిత్రం గీసే చిత్రకారుడిలా ఎంచుకున్నారని.

వందేళ్ల వృద్ధ పార్టీలో అరవయ్యేళ్ళ వృద్ధుడు ఈ దేశ మానవ వనరులను బలీయం చేయడాన్ని ప్రతి రోజూ గమనించాను. అనతి కాలంలోనే ఈ దశను మార్చే ఒక దిశ నిర్ధారణ అయ్యింది. ఇక నా దేశం కొత్త బంగారు లోకాన్ని చూస్తుందని కలలు కంటున్న సమయంలో ఉరుములు మెరుపులు వచ్చి, తుఫానుగా మారి అప్పుడే కాయలు కాయటం మొదలు పెట్టిన మరో వృక్షాన్ని సమూలంగా పెకలించటం చూసాను. అస్తవ్యస్త భారత రాజకీయ చిత్రం మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చింది. బహుశా చిత్రించిన ముఖ చిత్రం గుండెల్లో పెట్టుకున్న నీ అవసరం ఈ దేశం గుర్తించి ఉంటుంది. అందుకే రాజీవ్ కూడా చనిపోయాక, ఎన్నికల్లో పార్టీ ముందున్నా నువ్వు ఓడిపోయాక, ఎవరు పట్టించుకుంటారు అనుకుని హైదరాబాద్ వచ్చేయాలని బట్టలు సర్దుకున్న సమయంలో పిలుపు వచ్చింది. ఈ దేశ తొమ్మిదో ప్రధాన మంత్రిగా నీ ప్రయాణం మొదలయ్యింది.

ఒళ్ళు పులకించింది. ఈ దేశాన్ని నీ చేతుల్లో పెట్టటానికి రాజీవ్ వెళ్లి పోయి ఉంటారు అనుకున్నాను. నువ్వు చిత్రించిన ముఖ చిత్రం బయటకు తీసి ధూళి తుడిచావు. ఏడు పదులు దాటిన నువ్వు కంప్యూటర్ ముందు కూర్చుని ఈ దేశ భవిష్య ప్రణాళికలు తయారు చేస్తుంటే తెలుగు వాడిగా గాలిలో తేలాను. ఇవ్వటం నేర్చుకున్న గొప్ప వాళ్ళు కొందరైనా ఉన్న ఆ కాలంలో ఎక్కడో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకు వచ్చి ఆర్థిక మంత్రిని చేసి నడిపించావు. ప్రపంచం నివ్వెర పోయినట్టుగా, ఈ దేశానికి అంతవరకు అసలు సరిపడదు అనుకున్న ఒక కొత్త ఆర్థిక దిశను చూపించావు. తొలి బడ్జెట్ ప్రవేశించిన రోజూ దేశమంతా చప్పట్లు కొట్టింది. ఎవరికీ ఏమి తెలియదు. అయితే ఏదో కొత్తగా జరుగుతోంది, ఇక ముందు ఈ బ్రతుకులు ఇలా ఉండవు అని అందరూ నమ్మారు. అప్పటికే దివాళా తీసి బంగారు నిల్వలు కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి నత్త నడక నడుస్తున్న దేశానికి తొలి బడ్జెట్ ఊపిరి ఇచ్చింది

ఒక వైపు అరకొర బలంతో ప్రధాని అయినందున కుడి ఎడమల మధ్య నలిగిపోతూ ఉన్న నిన్ను చూసి అందరూ నవ్వుకున్నారు. ఆ బలహీనతే బలంగా మారిందని వాళ్లకు తెలియదు. ఐదేళ్ళలో ఆరేడు సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని ఒకసారి కుడి చేయి అందుకున్నావు. ఒకసారి ఎడమ చేయి అందుకున్నావు. ప్రయాణం కొనసాగించావు . అప్పుడప్పుడు రెండు చేతులూ చప్పట్లు కొట్టాయి. మరోవైపు ఇందిరగాంధీ చేయించిన బ్లూ స్టార్ ఆపరేషన్ లో బయటకు వచ్చి పంజాబ్ మొత్తం అంటువ్యాధిలా ప్రాకిన ఖలిస్థాన్ క్రిములను ఊరు ఊరు దిగ్బంధం చేసి ఏరి పారేసావు. మరో వైపు న్యూక్లియర్ పరీక్షలకు అబ్దుల్ కలాం ను పిలిపించి అన్ని సిద్ధం చేసి తరువాత రాబోయే అటల్ చేతులకు అందించావు. ప్రశాంతమైన రాజకీయ ఆర్ధిక సామాజిక వాతావరణం మళ్ళీ నెలకొంది. దివాళా తీసిన దేశం ప్రపంచం ఇటువైపు చూసేలా మారింది.

నువ్వు నడిపిన ఈ ఐదేళ్లు కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. అస్సాం అందంగా ఉంది. పంజాబ్ మోకరిల్లింది. ప్రతి ఆదివారం వాక్సినేషన్ ఉండేది. సూరత్ లో వచ్చిన ప్లేగ్ వ్యాధి దేశమంతా ఆరోగ్యంగా ఉంది. ఉద్యమాలు లేవు. వేర్పాటు వాదం లేదు. రాజకీయ దళారులకు, ఆర్ధిక చీకటి బజార్లకు అస్సలు పని లేదు. కొత్త గాలి దేశమంతా ఆవరించింది. కొత్త చిగుర్లు చెట్లకు మాత్రమే కాకుండా జీవితాల్లో కనిపించాయి.

తెలుగు వాళ్ళు గర్వించదగ్గ వేయిపడగలు దేశం గుర్తించాలని సహస్రఫన్ గా హిందీలో చూపించావు. విశ్వనాథ సత్యనారాయణ గారి ఖ్యాతి మరింత పెంచావు. ఇప్పటికి ఉత్తరభారత్ నిన్ను ప్రధానమంత్రిగా కంటే కూడా ఈ కోణంలో ఎక్కువగా ఆరాధిస్తుంది.

ఐదేళ్లు నడవలేవని భావించిన వాళ్ళు నీ పరుగు చూసి, రాజకీయ దుమారం లేపి నీ పై బురద చల్లేందుకు దేశం నలుమూలలా వేదికలు ఏర్పాటు చేసి తరువాత ఎన్నికల్లో అయితే గెలిచారు కానీ నీ పెదవి నుండి ఒక్క అక్షరం పలికించ లేకపోయారు. విచిత్రం ఏంటంటే నువ్వు పిరికి వానిలా పారిపోలేదు. వాళ్ళందరి అంతిమ ప్రయాణము చూసాక మాత్రమే నువ్వు ప్రశాంతంగా స్వర్గారోహణ చేసావు. సత్యమేవ జయతే అన్న మాటలు వాళ్ళు చూసి ఉంటారు. చదివి ఉంటారు. నువ్వు మాత్రం అర్థం చేసుకున్నావు.

ఇప్పుడు మనిషికో కంప్యూటర్ ఉంది చేతికో మొబైల్ ఉంది. ఇంటింటికి ఉద్యోగం ఉంది. ప్రపంచాన్ని నడిపించే మానవ వనరులు మన సొంతం. పేరు పొందిన గొప్ప టెక్నాలజీ సంస్థల్లో నిర్ణయాధికారం మనదే. అణువును విభజించిన మనిషిని అణువు విడదీస్తుంది అనుకునే రోజుల్లో, తీరాన మెరుస్తున్న ఇసుక రేణువు ఈ ప్రపంచపు జీవన వేణువయ్యిందని అనుకునేలా ఈ ప్రపంచం ఇప్పుడు మారింది. వేల మైళ్ళ రహదారులున్నాయి. ఆకాశం నిండా విమానాలున్నాయి. ఉదయం అల్పాహారం ఢిల్లీలో చేసి, మధ్యాన్నం భోజనం కు కేరళ వెళ్లి అన్ని పనులు ముగించుకుని రాత్రి బస హైదరాబాద్ లో చేసుకునే వీలు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం గుప్పెట్లో ఉంది. ఇవన్నీ మూడు దశాబ్దాల కిందట నువ్వు రంగులద్దిన ముఖ చిత్రం లోని హావ భావాలు. నువ్వు కల గన్న భారత దేశ కొత్త రూపు రేఖలు. ఇప్పుడు తినడానికి తిండి ఉంది. కట్టేందుకు బట్ట ఉంది. ఉండేందుకు ఇల్లు కూడా ఉంది. నువ్వు లేవన్న ఆ ఒక్క చేదు నిజం తప్ప అన్ని ఉన్నాయి. అన్నిట్లో నీ ప్రతిబింబం ఉంది. అందుకే కోటి రత్నాల వీణ అని అందరూ అంటుంటే ..."భారత రత్న" అని నాకు వినిపిస్తుంది.

కొట్నాన సింహాచలం నాయుడు
28.06.2020

Source - whatsapp sandesam

పొద్దున్నే లేస్తే విజయం మనదే.

పొద్దున్నే లేస్తే విజయం మనదే.
----------------------------------------

విజేత అంటే?
అందరి కంటే ముందుగా లక్షాన్ని చేరుకున్న వాడు.
అందరి కంటే ముందుగా చేరుకున్నాడు అంటే?.. అందరి కంటే ముందుగా సాధన ప్రారంభించి ఉంటాడు.
అందరి కంటే ముందుగానే ప్రారంభించడంటే? అందరి కంటే ముందే లక్ష్యం గురించి ఆలోచించి ఉంటాడు.
అందరి కంటే ముందే ఆలోచించాలంటే, అందరికంటే ముందే నిద్రలేవాలి.

పొద్దున్నే నిద్ర లేవడం అనేది పెద్ద బ్రహ్మ విద్యేమ్ కాదు. మనల్ని మనం కష్ట పెట్టుకోవడం అంతకన్నా కాదు. దేనికైనా ప్రారంభం,ముగింపు అనేవి ఉంటాయి. ఏ ఏడింటికో , ఎనిమిదింటికో రోజు మొదలు కాదు. మన పెద్దలు బ్రహ్మీ ముహూర్తమని చెప్పిన సమయం నుంచే...అంటే తెల్లవారు ఝామునే ఆ రోజు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడు మేల్కొన్న 'లెట్ అటెండెన్స్' కిందే లెక్క. ఆలస్యంగా వచ్చిన విద్యార్థికి పాఠం కూడా అలస్యంగానే అర్థం అవుతుంది. ఈలోగా విజేతలు అని పిలవబడేవారు రాకెట్ లా మనకు అందరానంత దూరం దూసుకు వెళ్లి వుంటారు. కాబట్టి మనం కూడా ముందుగానే మేల్కోవాలి.

సమాజంలో 5 శాతం మందే.... విజేతలు, నాయకులూ. మిగిలిన 95 శాతం అనుచరులు పరాజితులే.ఆ 5 శాతం మందిని పరిశీలిస్తే ...వాళ్ళ దినచర్య తెల్లవారు ఝామునే మొదలవుతుంది. అంతా నిద్ర పోతున్న వేళలో వాళ్ళు మేల్కొంటారు.అంతా కలలు కంటున్న సమయం లో వాళ్ళు కలల్ని నిజం చేసుకోవడం గురించి ఆలోచిస్తారు. అంతా పరుగు ప్రారంభించే సమయానికే వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. కాబట్టి ఓ గంట ముందు లేస్తే పోయేదేంలేదు...బద్దకం తప్ప!
ప్రమోషన్లు వచ్చేవరకో, సొంతిల్లు కొనేవరకో, కోటి రూపాయలు సంపాదించే వరకో ....మీ ఆనందాన్ని వాయిదా వేసుకోకండి. గమ్యం వైపుగా సాగించే ప్రయాణంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి, ఆనందించండి.

ఎవరో పిలిచి కిరీటం పెట్టినప్పుడు మాత్రమే... మన శక్తి సమర్థ్యాలన్ని ప్రదర్శించాలనే పిచ్చి నిర్ణయానికి కట్టుబడి పోయి ... మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం వాయిదా వేయకండి. ప్రపంచం గుర్తించిన తరువాత మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు , మిమ్మల్ని మీరు నిరూపించుకున్నాకే ప్రపంచం గుర్తిస్తుంది. వికాసానికి ఓ ముగింపు అంటూ లేదు . ఓ శిఖరం చేరుకోగానే పర్వతారోహణ పూర్తయిపోదు. అంతకంటే ఎత్తయిన మరో పర్వతం మీకోసం సిద్ధంగా ఉంటుంది. నన్ను అధిరోహించమంటూ సవాలు విసురుతుంది. జిజ్ఞాసి ఎప్పుడు నిత్య విద్యార్థి.....నిరంతర యాత్రికుడు.

పేదరికానికి కారణం....చుట్టూ వున్న పరిస్థితులు కాదు, మనసుని చుట్టుముట్టిన భావదారిద్ర్యం. కాబట్టి ఎంత తొందరగా మేల్కొంటే.. అంత మంచిది.
💐💐💐💐💐💐💐💐
Source - whatsapp sandesam

Sunday, June 28, 2020

ఆత్మవిశ్వాస సూత్రం

◆ఆత్మవిశ్వాస సూత్రం◆
🥳😎😘🥰🤓☺️🤩
◆••మొదటిది : జీవితంలో ప్రధాన లక్ష్యంగా నేను దేన్నయితే ఎంచుకున్నానో

దాన్ని సాధించి తీరుతానని నాకు తెలుసు. అందుకే నేను పట్టుదలతో
వ్యవహరిస్తాను. నిరంతరాయంగా శ్రమిస్తాను. అలాంటి

కార్యాచరణకు నన్ను నేను పునరంకితం చేసుకుంటాను.

◆◆••రెండోది : నా మనసులో ఎలాంటి ఆలోచనలు నిండి ఉన్నాయో వాటికి

అనుగుణమైన భౌతిక చర్యలు, ప్రతిఫలమే నాకు ఎదురవుతుందని
తెలుసు. అందుకే నేను ఎలాంటి వ్యక్తిగా రూపాంతరం చెందాలను
కుంటున్నానన్న దానిపై ప్రతిరోజూ ముప్పై నిమిషాల పాటు నా
దృష్టిని కేంద్రీకరిస్తాను. దానికి సంబంధించి నా మనసులో ఒక
స్పష్టమైన చిత్తరువును చిత్రించుకుంటాను.

◆• మూడోది, స్వీయోపదేశ సూత్రం ద్వారా నాలోని ప్రగాధ వాంఛ నా మనసునంగా

ఆక్రమించి, దాన్ని సాధించే తరుణానికి క్రమంగా ఒకానొక వాస్తవిక
మాధ్యమాన్ని కోరుకుంటుందని నాకు తెలుసు. అందుకే రోజూ
పదినిమిషాల పాటు నానుంచి నేను ఆత్మవిశ్వాసాన్ని వాంఛిస్తూ
గడుపుతాను.

●•• నాలుగోది : జీవితంలో నా ప్రధాన లక్ష్యానికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్వచనాన్ని నేను రాసి పెట్టుకుంటాను. దాన్ని సాధించే దిశగా నా ప్రయత్నాల్ని ఎన్నటికీ ఆపను. దాన్ని సాధించే వరకు అందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూనే ఉంటాను.

●•• ఐదోది - సత్యం, న్యాయం అనే పునాదుల మీద నిర్మించని ఏ సంపద కానీ,పదవులు కానీ అట్టే కాలం నిలవవు అనే నిజం నాకు తెలుసు.
అందుకే సమాజానికి లాభం చేకూర్చని వ్యవహారాల పట్ల నేను ఆసక్త చూపను. నా పనిలో నాకు సహకరించే వాళ్ళని నేను ఆకర్షిస్తూనే ఉంటాను. ఇతరులు నాకోసం పనిచేసేలా వాళ్ళని ప్రభావితంచేస్తాను. ఎందుకంటే నేను ఇతరుల కోసం పనిచేయాలన్నదే నాఆశయం. ద్వేషం, అసూయ, క్రోధం, స్వార్థం, సంకుచితత్వాల్ని
నా మనసు నుంచి పూర్తిగా తుడిచి పెట్టేస్తాను. అందరి పట్ల ప్రేమనునాలో పెంచుకుంటాను.
ఇతరుల పట్ల ప్రతికూల వైఖరి నావిజయసాధనలో ఒక అడ్డంకిగా మారుతుందని నాకు తెలుసు.
ఇతరులు నన్ను నమ్మేలా నడుచుకుంటాను. ఎందుకంటే ఇతరుల
పట్ల, నా పట్ల నాకు విశ్వాసం ఉంది. ఈ సూత్రం కింద నేను
సంతకం చేస్తాను. దాన్ని జప్తిలో ఉంచుకుంటాను. రోజుకు ఒకసారైనా
బిగ్గరగా దాన్ని చదువుతాను. దాన్ని పూర్తిగా నమ్ముతాను. అది
క్రమంగా నా ఆలోచనల్ని, నా పనితీరును ప్రభావితం చేసి నన్ను
స్వావలంబన దిశగా నడిపిస్తుంది. అది నన్నొక విజేతగా
నిలబెడుతుంది.●●●

◆◆•• ఈ సూత్రం వెనుక ఒక ప్రకృతి ధర్మం దాగి ఉంది. దాన్ని ఇంతవరకు
ఎవ్వరూ కచ్చితంగా వివరించలేదు. ఎవ్వరూ దానికి నామకరణం చేయలేదు.
అంతమాత్రం చేత దాని ప్రాధాన్యం తరిగిపోదు. ముఖ్యమైన నిజమేమిటంటే
-అది మానవాళి సౌభాగ్యాన్ని విజయాన్ని కాంక్షించి పనిచేస్తుంది. దాన్ని
నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే అది చేసే మేలు అనంతం. కానీ దాన్ని
విధ్వంసకర ప్రయోజనాలకు వాడుకుంటే, అది సుపించే విలయం కూడా అంతే తీవ్రస్థాయిలో ఉంటుంది. °°ఈ వివరణలో ఒక ముఖ్యమైన సత్యం దాగి ఉంది.
ఓటమి దిశగా నడిచి, పేదరికం, బాధలు, నిరాశలో మునిగిపోయే వాళ్ళంతా
స్వీయోపదేశానికి సంబంధించిన సూత్రాన్ని ప్రతికూలంగా వాడుకున్నందు వల్లే
చిక్కుల్లో పడుతుంటారు. ఆలోచనలకు ఒక లక్షణముంది. అవి భౌతికరూపం
తీసుకోవడంలో తమ స్వీయలక్షణాన్ని ప్రతిబింబిస్తాయి. పేదరికానికి, బాధలకి,
నిరాశకి అదే కారణం.
🌿🦥🌿🦥🌿🦥🌿
మీ....పి.సారిక

Source - whatsapp sandesam

ధైర్యం - చిన్న కథ

ధైర్యం

ఒక మహారాజు ప్రతిరోజు ఆ ఉదయించే సూర్యుడిని చూడడంతో తన దినచర్యను మొదలుపెట్టేవాడు
ప్రతిరోజు లాగే ఆ రోజు కిటికీని తెరవగానే సూర్యుడికి బదులు ఒక బిక్షగాడిని చూసాడు
ఇలా జరిగిందేంటా అని ఆవేశంతో అడుగులు వేసి తడబడి గోడను గుద్దుకుని తలకు గాయం అయ్యింది
ఇదంతా ఆ బిక్షగాడిని చూడడంవల్లే జరిగిందని కోపంతో రగిలిపోతూ ఆ బిక్షగాడిని సభలోకి లాక్కుని రావలసినదిగా సైనికులకు ఆజ్ఞను జారీచేశారు

సభలో అందరూ హాజరు కాగా జరిగినది చెప్పి రాజు ఆ బిక్షగాడిని ఉరివేయాల్సినదిగా ఆదేశించాడు
సభలోని వారంతా నిశ్శబ్దంగా ఉండగా ఈ భిక్షగాడు మాత్రం బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు
అక్కడ ఎవరికీ ఏమి అర్థం కాలేదు
రాజు ఆ నవ్వుకు కారణం అడగగా

రాజా మీరు నన్ను చూడడం వల్ల తలకు చిన్న గాయం మాత్రమే అయ్యింది కానీ ఉదయాన్నే నేను మీ ముఖాన్ని చూసినందుకు నా తల తెగిపడిపోతున్నది అని

తప్పు తెలుసుకున్న రాజు తలవంచుకుని ఆ శిక్షను రద్దు చేసాడు
ఎప్పుడైనా ఎక్కడైనా సరే ధైర్యంగా మాట్లాడడం చాలా అవసరం
ఆ ధైర్యం లేకపోతే మన ప్రాణాలను మనం పోగొట్టుకోవలసి వస్తుంది ఒక్కోసారి
👏👏👏

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ .....

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత .
కానీ .....

‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .

మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .

వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .

ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .

ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .

అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .

ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .

అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు.

ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .

కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .

ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .

నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .

అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .

ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .

ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.

Source - whatsapp sandesam

ఖరీదైన కోడలు

ఖరీదైన కోడలు

రావయ్యా ..........బిక్షపతి...!
ఏంటి ఇంత ఆలస్యం? నువ్వు పెళ్లి చూపులకే ఇంత ఆలస్యం చేస్తే ఇంక మా అబ్బాయి పెళ్లి ఎప్పుడు చేస్తావు...?అన్నాడు నారాయణ పెళ్లిళ్ల పేరయ్య ని.
నా స్కూటర్ ప్రాబ్లెమ్ అండిీ.....సరే గాని ఐదుగురు వెళితే బాగుంటుంది అని చెప్పాను కదా..... మీరు,మీ శ్రీమతి, మీ అబ్బాయి, నేను మరి మీ స్నేహితుడు శ్రీనివాస్ ఎక్కడ రాలేదే? అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య బిక్షపతి.
మా వాడికి ఆరోగ్యం బాలేదని వాడి కొడుకుతో పాటు ఆస్పత్రి చుట్టూ టెస్టులంటూ తిరుగుతున్నాడు. అందులోను ఆడ దిక్కులేని సంసారం. వాడికి పెళ్లీడుకొచ్చిన కొడుకున్నాడు వాడికోసం కూడా తిరుగుతున్నాడు.
మళ్ళి మా కోసం కూడా వాడిని ఇబ్బంది పెట్టడం దేనికని నేనే అడగలేదు. నలుగురైతే ఏమైందిలే పద పద అంటూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు నారాయణ కుటుంబం.
అమ్మాయి చూడచక్కగా, కళగా బాగుంది. ఏవండీ అమ్మాయి బాగుందండి అన్నది నారాయణ భార్య. నువ్వు ఉండు పూర్తిగా తెలుసుకోకుండా నచ్చిందని ఎగరకు అన్నాడు నారాయణ గోణుగుతూ. బిక్షపతి అమ్మాయి పేరు శిరీష అంటూ ...ఇరు కుటుంబాలకి ఒకరి గురించి ఒకరిని పరిచయం చేసాడు. ఇచ్చిన కాఫీ తాగి ఏ విషయం ఫోన్ చేస్తాం అని చెప్పి బయటకి వచ్చేసారు నారాయణ కుటుంబం. మార్గ మధ్యలో నారాయణ బిక్షపతి తో ఇలా అన్నాడు అమ్మాయి వాళ్ళకి ఓ రెండు రోజులాగి ఈ సంబంధం వొద్దు అని చెప్పండి అన్నాడు. అదేంటండి అమ్మాయు బాగుంది,మరీ అందగతే కాకపోయినా , కళ గా , చక్కగా లక్షణంగా ఉంది ఇంకేంటండి అన్నాడు. అప్పుడు నారాయణ్ చాల్లే ఆపవయ్యా ఎదో మంచి సంబంధం, ఒక్కతే కూతురు అంటే బాగా స్టేటస్ ఉన్నవాళ్లు అయిఉంటారనుకున్న. ఇలా ఆర్ టి సి లో ఉద్యోగం చేసి రిటైర్ ఐన మిడిల్ క్లాస్ అని తెలిసిఉంటే అసలు వచ్చేవాడిని కాదు.పెద్ద కట్నకానుకలు ఇచ్చే కుటుంబం కూడా కాదు ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లో పిల్లని చేసుకుంటే రేపు ఏ మంచి చెడు చేయాలన్నా మాకు స్తోమత లేదు అంటూ తప్పించుకుంటారు.
అమ్మాయు బాగా చదువుకుంది అంటే ఏదైనా పెద్ద కంపెనీ లో ఉద్యోగమా అంటే అది లేదు. ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చొని తినడానికి ఎంత చదివితే ఎందుకండీ. అంటే మాకేదో కోడలు సంపాదిస్తే గాని ఇల్లు గడవదని కాదు ...! కానీ మా చుట్టాల్లో కోడళ్ళు అందరు పెద్ద పెద్ద కంపెనీల్లో, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ మంచి స్టేటస్ లో ఉన్నారు.
మా కోడలు కూడా ఆలా చేస్తే నే కదా మా చుట్టాల్లో మా స్టేటస్ నిలబడేది అని పెళ్లిళ్ల పేరయ్య మీద అరిచాడు నారాయణ.
ఇక చేసేది లేక బిక్షపతి అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి అబ్బాయి వాళ్ళు అంతగా ఇంట్రస్ట్ చూపించట్లేదండి. ఇంకో సంబంధం ఉంది రేపు నేనొచ్చి మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
నిట్టురుస్తూ ఫోన్ పెట్టేసాడు శీరీష తండ్రి. ఏవండీ ఈ సంబంధం కూడా పోయినట్టేనా...! ఏంటండి మన అమ్మాయి ఎంత లక్షణంగా ఉన్నా, మన కుటుంబానికి ఎంత పేరున్న, ఈ రోజుల్లో పెళ్లి కావడం కష్టమైపోయింది అంటూ దిగులుగా కూర్చుంది శిరీష తల్లి. అప్పుడు శిరీష దగ్గరికొచ్చి అమ్మ...... ఏదైనా లోపాలు ఉన్న వాళ్ళు బాధపడాలి,భయపడాలి మనం ఎందుకు భయపడాలి.
మనకు అంతా మంచే జరుగుతుంది నిశ్చింతగా ఉండు. నీకు నడుం నొప్పికి ఒక పొడి చేసి ఇచ్చా అది తినమని చెప్పాను తిన్నావా? అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తుంది శిరీష.
సరే నాన్న మీరు కూడా ఈ కాషాయం తాగండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా నా బాగోగులు చూడగలరు అంటూ మాట్లాడుతుండగా శిరీష మావయ్య రఘు వచ్చాడు.
రా...... మావయ్య ఏంటి సడెన్గా ఇలా వచ్చారు అంటూ పలకరిస్తూ నీళ్లు తేవడానికి లోపలి వెళ్ళింది శిరీష. వచ్చిరాగానే బావ మన శిరీషకి ఒక మంచి సంబంధం తెచ్చాను, దాని గురించే మాట్లాడమని వచ్చా అని అబ్బాయి వివరాలు చెప్పుకొచ్చాడు. అబ్బాయి మన పక్క ఊరిలో ఉన్న కాలేజీలో లెక్చరర్, ఒక్కడే కొడుకు, పాపం తల్లి కూడా కిందటేడాది చనిపొయినింది. ఇపుడు అబ్బాయి తండ్రికి కూడా వొంట్లో బాగోట్లేదు అందుకే కొడుక్కి తొందరగా పెళ్లి చేయాలి అనుకుటనున్నాడు అని చెప్పుకొచ్చాడు. కానీ ఒక్కటే సమస్య మీరు అది పట్టించుకోకపోతే ఇబ్బంది ఏమి లేదు అన్నాడు. అదేంటి అంటే అబ్బాయి వాళ్ళు మన కులం కాదు. కానీ వాళ్ళకి కులం పట్టింపులేదు, అబ్బాయి తండ్రి చాల గొప్పవాడు అని చెప్పుకొచ్చాడు. కొంచెం ఆలోచించి,నాకు మాత్రం మొదటి నుండి ఈ పట్టింపు ఉందా ఏంటి, వాళ్ళకి లేకపోతే మరీ మంచిది, మరి అమ్మాయి వివరాలు వాళ్ళకి చెప్పావా అని అడిగాడు శిరీష తండ్రి. నేను వివరాలన్నీకనుకున్న, మన శిరీష ఫోటో ఫోన్ లో ఉంది గా చూపింఛా. కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు అన్నట్టు అబ్బాయి వాళ్ళు రావడం, శిరీష నచ్చడం, పెళ్లి కుదరడం అన్ని వారంలో అయిపోయాయి. పెళ్లిలో తెలిసింది శిరీషని చూసి వెళ్లిన నారాయణ స్నేహితుడు శ్రీనివాస్ యే శిరీషని కోడలిగా చేసుకుంటున్నాడు అని. భగవంతుడి దయవల్ల శిరీషకి శ్రీనివాస్ కొడుకు గోపాల్ కి పెళ్లయిపోయింది, శిరీష కొత్త కోడలిగా మెట్టినింట అడుగుపెట్టింది.
బంధువులందరితో కలివిడిగా మాట్లాడుతూ ఇంట్లో గలగలా తిరుగుతూ పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉంది శీరీష. తన ఆరోగ్యం గురించి అప్పుడే కొత్తకోడలికి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక కొడుకుతో శిరీషకి ఏమి చెప్పొద్దన్నాడు శ్రీనివాస్ . కొన్ని నెలలు గడిచాయి శ్రీనివాస్ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది.
అందరూ శ్రీనివాస్ ని ఏదో చివరి చూపు చూడటానికి వచ్చినట్టు చూడటం, పలకరించడం మొదలుపెట్టారు
కొత్త కోడలు శిరీష్ కి ఇది ఏమాత్రం నచ్చలేదు, మనిషి చనిపోయేట్టు అందరూ ఇలా మాట్లాడటం భరించలేకపోయింది. భర్తని గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పాడు గోపాల్. నాన్నలివర్ కి కాన్సర్. మొదటి దశ లోనే ఉంది. కానీ అమ్మ కూడా ఇలాగే కాన్సర్ వల్ల చనిపోవడంతో దిగులు పడుతూ ఉన్నాడు అని చెప్పాడు
మావగారికి మొదట మానసికంగా దైర్యం కలిగించడం ముఖ్యం అని శిరీషకి అర్ధం ఐంది.
తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యుణ్ని సంప్రదించింది.ఆయన సలహాలు సూచనల మేరకు సొంతగా మామగారికి ఆయుర్వేద చికిత్స చేయడం ప్రారంభించింది.ఏమాత్రం చిరకుపడకుండా ఒక చంటిపిల్లాడు కి చేసినట్టు మామగారికి సేవలు చేసింది. పళ్లరసాలు,మందులు టైంకి ఇస్తూ, మంచి ఆహరం ఇస్తూ మామగారిని కంటికి రెప్పలా కాపాడుకొచ్చింది. చదువుకున్న అమ్మాయి కావడం తో హాస్పటల్ కి తీసుకెళ్లడం, టెస్టులు చేయుంచడం అన్ని తానే దగ్గరుండి చూసుకుంది.
మూడు నెలల్లో శ్రీనివాస్ నెమ్మదిగా కోలుకోవటం ప్రారంభించాడు
డాక్టర్ రిపోర్ట్స్ కూడా చూసి షాక్ అయ్యారు క్యాన్సర్ నయం అవుతుందని ఆయన మానసికంగా చాలా దృఢంగా ఉన్నారని చెప్పారు
చూస్తూ చూస్తూ ఉండగానే సంవత్సరంలో శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడింది
ఇదే సందర్భంలో శిరీష గర్భవతి కావడంతో శ్రీమంతం ఏర్పాట్లు చేశారు. సీమంతానికి శ్రీనివాస స్నేహితుడు నారాయణ కూడా వచ్చాడు
నీకే ఆరోగ్యం సరిగా లేదు, ఈ హంగులు ఆర్భాటాలు అవసరమా అన్నాడు నారాయణ. ఎవరు చెప్పారు నేను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను.
నువ్వు మిడిల్ క్లాసు అంటూ ఎగతాళి చేసిన ఆ కుటుంబం నుండి వచ్చిన అమ్మయెరా నన్ను ఈరోజు బ్రతికించింది అన్నాడు శ్రీనివాస్. కోడలు అంటే సంపాదించేది, డబ్బు తెచ్చేది, పెద్ద కుటుంబం నుంచి వచ్చేది కాదురా.
చూడాల్సింది అమ్మాయి గుణగణాలు, ఆ కుటుంబం నేర్పిన సంస్కారం. నా బంగారు తల్లి నా కూతురిలా సేవలు చేసింది అంటూ శిరీష గొప్పతనాన్ని నలుగురిలో గర్వంగా చెప్పుకుంటున్నాడు శ్రీనివాస్.
దీంతో నారాయణ సిగ్గుతో తలదించుకున్నాడు. ఇంతకీ మీరు ఒక్కరే వచ్చారేంటండి మీ భార్య , కొడుకు కోడలు ఏరి నారాయణ గారు అని అక్కడున్న వాళ్ళు అడిగారు.
మా కోడలికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం మా వాడిని కూడా ఆస్ట్రేలియా తీసుకెళ్లింది. మా ఆవిడకి షుగర్, మోకాళ్ళ నొప్పులు.
ఒక చోటనుండి ఇంకోచోటికి కడలేకపోతుంది. ఇంట్లో పని మనిషికి ఇల్లు, ఇంటిపని అప్పజెప్పి నేనొచ్చాను అని చెప్పుకొచ్చాడు నారాయణ.
గమనిక :
ఫ్రెండ్స్ ఇది కధ కాదు. నిజంగా జరిగింది. ఈ రోజుల్లో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారు అని చెప్పడానికే పేర్లు మార్చి స్టోరీ గా రాసి మీతో పంచుకుంటున్నాం . దయచేసి ఎటువంటి కాంట్రవర్శిలు చేయకండి. ఎవరిని కించపరచడానికి ఇది మీతో పంచుకోవట్లేదు. చేడు విషయాల మీద గంటలు గంటలు చర్చలు జరపటం కన్నా ఒక మంచి విషయాన్నీ పది మందితో పంచుకోవడం ఉత్తమమం అనిపించింది. కాబట్టి అందరు శాంతంగా స్పందించండి. తప్పులు ఉంటె మన్నిచండి.

Copy paste

Source - whatsapp message

యముడు మానవుడిగా ఎందుకు జన్మించవలిసివచ్చింది?

యముడు మానవుడిగా ఎందుకు జన్మించవలిసివచ్చింది?

పూర్వం మాండవ్యుడు అనే మహాముని ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా ఆయన మౌనవ్రతం దీక్షలో ఉన్నాడు.

మునీశ్వరుడు ఆశ్రమానికి సమీపంలో ఒక రాజ్యం ఉంది.
అనుకోకుండా ఒకరోజు, రాజమందిరంలో దొంగలు పడ్డారు. వారు బంగారు నగలు విలువైన వస్తువులు దొంగలించుకుని పారిపోవడము కాపలవారైన
తలారులు వీరిని చూశారు.

రాజభటులు తో కలిసి వారిని వెంబడించారు, ఆ దొంగలు నగల మూటను తీసుకొని మునిగారి ఆశ్రమంలోకి ప్రవేశించారు. దొంగలు ధైర్యం ఏంటంటే మునీశ్వరుల ఆశ్రమంలోకి రాజభటులు రారు అని వారి నమ్మకం.
దురదృష్టం కొద్దీ దొంగలను తరుముకుంటూ వచ్చిన రాజభటులు దొంగల గురించి ఈ మునీశ్వరుని అడిగారు.

మాండవ్యుడు మౌన దీక్షలో ఉండడంచేత వీరు అడిగిన వాటికి సమాధానం ఇవ్వలేదు. అయితే రాజభటులు ఆశ్రమం అంత గాలించారు అక్కడ దొంగలు దొరికారు. వారితోపాటు నగల మూట కూడా లభించింది. రాజభటులు దొంగల ని నగలని పోతూ పోతూ మాండవ్యుని కూడా రాజుగారి వద్దకు తీసుకెళ్లారు రాజ్యసభలో జరిగిందంతా చెప్పారు.

వెంటనే రాజుగారు ఆ దొంగలకు మరణదండణ
విందించాడు. రాజభటులు చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ దొంగలను ఈ మునీశ్వరుడు ప్రోత్సహించి ఉంటాడేమో అని ఇతడిని కొర్రు వేయమని ఆదేశించాడు. కొర్రు అంటే ఒక ఒక పదునైన సండ్ర కొయ్యను భూమిలోకి పాతివుంచి
నేరస్తుడిని ఆ కొయ్య పైన వదిలేస్తారు ఆ కొయ్య అతడి శరీరంలోకి మలద్వారం ద్వారా శరీరంలోకి గుచ్చుకోని మెల్లగ కడపు లో నుండి కపాలం వరకు పైకి వెళుతుంది. అలా కొర్రు శిక్ష వేసిన వాడు ఒకటి రెండు రోజుల్లో చనిపోతాడు.

అయితే రాజుగారు కొర్రు శిక్ష వేస్తుంటే తనకే పాపం తెలియదని ఏ మాత్రం చెప్పలేదు. అలా శిక్ష వేయబడ్డ మాండవ్యుడు నొప్పి బాధను భరిస్తూ అతను మౌన దీక్షను కొనసాగిస్తున్నారు.

రాత్రి కాపలా కాస్తున్న తలారులు కొందరు శిక్ష వేయబడ్డ ఇతని ని గమనించారు ఆ సమయంలో కొందరు మునీశ్వరులు తపో సంపనులు పక్షుల రూపంలో వచ్చి ఇతని తో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా మరి రాజుగారు ఇంత పెద్ద శిక్ష వేశారు. ఇందులో నీ తప్పు ఏమి లేదని ఏందుకు చేప్పలేదు అని వారిని అడిగారు. వెంటనే మాండవ్యుడు ఇందులో రాజు గారికి తప్పు గాని రాజభటులు దోషం గాని దొంగల పొరపాటు గానీ ఏ మాత్రం లేదు. ఇది నా
పూర్వజన్మ కర్మ ఫలితం సమాధానమిచ్చాడు.

ఈ మహానుభావుడి లో ఎంత నిగ్రహశక్తి ఉంది అని వారు ఆశ్చర్యపోయారు. వీరి వద్ద నుండి సెలవు తీసుకొన్ని ఆ తప్పు సంపన్నులు వెళ్లిపోయిన తర్వాత, తళారులు అతన్ని గమనించారు ఉరిశిక్ష వేసి అప్పటికె రెండోరోజు గడుస్తుంది. సహజంగా సాదరణ మానవుడు అయితే ఇప్పటికే చనిపోవాలి. ఇతని ని చూస్తే కన్నుల్లో తేజస్సు ఏమాత్రం తగ్గలేదు.

ఈయన ఎవరు గొప్ప మహాముని అయి ఉంటాడు. ఏక్కడో ఏదో తెలియని పెద్ద పొరపాటు జరిగింది అని వెంటనే వెళ్లి రాజు గారికి సమాచారం ఇచ్చారు. రాజుగారు పొరపాటును మన్నించమని పరుగు పరుగున వచ్చి వేడుకొన్నాడు అప్పటికే కొర్రు వేయబడ్డ కొయ్య అతనికి మలమూత్రం ద్వారా శరీరంలోకి దిగిపోయింది.

వెంటనే రాజుగారు ఆ కొయ్యను కోయించారు. అయితే కొంత భాగం లోనే ఉండిపోయింది తన తప్పును మన్నించమని రాజుగారు వేడుకొన్నారు.
రాజు గారిని ఏమాత్రం ఒక మాట కూడా అనకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు మాండవ్యుడు.

మరికొంత కాలానికి మాండవ్యుడు దేశ సంచారం చేస్తూ అలాగే లోకాలన్నీ విహరిస్తూ యముని వద్దకు వెళ్ళాడు. యమధర్మరాజు తో జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేయవలసి వచ్చింది.
నేను చేసిన నేరం ఏమిటి అని అడగడం జరిగింది వెంటనే యమధర్మరాజు చిత్రగుప్తుడు
పిలిపించి ఇతని దోషం గురించి తెలియజేయండి అని చెప్పాడు.

విషయం ఏంటంటే మాండవ్యుడు చిన్నతనంలో అంటే ఐదు సంవత్సరాల వయస్సు లో ఉన్నప్పుడు తూనీగలు పట్టుకొని వాటి
తోకాలకు ఈతముల్లు ను గుచ్చేవాడు. ఆ కర్మ లో భాగంగానే ఇప్పుడు ఇతనికి ఈ శిక్ష వేయవలసి వచ్చింది అని చెప్పాడు.

మండ వీడికి బాధ కలిగింది యమధర్మరాజా 0-14 సంవత్సరాల లోపు వయస్సు ను బాల్యదశ గా పరిగణిస్తారు. ఆ వయసులో వారికి ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు.
నేను 5 సంవత్సరాల వయస్సు
అలా చేసాను, అది తప్పు అని నాకు అప్పటి కి తెలియదు.
తేలియక చేసిన తేలిసి చేసిన తప్పు తప్పుే ఓప్పుకుంటున్నాను. అలా చేయడం చాలా బాధాకరమే,
వాస్తవంగా ఆ తప్పు నాది కాదు, ఏందుకంటే నా తల్లతండ్రి నన్ను గమనించి దండించాలి అది వారి చేసిన పొరపాటు, ఇందులో నాది కూడా భాద్యత వుంది కాబట్టి శిక్షంచాలి. కాకపోతే చిన్న వయస్సు లో చేసిన తప్పు కావున చిన్న శిక్ష వేయలి, అంతేకాని ఇంత పెద్ద శిక్ష నాకు
వేయవడం మీకు దర్మం గా వుందా!...........

మానవతా దృక్పథంతో ఏ చిన్నపాటి శిక్ష వేసి ఉండొచ్చు కదా అని అనడం జరిగింది. దానికి యమధర్మరాజు ఏ సమాధానం చెప్పలేకపోయాడు.

బాధ కలిగిన మాండవ్యుడు ఓ యమధర్మరాజా మానవులు పడుతున్న బాధలు వాటి ఇతి వృత్తాంతాలు నీకు కూడా తెలియాలి.

ఏందకంటే ఇక్కడ ఉండి శిక్ష మాత్రమే అమలు చేస్తున్నావు నీవు ఇలా చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద శిక్షలు వేసే నీకు
ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోవాలసిన అవసరం వుంది. అంతే కాకుండా నాకు ఇంత పెద్ద శిక్ష వేసినందుకు గాను ఈ కర్మ ఫలితిని నువ్వు కూడా అనుభవించవలసి వుంది.

కాబట్టి భూమిపై ఒక శూత
గర్భమునందు మానవునిగా జన్మించి అన్నీ ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకో అని వెళ్ళిపోయాడు.

ఆ శాపం కారణం చేత యమధర్మరాజు మహాభారతంలోని
వ్యాసభగవానుడు సంకల్పం చేత దాసీ పుత్రుడు గా విదురుని గా జన్మించవలసిన వచ్చింది. స్వతహాగా ధర్మదీక్ష తెలిసినవాడే కావడంచేత మహాభారతంలో విదురుడు
ధర్మమూర్తిగా పేరుపొందాడు.

మహాభారతం మొత్తం ఏ మాట మాట్లాడినా అందులో న్యాయం ధర్మం మరియు సాంప్రదాయం ఆచారాలు కలిసి ఉంటాయి అందుకే ఇతని ధర్మ బుద్ధునికి విధురనీతి అని పేరు కూడా ఉన్నది.

మహాభారతం జరిగిన ప్రతి పరిణామం లోనూ ఇతడు సాక్షీభూతంగా ఉన్నాడు. కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు రాజ పాలకుడు అయిన తర్వాత ధృతరాష్ట్రుడు,
గాంధారి, కుంతిదేవి మరియు సంజయుడు తో కలిసి విదురుడు కూడా అడవులకు వెళ్ళాడు. అక్కడ తప్పోదిక్ష స్వీకరించాడు అలా కొంతకాలం గడిచిన తరువాత అడవులలో
తపోదీక్ష లో వున్న తమ వారు ఏలా వున్నరో అని వారిని చూడడానికి ధర్మరాజు తన పరివారంతో సమీపంలో ఉన్నటువంటి అడవులకు వెళ్లి గాలించాడు.

ధృతరాష్ట్రుడు,గాంధారి కుంతిదేవి తపస్సు చేసుకుంటూ కనిపించారు. వారి పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా ఉంది. బక్క చిక్కిపోయిన వారి శరీరాలను చూసి బోరున విలపించాడు.
మీతో పాటు సంజయుడు విదురమహాశేయుడు
కూడా వచ్చారు కదా వారు ఏరి ఏక్కడ అని అడిగాడు.
విదురుడు కూడా ఈ సమీపంలోని తప్పసు చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది.

అటు చూడగా ఏదురుగా వస్తు వున్న విధురుడు కనిపించాడు. ధర్మరాజు ను చూడగానే విధురుడు గాబ గాబ అడవి లో కి వెళ్లిపోయడు, విధురుడు తన నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తూ వున్నడు అని అర్థం అయింది.
ఆయను అనుసరించి ధర్మరాజు కూడా పరుగులు పెడుతు, ప్రాధేయపడ్డాడు.

విదురుడు శరీరం ఏముకల గూడు లా మారిపోయింది.
నిలబడ్డడానికి కూడా శక్తి లేక ఒక చెట్టు కొమ్మకు అనుకోని నిలబడ్డాడు. ధర్మరాజు అంజలి ఘటించి నిలబడిపోయాడు. మహాశయుడు తన కళ్లతో ధర్మరాజు కళ్ళల్లోకి చూస్తూ తనలో ఉన్నటువంటి ప్రాణవాయువును ధర్మరాజు శరీరంలో ఐక్యం చేశాడు.
ఏందకంటే ధర్మరాజు కూడా యమధర్మరాజు ఆంశా కాబట్టి.

కొంతసేపు అయిన తరువాత ధర్మరాజు విదురుని గమనిస్తే శరీరం నుండి ప్రాణం వేరుయింది అని అర్థమవుతుంది. అదే సమయంలో ధర్మరాజు శరీరంలో కూడా ఏదో ఒక కొత్త శక్తి వచ్చి చేరిందనిపిస్తుంది.

అంతలోనే తేరుకుని దర్మరాజు విదురమహాశేయునికి దహన సంస్కారాలు చేయను ఆరంబించాడు. ఏదో తెలియని ఒక అశరీరవాణి ధర్మరాజును హెచ్చరించింది ధర్మరాజా ఇతను సన్యాసి దీక్షలో ఉన్నాడు నువ్వు ఇతని శరీరాన్ని దహన సంస్కారాలు జరిపించడం అంత మంచిది కాదు అని వారించింది. అలాగే
ఈ మహానుభావుడు స్వియ శరీర దహనం చేసుకోగల శక్తి సంపన్నుడు అని సెలవు ఇవ్వడం జరిగింది. అలా మానవుడిగా జన్మించిన యమధర్మరాజు పాత్ర పూర్తి అయినది.

బాల్యంలో తెలియకుండా తప్పు చేసిన మాండవ్యుడు కి
కోర్రు శిక్ష వేశారు.ఆ శిక్షణ పొరపాటుగా అమలుపరచినందుకు యమధర్మరాజు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. మరి మనం చేసుకుంటున్న పాప కర్మలకు ఏన్ని జన్మలు ఎత్తి వలసి వస్తుందో, ఆ రుణాలు అన్ని ఏలా తీర్చుకోవాలో మనమే ఆలోచించుకుందాం.

ఎందుకంటే మునీశ్వరుల కైనా దేవుళ్ళ కైనా ఎవరికైనా కర్మ ఫలితాలు తప్పవు అని అర్థం అయింది. మరొక చిన్న ఉదాహరణ త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుండి చంపిన పాపానికి గాను ద్వాపరయుగంలో అదే వాలు బోయవాడి గా మారి శ్రీ కృష్ణ భగవానుని పై బాణం సంధించాడు ఆ బాధను కృష్ణభగవానుడు కూడా భరించాల్సి వచ్చింది. దేవదేవుడు అంతటివాడే కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు లేదు. మరి మానవమాత్రులమైన మనం ఎంత?

మరి ఇటు వంటి వాటికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా?

కర్మ ఫలితాన్ని తప్పించుకోలేం కానీ తగ్గించుకునే అవకాశం మాత్రం ఉంటుంది అని మన వేదాంతాలు చెబుతున్నాయి.

అది ఎలాగో అంటే కన్నవారి కి, అకలిన్నా వారికి అన్నం పెట్టటడం, సాటి ప్రాణులన్ని కూడా మనలాంటి వే అని బావించడం.విలైనంత ఏక్కువ గా దైవ నామ స్మరణ, దానం చేయడం వంటి ధర్మ సూక్ష్మాలను ఆచరించడం...

ఇది ఎలా మనల్ని రక్షిస్తుంది అంటే?

ఒక సర్పం కప్పను మింగేయాలి అని వెంట పడుతూ ఉంటే, ప్రాణ భయంతో కప్ప పరిగెడుతూ ఉంది. దాని వెంబడే పాకుతూ పోతున్న పాము ను ఆ సమయంలో పై నుండి గమనించిన గద్ద తన కాలుతో తను కు వెళ్ళిపోయినట్టు.
అక్కడ పరిగెడుతున్న కప్పె మానవుడైన కర్మజీవి వెంట పడుతున్న పామే మనం చేసిన కర్మలు పాపాలు, ఆ పాము ను కాలుతో తను కు పోయిన గ్రద్ద యే ధర్మమూర్తి అయినటువంటి గరుత్మంతుడు.

కాబట్టి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

Source - whatsapp message

అపజయాలే అలిసిపోయిన వేళ

అపజయాలే అలిసిపోయిన వేళ

అమెరికాలోని ఇండియానా అనే ఒక చిన్న పట్టణంలో ఒక నిరుపేద కుటుంబంలో 1890 వ సంవత్సరం లో, వేలకట్టడానికి వీలులేనంత మేలైన వజ్రం మనషి రూపం లో జన్మించినది. ఈయనకు ఒక చెల్లెలు ఒక తమ్ముడు కూడా ఉన్నారు.
దురదృష్టం ఈయనతో కలసి కాపురం చేసింది, అపజయాలను ఒక దాని తర్వాత ఒకటి పరిచయం చేసి తనివితీరా నవ్వుకుంది.
ఈయనకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రి చనిపోయాడు కుటుంబ పోషణ నిమిత్తం తల్లి దగ్గర లో ఉన్న కంపెనీలో కి పనికి వెళ్ళవలసి వచ్చేది.
పని నిమిత్తం ఎక్కువ సమయం కంపెనీలో ఉండడం వల్ల పిల్లలకు సరిగా వండిపెట్టలేకపోయేది.
అందువల్ల వంట చేయడం ఈయనకు నేర్పించింది,
అతి తక్కువ కాలంలోనే చక్కగా వండటం నేర్చుకున్నాడు.
వంట చేసి తమ్ముడికి, చెల్లికి పెట్టడమే కాక తల్లికి క్యారియర్ కూడా తీసుకుని వెళ్లే వాడు.

ఈయనకు 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి, తల్లి రెండవ పెళ్లి చేసుకున్నది.
ఆ వచ్చిన రెండవ భర్తకు ఈ పిల్లలు వారితో ఉండటం ఇష్టం లేదు. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి, చేసేదిలేక
పిల్లలిద్దరినీ తీసుకొని అయన
తన బంధువుల ఇంటికి వెళ్ళవలసి వచ్చింది.

పిల్లల పోషణ భారం అయన పై పడడంతో వేరే దారి లేక వ్యవసాయ కూలి పనికి వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల చదువు ఏడవ తరగతి తో ఆగిపోయింది. అయితే పనికి వెళ్లిన చోట సరిగా పనిచేయలేదని నీకు ఏ పని సరిగా రాదు అని చెప్పి, రేపట్నుంచి పనిలోకి రావద్దని పంపించివేశారు. దీనితో
పనిలో ఉంచుకోవడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు.
ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి
నీకు పని చేయడం చేతకాదు కాబట్టి నువ్వు పనిలోకి రాకు అనేవాళ్లే ఎక్కువైపోయారు.

దీనితో ఒక చోట ఏక్కడ
స్థిరంగా ఉండలేక తిరుగుతూ 17 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పెయింటర్ గా, బస్సు కండక్టర్ గా, రైలు శుభ్రపరచడం పరచడం,
రైలింజన్ ఇంజన్ లో బొగ్గు నింపడం, ఇలా రకరకాల పనులు చేస్తూ జీవన కొనసాగించవలసి వచ్చింది.

ఓక గమ్యం లేదు,సరైన చదువు లేదు, ఏ పని దొరికితే ఆ పని
చేసుకుంటూ జీవనప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో
జీవితం పెనం పై నుంచి నిప్పు లోకి జరిపడింది. 18 సంవత్సరాల వయసులో పెండ్లి జరిగింది, ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు,చిన్న వయసులోనే కొడుకు అనారోగ్యంతో మరణించాడు.
ఏ ఉద్యోగానికి వెళ్ళిన పట్టుమని పది రోజులు చేసేవాడు కాదు, కారణం సరైన శిక్షణ లేకపోవడము.
ఉసూరుమంటూ ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య అసహ్యించుకునేది,ఒకరోజు చెప్పా పెట్టకుండా తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈయన వెళ్లి ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఆమె ఈయన తో ఉండటానికి ఇష్టపడలేదు ఈయనతో రాలేదు, ఒకరోజు తన సొంత కూతురిని కిడ్నాప్ చేయవలని నిర్ణయించుకున్నడు,
అలా ఆయన భార్య తన దగ్గరికి వస్తుందని అని అనుకున్నాడు, అయితే
తాను ఒకటి తలిస్తే భగవంతుడు మరొకడు తలిచాడు అన్నట్లు,
అందుకు విరుద్ధంగా
పోలీస్ కేసు అయింది. జైలుకు వెళ్లవలసి వచ్చింది చివరకు 21 సంవత్సరాల వయసులో విడాకులు కూడా తీసుకోవలసి వచ్చింది. అలా సంసారం మూడు సంవత్సరాల ముచ్చటగా ముగిసిపోయింది.

22 సంవత్సరాల వయసులో ఆర్మీ లో చేరాడు పాపం అక్కడ కూడా కేవలం ఒక సంవత్సర కాలం మాత్రమే పని చేశాడు,
వారు కూడా ఉద్యోగం నుండి
తీసివేయడం తో, ఏం చేయాలో? ఎటు పోవాలో? తెలియక పిచ్చివాడి చేతిలో నుంచి విసిరి వేయబడ్డా రాయిలా తయారైంది జీవితం.

ఒక కంపెనీలు ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరాడు కాకపోతే వారు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేదని వారు కూడా తీసివేశారు. మరొక ప్రముఖమైన టైర్ల కంపెనీ లో సేల్స్ మెన్ గా జాయిన్ అయ్యాడు, కాకపోతే దురదృష్టం ఇక్కడ కూడా వెంటాడింది ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్లి దివాలా తియడంతో కంపెనీని మూసివేశారు, దీంతో ఆ ఉద్యోగం కూడా పోయింది.

చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రాత్రులు కష్టపడి
లా చదువును దూరవిద్యలో పూర్తిచేశాడు. విచిత్రం ఏంటంటే కోర్టులో తన క్లయింట్ తో తానే గొడవపడి వాడిని కోర్టులో కొట్టడంతో అలా లాయర్ జీవితం కూడా ముగిసిపోయింది.

ఇక ఉద్యోగాలకు మనం పనికిరాం, అని భావించి వాటికి స్వస్తి చెప్పి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఒక చిన్న బోటును కొనుక్కొని, టూరిస్టులను అటు ఇటు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు, ఇంతలో
ఆర్థిక మాంద్యం ఏర్పడడంతో ఎవరు కూడా టూరిస్టులు రావడం లేదు దీనితో ఈ వ్యాపారం కూడా నష్టలతో ముగిసిపోయింది.

పట్టువదలని విక్రమార్కుడిలా ఒకటి పోతే మరొకటి అనుకుంటూ..........


లాంతరు లైట్లు తయారు చేయడం ప్రారంభించాడు. దురదృష్టం ఎక్కడ వెళ్లిన మన వాడిని వదల్లేదు, ఒక ప్రముఖ కంపెనీ కరెంటు బల్బులను తయారు చేయడం ప్రారంభించింది, దానితో ఈ వ్యాపారం కూడా
మూసి వేయవలసి వచ్చింది.

అలా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికి మనవాడికి 40 సంవత్సరాలు నిండిపోయాయి.
ప్రయత్నిస్తే పోయేదేముంది అంటూ మరొక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాడు.
ఇంతలో మన వాడికి ఒక హైవే పక్కన ఉన్న వాటర్ సర్వీసింగ్ యజమానితో పరిచయం ఏర్పడింది. అది సరిగా జరగక నష్టాలు వస్తూ ఉండటంతో యజమాని ఈ వ్యాపారాన్ని నువ్వు చూసుకో అద్దె కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వచ్చే లాభం లో సరి సగం తీసుకుందాం అని అంటూ ఒక సువర్ణ అవకాశాన్ని అందించాడు.

సరే అని ఆ వాటర్ సర్వీసింగ్ సెంటర్ ని మనవాడు కొనసాగించడం మొదలు పెట్టాడు అయితే వాటర్ సర్వీసింగ్ తోపాటు అక్కడికి వచ్చిన వారికి వివిధ రకాలైన చికెన్ వంటకాలను వండి వడ్డించే వాడు దీనితో వాటర్ సర్వీసింగ్ సెంటర్ కంటే
మనవాడి వంటలకు గిరాకీ బాగా పెరిగింది. దీనితో ఇది ఏదో బాగుంది అని ఆ హైవే పైన ఒక రూము రెంటుకు తీసుకొని ఒక రెస్టారెంట్ ను ప్రారంభించాడు వ్యాపారం బాగా పుంజుకుంది
అయితే మన వాడికి
దరిద్రం మరోసారి తలుపు తట్టింది ఈసారి ఏకంగా అక్కడ ఉన్నటువంటి హైవే రోడ్డు ని ప్రభుత్వం మార్చివేసింది దీనితో వాహనాలు అటువైపు రాక ఈ వ్యాపారం పూర్తిగా నష్టాలపాలయ్యారు దీనితో ఈ వ్యాపారం కూడా మూసివేయాల్సి వచ్చింది.

అప్పటికి ఆయన వయస్సు 59 సంవత్సరాలు జీవితమంతా అపజయాలే,ఏ పని ప్రారంభించినా అపశృతులే,
ఎందుకు నేను బ్రతికి ఉండాలి? నేను జీవించడానికి ఒక కారణం కూడా కనిపించడం లేదు అని నిరుత్సాహంతో బాధపడుతూ ఊరి చివరకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొని, ఒక సూసైడ్ నోట్ కూడా వ్రాసి అక్కడే ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అయితే ఈయన చనిపోవడం బాహుషా భగవంతుడికి ఇష్టం లేదేమో!

ఆ చెట్టు కొమ్మ విరిగి కింద పడ్డది బతకడానికి ఎలాగో ఈ భూమ్మీద నాకు అవకాశం లేదు, చావడానకి కూడా భగవంతుడు నాకు అవకాశం ఇవ్వడం లేదు, అంటూ వెనుతిరిగి ఇంటికి వచ్చేశాడు. ఏం చేయాలి అని మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టాడు మనకు వచ్చింది వంట బాగా చేయడం అందులో చికెన్ బాగా వండటం. దాని నమ్ముకున్నాడు రకరకాల చికెన్ వంటకాలు చేసి వివిధ రెస్టారెంట్లలో చూపించడం మొదలు పెట్టాడు.
దాదాపుగా వెయ్యికి పైగా రెస్టారెంట్ ల వారు తను చేసినటువంటి వంటకం బాగా లేదంటూ తిరస్కరించారు. అయినా నిరుత్సాహపడకుండా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు.

చివరకు ఒక రెస్టారెంట్ యజమాని తాను 11 రకాల మసాలా దినుసులతో కలిపి
వేయించిన చికెన్ లెగ్ పీసులను అమ్మడానికి అంగీకరించాడు.
ఒక్కొక్క పీసు పై తనకు
0.05% శాతం లాభం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈ వంటల రుచి ఆ నోటా ఈ నోటా చేరి అమెరికా మొత్తం వ్యాపించింది.తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూ ఉన్నది.

కేవలం అమెరికాలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా 20,000 పైగా అవుట్ లేట్ లతో
సంవత్సరానికి ఒక లక్షా యాభై వేల కోట్లకు పైగా ఆదాయంతో ప్రపంచంలోని అతి పెద్ద వ్యాపార సంస్థలలో
రెండవదిగా పేరుపొందిన
వ్యాపార సంస్థగా అది మారిపోయింది. అన్ని అపజయాల తర్వాత అది 65 సంవత్సరాల వయసులో
ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఆ మహోన్నత మైన వ్యక్తి ఎవరో తెలుసా?

ఆయన ఎవరో కాదు 130కి పైగా దేశాలలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంతో తింటూ ఉన్నా కేఎఫ్సి చికేన్ లేగ్ పిస్ KFC
వ్యవస్థాపకుడు కల్నల్ శాండర్స్

నీకు ఏ పని చేత కాదు, నువ్వు ఏ ఉద్యోగానికి పనికిరావు అని జీవితాంతం తిరస్కరించబడిన వ్యక్తి. తన వృద్ధాప్యంలో సాధించిన విజయం గురించి ఇవాళ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది.

ప్రతి రాయి ఈ భూమి మీద ఏదో ఒక రోజు విలువైన వజ్రాం ల అమ్ముడు పోతుంది అంటారు పెద్దలు.

వెల కట్టడానికి వీలులేనిది ప్రాణం. అందుకే ఆత్మహత్య ప్రాయశ్చిత్తం చేసుకోనే విలులేని మహాపాపం.
జీవితం లో ఎన్ని అపజయాలు ఎదురైనా బ్రతకాలి,
మనం సాధించిన విజయం గురించి నలుగురు మాట్లాడుకుంటూ ఉంటే విని ఆనందపడే రోజు కోసం ఎదురు చూడాలి.

ఈ ప్రపంచం లో ఏదో ఓక్క రోజు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పేది నీ మానసిక ధైర్యం. అదే మన ఆస్తి దాని ఏప్పటికి కోల్పోకూడదు.

జై భవ విజయీభవ.

Source - whatsapp sandesam

ప్రేమ ముద్దు - గారాబం వద్దు !!

💐🕉️ 🚩

ప్రేమ ముద్దు - గారాబం వద్దు !!

నాడు
హీరో సైకిల్... సంకలో రేడియో
ఎక్కాబుడ్డీలు... కందిని దీపాలు..

నేడు
స్పోర్ట్స్ బైక్ ... యాపిల్ ఫోన్... ఎల్ ఇ డి బల్బులు...ఇంటర్నెట్ లు,
అదేమంటే... గారాబం...

నాడు
సంతోషంగా.. సైకిల్ రీములు తుడిచాము,
ఆనందంగా దీపం గ్లాసు కడిగాము..

నేడు
బండ్లు నడపడమే తప్ప...
తుడవడమంటే ఎరుగరు...
అదేమంటే గారాబం...

నాడు
అమ్మ నాన్న ఇచ్చే డబ్బులతో
పల్లీల ముద్దలు, పిప్పరమేట్లు
కొనే వాళ్ళం..
పోపన్నమో... సద్దన్నమో
తినేవాళ్ళం...

నేడు
నూడుల్స్, చాక్లెట్లు,
ఐస్ క్రీమ్ లు కూల్ డ్రింక్ లు,
ఫ్రైడ్ రైసులు, బిర్యాణీలు...
పిజ్జాలు... బర్గర్లు కొంటూ..తింటున్నారు..
అదేమంటే గారాబం...

నాడు
ఆడపిల్లలు
ఇల్లు అలకడం, వాకిలి ఊడ్వడం... గడపలు కడగడం... ముగ్గులు వేయడం...
అమ్మకు వంటలో సహాయం చేయడం..

నేడు
తిన్న కంచం కూడా కడగరు
ఇల్లు ఊడ్చమంటే ఎరుగరు
వంటా వార్పు అసలేరాదు..
కర్రీ పాయింట్లు, ఫాస్టుఫుడ్ సెంటర్లు
అదేమంటే గారాబం..

నాడు
స్కూల్లో పాఠాలు అప్పజెప్పకున్నా... తప్పుచేసినా...గుంజీలు తీయడం... బెత్తంతో కొట్టడం.. ఇంట్లో చెప్పినా అడిగేవారేకాదు...

నేడు
చిన్న చిన్న దెబ్బలకే పెద్ద పెద్ద పంచాయతీలు... పాఠాలు చదవమంటే.. పంతుళ్ళతోటే ఫైటింగులు..
అదేమంటే గారాబం..

నాడు
చదువంటే సంస్కారం
గురువుకో నమస్కారం
పెద్దలంటే భయం...
పనిమీద గౌరవం...

నేడు
భయంలేదు.. భక్తి లేదు..
చదువు అంతకన్నలేదు...
పెద్దలంటే భయం లేదు...
అడిగేవారులేక...
ఆవారా తిరుగుళ్ళు..
ఆడవారిపట్ల అఘాయిత్యాలు...
అదేమంటే గారాబం..

నాడు
ఇంట్లో చెప్పకుండా తిరగనివారం
రాత్రి పదికాకముందే పడుకునేవారం..

నేడు
అర్ధరాత్రి ఒంటిగంటైనా...
పక్క సదరం...ఎవరికీ బెదరం...
అదేమంటే గారాబం..

అందుకే....
పిల్లలను ప్రేమించండి... కానీ గారాబం చేయకండి...
నీ ప్రేమతో పిల్లల భవిష్యత్తు అందంగా తీర్చాలే తప్పా,, అంధకారంలో నెట్ట కూడదు
అది మీకే కాదు సమాజానికీ కూడా నష్టమే

మా పిల్లలు మా ఇష్టం అంటారా,,,,, అయితే బాధ కలిగితే క్షమించండి
🙏🙏🙏🙏🙏

Source - whatsapp sandesam

గోరింటాకు చరిత్ర తెలుసుకుందాం....

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿☘️

అక్కలు,అమ్మాయిలు ఆషాడం వచ్చింది మరి గోరింటాకు చెట్లు వెతుకున్నారా

గోరింటాకు చరిత్ర తెలుసుకుందాం…

అసలు పేరు గౌరింటాకు…
గౌరి ఇంటి ఆకు….


గౌరీదేవి బాల్యంలో చెలులతో
వనంలో ఆటలాడే సమయాన
రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే
ఓమొక్క పుడుతుంది.

ఈవింతను చెలులు పర్వతరాజుకుచెప్పగా సతీసమేతంగా చూసేందుకు
వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను,
నావలన లోకానికి
ఏఉపయోగం కలదూ అని అడుగుతుంది. అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి.

అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు
పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది.

పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో
ప్రసిధ్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే
అలంకారవస్తువుగా వాడబడుతుంది.

అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు.

ఆసమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా‌ఈ ఆకు వలన
బొట్టు దిద్దుకుంటారేమో!!

నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో
ఆసందేహం చెప్పగా…. నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు.

ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది.
అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే
ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి
ప్రశాంతపరుస్తుందిగోరింటాకు.

ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి.

ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం
స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహంకూడా
అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నచేతపెట్టుకున్న గోరింటాకు
మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం
అనేది ఆమగువ ఆరోగ్యాన్ని
సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కనిభర్త వస్తాడూ ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడుకదా….

పెద్దోళ్ళు ఏంచెప్పినా మరీ ఓ పది పన్నెండు మైళ్ల దూరదృష్టి
తోనే చెబుతారండీ.

అపోహలేం కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకూ అన్నివిధాలా ఆరోగ్యం ఆనందం.

సంవత్సరానికోమారు పుట్టింటికి పోతుందండోయ్. అంటే పార్వతి దగ్గరికి.

ఆషాఢమాసంలో అక్కడున్నపుడు కూడా తనను
మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట.
🌿🌿🌿🌿🌿🍀🍀🍀🍀🍀

Source - whatsapp sandesam

నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పకు...నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు.!!!

😩 ఛీ!చచ్చిపోతేబాగుండు ...నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు....అర్థంచేసుకొనేవారు కూడా ఎవరూ లేరు...
చనిపోవడం బెటర్ అని ఆలోచిస్తూ...

చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు...విసిగి వేసారి, అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు...!!!

అన్నీ అంటే...???

ఉద్యోగం...తనని నమ్మిన కుటుంబాన్నే కాకా తాను నమ్మిన దైవాన్ని ,చివరికి దైవమిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు...

చివరిగా ఒక్కసారి దేవునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవునితో ఇలా మాట్లాడతాడు...

" దేవుడా ! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా " అని అడుగుతాడు...

దానికి దేవుడు వాత్సల్యంగా " నాయనా !ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి.., వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"

"అవును... కనిపిస్తున్నాయి."

"నేను... ఆ గడ్డి విత్తనాలు... వెదురు విత్తనాలు... నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను... గాలి ,నీరు సూర్యరశ్మి ...అన్ని అవసరమైనవి అన్నీ అందించాను."

గడ్డి వెంటనే మొలకెత్తింది.

భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా ...

కానీ వెదురు మొలకెత్తనే లేదు.

కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు...
విస్మరించనూలేదు...

ఒక సంవత్సరం గడిచింది,
గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది
అందంగా ఆహ్లాదంగా...
కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు .
రెండు ,
మూడు ,
నాలుగు సంవత్సరాలు గడిచాయి ...
వెదురు మొలకెత్తలేదు
కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు...

ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది...

గడ్డి కన్నా ఇది చాల చిన్నది

కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...అందంగా బలంగా ...

ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది బలపరచుకుంది...

పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం
వేళ్ళు ముందు సంపాదించాయి...
ఆ బలం వాటికి లేకపోతె వెదురుమనలేదు (నిలబడలేదు)


నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను...

ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ ,ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి...

వెదురు మొక్కను విస్మరించలేదు...

నిన్నుకూడా విస్మరించను...

ఒకటి, నిన్ను నువ్వు ఇతరులతో
ఎన్నటికీ పోల్చుకోకు...

రెండూ, అడవిని అందంగా మలచినప్పటికీ ...
గడ్డి లక్ష్యం వేరు ..
వెదురు లక్ష్యం వేరు ...

నీసమయం వచ్చ్చినప్పుడు
నువ్వూ ఎదుగుతావు...!!!"

"ప్రభు...! మరి నేను ఎంత ఎదుగుతాను??"

"వెదురు ఎంత ఎదిగింది?"

'అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."

"నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు"

దేవుడు ఎప్పుడూ... ఎవరినీ ... విస్మరించడు... విడిచిపెట్టడు...
మనం కూడా దేవుడు పై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్నీ ఎన్నటికీ విడిచిపెట్టకూడదు...
ఆయన మన చేయి విడువక మంచి స్నేహితునిగా మనలను అర్థం చేసుకుంటాడు...

ధైర్యంగా ఉండండి..ప్రార్థించండి..
తప్పక దేవుని సహాయాన్ని పొందుకుంటారు

నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పకు...నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు.!!!👍

Source - whatsapp sandesam

వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి.

వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి.

ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది.

వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది ( నాశనం).

వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.

అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.
అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.
సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది.

వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి.

వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం.

కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే చంపగలవు.

ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి.

వైరస్ నిర్వీర్యం కాకుండా/ నిలచి వుండే సమయం:
వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ
సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన రాగిపై - 4 గంటలు
చెక్కపై - 4 గంటలు
కార్డ్ బోర్డు పై - 24 గంటలు
లోహాలపై - 42 గంటలు
ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.

వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.

వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.

కావున మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.

ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.

అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.

ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు.

వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు కొవ్వు లను కరిగించే శక్తి లేదు.

స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.
వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.

65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.

తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.

మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది.

గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.
Note:
ఇనుముపై 12 గం. ల వరకూ వుంటుంది - కాబట్టి
తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.

మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?
1. గొంతులో దురద,
2. పొడి గొంతు,
3. పొడి దగ్గు.
4. జలుబు, తలనొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.
ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.
🌸🌸🌸🌸🌸
ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం.👍

Source - whatsapp sandesam

మీ పిల్లల్ని సరైన రీతిలో పెంచుతున్నారా?

తల్లి దండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు, ఆత్మవిమర్శ చేసుకోవలసిన అంశం.


ముందుగా కొన్ని, సామెతలు చూద్దాం

1)మొక్కై వంగనిది మానై వంగునా,
2) ఆవు తోకనాడించాలే గాని తోక ఆవునాడిoచకూడదు,
3)ఆవు చేనులో మేస్తే లేగ గట్టుమీద మేస్తుందా'

4) దొంగను పట్టుకున్నవారితో దొంగను పట్టావుకాని చేయి కొరికి పారిపోతాడుసుమా అనీ చెబితే దొంగకు నేర్పినట్టు కాదా

ఈరోజుల్లో కొందరు పిల్లలు మాట వినడం లేదు తల్లి తండ్రులపైకి మర్లవడడం, మందలిస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు?కారణం ఏమిటి? ఇందుకు బాధ్యులు, పిల్లలా, పెద్దలా?

నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతాను ఇష్టం ఉన్నవాళ్లు చదవండి

కొన్నికారణాలు:-

పిల్లలపై విపరీతమైన, వ్యామోహం, శృతి మించిన గారాభం,తండ్రికి దూరలవాట్లు ఉండడం, భార్యకు బయపడం, ఆడవారి పెత్తనం ఇంట్లో నడవడం మొదలగు కొన్ని కారణాలు,పిల్లలముందే భార్యా భర్తలు తరచూ తగువులాడుకోవడం,మొదలగునవి కొన్ని కారణాలు

1)మన ప్రవర్తననే పిల్లలు గమనించి నేర్చుకుంటారు(అనుసరిస్తారూ) అని మీకు తెలుసా?.

1).కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆపీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నట్లు?

2) నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?

3) పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?

4) పిల్లలు ఏదైనా విరిచినప్పుడో పగులగొట్టినప్పుడో ఇది ఎవరూ చేసారని అడిగితే నేనే అని చెప్పిన పిల్లల్ని నిజం చెప్పినందుకు మెచ్చుకోక పోగా ఎందుకు విరిచావని కొట్టడం చేస్తారు అలాకాదు విరిచి అబద్ధం ఆడితే అప్పుడు దండించి అప్పుడు చెప్పాలి విరవడం ఒకతప్పు, నేను కాదూ అని చెప్పడం ఇంకో తప్పు అబద్ధం ఆడినందుకు కొట్టాను అని చెప్పాలి లేదా దీనివల్ల. పిల్లలకి అర్థం అయ్యేదేమంటే నిజం చెబితే మా వాళ్ళు కొడతారు అని అబద్దాలు ఆడడం మొదలెడతారు

5) 2,3 సంవత్సరాలనుండే పిల్లల్ని గట్టిగా సన్మార్గంలో పెట్టాలి, తప్పుచేసినప్పుడే దండించేటప్పుడు ఇంట్లో ఎవరైనా అడ్డువస్తే వాళ్లకు ముందు 4 వడ్డించాలి అప్పుడు పిల్లలకు తప్పుచేస్తే మమ్మల్ని ఎవరూ కాపాడలేరని భయం ఉంటుంది

6) తప్పుచేస్తే ఒకటి కొడితే ఏడిస్తే4వడ్డించాలి ఎవరైతే ఎడవడానికి సైతం బయపడతారో వారు సక్రమంగా వుంటారు, కొంచెం మందలించగానే బిగ్గరగా ఏడుస్తారో వారు మీ కంట్రోల్లో ఉండరని అర్థం

7) ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?

8) లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తల్లితండ్రిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?

9) పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?

10) పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?

11) మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదివిస్తున్నారా?

12) చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?

13) అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?

14) అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?

15) సరదాకు, విచ్చలవిడితనానికి తేడా ఏమిటో వివరించారా?

16) వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?

17) మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి.అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, మీ ఇంటినుంచి మొదలుపెట్టండి.

18) ఎప్పుడో వృద్దాప్యం వచ్చినంక సాకుతారని పిచ్చి ప్రేమతో వారిని సన్మార్గంలోపెట్టకపోవడం మీదే తప్పు

19) మీ పిల్లలముందు మీ తల్లితండ్రులను ఎలచుస్తున్నారో పిల్లలకు మీరు ఏమి సందేశం ఇస్తున్నారో తెలుసా మీకు

20) ఒకముఖ్య విషయం మీరు ఒక వాహనం తయారు చేస్తున్నారు ఆనుకుందాం దానిపై అతి వ్యామోహం,అధిక గారాబo ఉండి ఆవాహనంకు నొప్పి పుడుతుంది అని టైర్ల నట్లు గట్టిగా ఫిట్ చేయక,స్టీరింగ్, బ్రేకులు టైట్ చేయకుండా ఆన్ కండీషన్ బండి తయారు చేసి రోడ్డుపైకి లైసెన్సు ఇచ్చి ఒదిలితే అది ఇతరులకు ప్రమాదం కలిగిస్తుంది అది ప్రమాదంలో పడుతుంది ఈరోజుల్లో నేరాలు చేసే వాళ్లంతా కండిషన్ లేని బండ్ల లాంటివారే.జాగ్రత్త

21) మొల కఠినంగా లేకుంటే శిల శిల్పం కాలేదు

22) నీవు ఉత్పత్తి చేసిన వస్తువు నాన్యంగా లేదు అంటే , లోపం నీదా వస్తువుదా ఆత్మలోచన చేసుకోండి

23) ఒక స్కూల్లో, చదువుకునే పిల్లవాడు స్కూల్ వాళ్ళు చెప్పిన సమయానికే రావాలి, వారు సూచించి యూనిఫామ్ మాత్రమే వేసుకోవాలి లేదంటే రానివ్వరు అలాగే మీ పిల్లలు మీరు చెప్పినట్టు విని సన్మార్గంలో నడువకుండా, సదాచారములు పాటించ కుంటే మీరెందుకు భరించాలి

Source - whatsapp sandesam