Tuesday, June 9, 2020

ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తూ ఉండటం వ్యక్తి మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది.

జీవితం ఒక అంతులేని పయనం. ఈ సుదీర్ఘ వింతపయనంలో నిమిషాలు, గంటలు, దినాలు పరుగులు తీస్తూ ఉంటాయి. మాసాలు గడిచి సంవత్సరాలుగా మారుతుంటాయి. జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతూ ఉన్నంతకాలం మాసాలు నిమిషాలుగా, సంవత్సరాలు గంటల గడియారంలో ముళ్లలా చకచకా నడుస్తూఉంటాయి.

సమస్యలు ఎదురుపడగానే క్రమం అంతా తారుమారవుతుంది. ఇలా జరగడానికి కారణం ఏమైఉంటుంది? కాలమహిమ అని కొందరు, కాదు మనసే ఖలనాయకుడని మరికొందరు వాదిస్తారు. కాలం ఒక మహాప్రవాహం. దానికి ఎదురీది గట్టెక్కాలనుకునే మనస్తత్వం ఉన్న మనిషికి జీవితం సవాలుగా మారుతుంది.

ప్రవాహంతోపాటు సాగిపోదామన్నా, అది సాఫీగా సాగుతుందన్న భరోసా లేదు. తేడా భావనలోనే ఉంది. ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తూ, సుడిగుండంలో చిక్కుపడిన దుంగలా తలకిందులుగా తలపడటమా? లేక తుంగలా తలవంచి ప్రమాదం నుంచి బయటపడటమా? ఈ ప్రశ్నలకు సమాధానం వ్యక్తి మానసిక స్థితిపైన ఆధారపడి ఉంటుంది.*
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment