🧚సుఖ -- దుఃఖాలు🧚
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
వేసవి కాలంలో ఎండ బాధ.
👎
చలికాలంలో చలి బాధ.
👎
వర్షాకాలంలో బురద బాధ.
👎
గాలి కాలంలో దుమ్ము బాధ.
👎
లేని వాడికి ఆకలి బాధ.
👎
ఉన్నవాడికి అజీర్తి బాధ.
🎉🎊💦🎉🎊💦🎉🎊
🥰 ఈ లోకమంతా సుఖ- దుఃఖాలమయం.
చీకటి- వెలుగు,
రాగం-ద్వేషం,
లాభం-నష్టం,
ఎత్తు-పల్లం,
నీరు - నిప్పు,
పాపము - పుణ్యము,
మంచి - చెడు ,
స్వర్గం - నరకం,
తప్పు-ఒప్పు ,
ఇలా ఏది చూసినా ఈ రెండూ లేకుండా కనిపించవు.
🏩 ఈ బాధలను, వ్యత్యాసాలను తప్పించుకునే వీలుందా? వీలు లేనేలేదు. కొంచెం ఓపిక పడితే అన్ని బాధలు తొలగిపోతాయి.
🥶కానీ మనిషి ఏకపక్షంగా ఊహించు కోవడం వలన, ఆశించడం వల్లనే ఎక్కువ బాధలకు లోనవు తున్నాడు.
🙎ప్రతి మనిషి లాభమే పొందాలనీ, నష్టమే రాకూడదనీ, సులభంగానే ఉండాలనీ, కష్టమే కలగకూడదని కోరుకోవడం వల్లనే బాధలకు గురి గురవుతున్నాడు.
🔥 ఈనాటి జఠిలమైన సమస్య రేపటికి కాస్త తగ్గుతుంది. మరునాటికి ఇంకాస్త తగ్గుతుంది .
🤹ఇలా మాసం గడిచిన తర్వాత సమస్యనే మర్చిపోతాము. కొంచెం ఓపిక పడితే అన్ని బాధలూ తొలగి పోతాయి.
🤸సమస్యలకు పరిష్కారాలు, మనసుకు సుఖం, సౌఖ్యము ఇచ్చేవి ఏవి? ఒకవేళ ఉంటే వాటిల్ని అందిపుచ్చు కోవడమెలా? అనే వాటి గురించి ఆలోచన వృధా. సమస్యలు లేని జీవితమే ఉండదు. కావాలసిందల్లా మనోనిగ్రహము.
👬 బాధ్యతను వదిలి పారిపోయినా సమస్య పరిష్కారం కాదు. ప్రారబ్ధరీత్యా దాపురించే సుఖ -దుఃఖాలు నీ కోసం కాచుకునే ఉంటాయి.
🚶అవి ముందుగా నిన్ను సంప్రదించి రావు. కనుక నీవు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు.
🧜కాలం కలిసి వస్తే, నీ ప్రయత్నలోపం ఏమీ లేకుంటే, దేవుని అనుగ్రహం ఉంటే సఫలికృతుడవవుతావు లేదా కర్తవ్య పరాయణుడవవుతావు.
♨️ సాధించగలనా? ఫలితం దక్కుతుందా? లేదా? ఏమమౌతుందో ఏమో? అని ఆందోళన చెందినంతమాత్రాన పనులు సమకూరవు.
🏊ప్రయత్నంలో తడబాటుకు తావిస్తే కష్టం, నష్టం, ఓటమి తప్ప మరొకటి ఉండదు. కానున్నది కాకమానదు.
🌹అనుభవించవలసిన ఫలం నీ కోసం కాచుకునేవుంటుంది. అది ఎలాగూ తప్పదు. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తూ, ఫలితం భగవంతునికి వదిలి వేయాలి.
💜 బాహ్య సౌకర్యాల ద్వారా ఒనగూడేది శారీరక సుఖం. నీతి, నియమాలతో, ధార్మిక విలువలతో జీవించడం ద్వారా పొందేది మానసిక ఆనందం.
💐జీవితంలో గెలుపోటములు ముఖ్యము కాదు. ఎంచుకున్న జీవన మార్గము ముఖ్యం.
🌺ఆదర్శాల కోసం, ధర్మస్థాపన కోసం చేసే నిస్వార్ధ ప్రయత్నంలోనే నిజమైన ఆనందం ఉంటుంది.
👃 సమస్యలూ, శత్రువులు ఉండని జీవితమే లేదు. ఎంతటి ఐశ్వర్యవంతుడికైనా ఏదో ఒక సమస్య, మరేదో ఒక కష్టం ఉండనే ఉంటుంది.
🍀ఇది ప్రకృతి నియమం. జీవితంలో ఎలాంటి సంఘటనలైన జరగవచ్చు. పరిస్థితులు ఏనాడూ ఒకే రీతిలో ఉండవు. అలాగని మన మనోప్రవృత్తి దానికి అనుగుణంగా మారకూడదు.
✨💫మన ప్రవర్తన వలన అంతఃకరణ శుద్ధికి ఏ మాత్రం భంగం కలగకూడదు. గాలివాటం బ్రతుకులు కాకూడదు.
🌃మంచిలో చెడు, చెడులో మంచి, కష్టంలో సుఖం, సుఖంలో కష్టం, తప్పలో ఒప్పో, ఒప్పోలో తప్పులు జీవితంలో తప్పవు.
🌥️వాటిని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పరిష్కరించుకో గలిగిననాడు తృప్తి చెందుతూ, పరిష్కరించలేనినాడు విరక్తి చెందకుండా ఆశాభావంతో అడుగు ముందుకేయాలి.
🌄"వెన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు" "జీవితమే చీకటి వెలుగుల సయ్యాట."
⛄ పండుగలో పలహారాలు,
ఆ తర్వాత పచ్చడి మెతుకులే పరమ రుచులు. పూలపాన్పుపులు,
పరిమళ ద్రవ్యాలు,
అంగ సౌష్టవాలు,
అంద-చందాలు,భోగభాగ్యాలు,
ఆస్థి - పాస్తులు,
విలాస వస్తువులు
ఇవేవీ మనిషికి ఆనందదాయకాలు కావు. అలాగని వీటిని విసర్జించమని కాదు.
🌴 అవి కేవలం తాత్కాలికానంద ప్రేరకాలుగా గుర్తించి, వాటిపై అభిమానాన్ని, వ్యామోహాన్ని పరిమితం చేసుకోవాలి.
💮 ఎటువంటి సుఖమైనా దుఃఖంతోనే అంతమౌతుంది. అందుకే అంటూ ఉంటారు
🌀"జీవితంలో బాగా అనుభవించాడు. ఇప్పుడు అనుభవిస్తూ జీవిస్తున్నాడు" అని.
🎉🎊ఆనందమయమైన జీవితం కావాలనుకున్నప్పుడు ఎవరైనా జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. తనకు తాను సంస్కరించుకోవాలి.
💧జీవితం సుఖమయం కావాలంటే కొన్ని సమయ సందర్భాలలో తగిన నిర్ణయాలు వెంటనే తీసుకోగలగాలి. వివేకముతో మెలగాలి. అవకాశాన్ని చేజార్చుకుంటే ఆవేదనను మిగుల్చతుంది.
🌏సుఖ పడాలని ప్రయత్నించినంత వరకూ నీవు సుఖపడలేవు. నీవే సుఖం అని తెలుసు కున్నప్పుడు మాత్రమే సుఖ పడగలవు. ఆనందంగా ఉండగలవు.
🦄 కష్టం తరువాత సుఖం--స్వర్గం.
సుఖం తరువాత కష్టం -- నరకం.
🐉 ఈ విధముగా సుఖ - దుఃఖాల కలయికే, ఈ భూమి పై మానవుని యొక్క జీవితం.
♨️ సర్వేజనా సుఖినోభవంతు ♨️

No comments:
Post a Comment