Tuesday, June 9, 2020

ఎంత చిత్రమో ఈ 'జీవిత సత్యాలు'

ఎంత చిత్రమో ఈ జీవిత సత్యాలు

మెట్టెల విలువ వేలలో

కాని వేసేది... కాళ్ళకి...!
కుంకుమ విలువ రూపాయలలో...
కానీ పెట్టు కొనేది నుదుటి పైన

విలువ ముఖ్యము కాదు
ఎక్కడ పెట్టు కుంటా మనేది ముఖ్యము....!

ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు... చక్కెర లాగ మాట్లాడి మోసగించే వాడు నీచుడు.

ఉప్పులో యెప్పుడు పురుగులు
పడ్డ దాఖలాలు లేవు.తీపిలో పురుగులు పడని రోజూ లేదు....!

కనిపించని దేవుడికి ఖర్జూర పాయసం.కటిక బీద వాడికి రొట్టె ముక్కలు పాచిన బువ్వ.
ఎంత వరకు సమంజసము

హే మానవా !

ఈ జీవితం అంత విలువైనదేమి కాదు
ఏడుస్తూ ఈ లోకంలో అడు గిడుతావు.ఏడిపిస్తూఈ లోకాన్ని వదలి వెళ్ళి పోతావు.....!

రమ్మన్నా సన్మార్గము లోకి యెవ్వరు రారు.వద్దన్నా చెడు మార్గమునే యెంచు కుంటారు.

పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి.
సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు.

పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు.ఖరీదైన సారాయిలో నీళ్ళు కలిపి తాగుతారు.

ఆహాహా యేమి ఈ లోకం....!

పెళ్ళి ఊరేగింపులో బంధు మిత్రులు ముందు .వరుడు వెనకాల.
శవయాత్రలో శవము ముందు

బంధు మిత్రులువెనకాల.

శవాన్ని ముట్టి నందుకు స్నానం చేస్తారు.మూగ ప్రాణులను చంపి భుజిస్తారు.

కొవ్వు వత్తులను వెలిగించి చని పోయిన వారిని గుర్తు చేసు కొంటారు.
కొవ్వు వత్తులను ఆర్పి జన్మ దినాన్ని ఆచరిస్తారు..!
హే మానవా !

ఆకలి విలువ పేదవానికి తెలుసు
కష్టము విలువ కర్షకునకు తెలుసు.


ఇదే పచ్చి నిజం
పుట్టి నపుడు జాతకం
మధ్యలో నాటకం
చావగానె సూతకం
ఐనా ఆగదు జనుల
మధ్య కౌతుకం.....!

సకల జీవులకు అన్నమే పరబ్రహ్మ మని అన్నాడు బసవణ్ణ
అది తెలుసు కోకుండమూఢులైనారు
చాలామంది.

కళ్ళతో ఈ జగత్తును చూస్తే కని పించేవి దృశ్యాలే...హృదయంతో చూడ గలిగితే జగత్తంతా సుందరమే

🙏🏻 సుమధుర నందన వనాలె🙏

శుభ శుభోదయం

ఆనందో బ్రహ్మ ధ్యానం గ్రూప్స్

9032555166
హైదరాబాద్

_🧜‍♂️🧜‍♀️🧚‍♂️🧚‍♀️🧘‍♀️🧘‍♂️

No comments:

Post a Comment