Sunday, July 12, 2020

గత 80 ఏళ్ళుగా కరెంటుతో అవసరం లేకుండానే జీవిస్తోందంటే నమ్ముతారా..


ఈవిడ గత 80 ఏళ్ళుగా కరెంటుతో అవసరం లేకుండానే జీవిస్తోందంటే నమ్ముతారా.. అసలు దానికి సంబంధించిన ఏవస్తువూ లేదంటే నమ్ముతారా.????? కానీ నిజమంటే.. ఆ పల్లెటూరులోనో ఉండుంటుంది అనుకుంటున్నారా .. కాదు.. మహారాష్ట్రలోని పూణే మహానగరం నడిబొడ్డున ఉండి చూపిస్తోంది..!!!! ఏ చదువూ సంధ్యా లేదనుకుంటున్నారా.. సావిత్రీబాయ్ పూలే విశ్వవిద్యాలయంనుంచి వృక్షశాస్త్రంలో P.hd పట్టా పొంది పూణే లోని గార్వేర్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేశారు.. ఈవిడ పేరు డా. హేమాసానే...చెప్పడం సుళువే.. కానీ ఆచరించి చూపిన దానికి మరింత విలువ అందుకే ఒక పాడుబడిన ఇంట్లో.. ఒక కుక్క, రెండు పిల్లులు , ఒక ముంగిస.. ఇదే తన ఆస్తి అని చెబుతూ... తనకి తెలియని చెట్టు , పక్షి లేదమో అని అనగలుగుతున్నారు....మీరెందుకు ఇంకా ఇలా ఉన్నారంటే.. ప్రస్తుతం కరెంటు దానికి సంబంధించినవి వాడకం వల్ల భూతాపం పెరిగి ధృవప్రాంతాల మంచు కరిగి మనిషి మనుగడకే ప్రమాదం అయ్యే పరిస్ధితుల ఉన్నాయి.. నున్ను చూసి నాలా కాకపోయిన కొంతైనా వాటి వాడకం తగ్గిస్తే చాలు మన చుట్టూ ఉన్న వనరులని భవిష్యత్ తరాలకు అందించాలి కదా..అంటారు....చాలా మంది చుట్టు ప్రక్కల వారు తనని మూర్ఖురాలు అంటారట..పైగా ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు తనని కరెంటు దొంగ అన్నారట.. తరువాత నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయారు...పోనీ అంతా అయిపోయింది కదా అలా జీవించడంలో పెద్ద విశేషం ఏముందంటారా.. ఆవిడ ఆ చిన్న దీపాల్లోనే.. 25 పైగా వృక్షాలమీద పుస్తకాలు రాశారు... ఇంకా అక్కడి గవర్నమెంటు స్కూల్ కి వృక్షాల మీద రాస్తున్నారు...తన పూర్వ విద్యార్ధులు చాలా మంది తనని వచ్చి కలుస్తూ ఉంటారు.. ఆమెకి వారిచ్చిన బిరుదు “మినీ గూగుల్”. వీరి మీద ఒక డాక్యుమెంటరీ తీశారు అది నేషనల్ అవార్డు పొందింది.. విదేశాలలో కూడా అది ప్రసారం చేయబడి చాలామంది విదేశాల నుంచి కూడా చూడటానికి. వారి జీవన విధానం తెలుసుకోవాలని ఇంకా వారి చదువులో అనుమానాలు తీర్చుకోవడానికి వస్తూనే ఉన్నారు...

ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమని అంటే... సందేశం ఏమీ ఇవ్వక్కర్లేదు.. ఆచరిస్తే చాలు.. అర్దమైపోతుంది అంటారు.🙏🏼💐


No comments:

Post a Comment