రేపటి విజేతను నేను
జీవన పోరాటంలో విజేతల వెనక ఎంతో కృషి ఉంటుంది. అటువంటివారి విజయానికి మూలం ఏమిటో గ్రహించి, ఆ మార్గాన్ని మనం అనుసరించాలి.
భగవంతుడు మనిషిని దీనుడిగా, హీనుడిగా సృష్టించలేదు. తనకు ప్రతిగా మానవుణ్ని భూమ్మీదకు పంపించాడు. సర్వ ప్రాణుల్లో ఆలోచన చేయగల, సంభాషించగల జీవిగా మానవుణ్ని ఈశ్వరుడు సృష్టించాడు. కాళ్లూ చేతులూ మానవుడికి ఉన్నట్లుగా మరే ప్రాణికీ లేవు.
ఒక యువకుడు ఓ వ్యక్తి వద్దకు వెళ్లి ‘అయ్యా! మీకు తోచిన ధర్మం చేయండి’ అని దీనంగా ప్రార్థించాడు. ఆయన యువకుణ్ని తేరిపార చూశాడు. ‘నువ్వు కోటీశ్వరుడివి కదా! అయినా అడుక్కుంటున్నావెందుకు?’ అన్నాడు. బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. ‘నా చేతిలో ఒక చిన్న రాగినాణెమైనా లేదు. నేను బిచ్చం ఎత్తుకోక ఏం చేయను?’ అని ప్రశ్నించాడు.
‘నీ కళ్లు, కాళ్లు, చేతులు సక్రమంగా ఉన్నంతకాలం నువ్వు సంపన్నుడివే! ఇవి అమూల్యమైన అవయవాలు. వీటి సాయంతో నువ్వు సుఖంగా బతకవచ్చు. ఇక నువ్వు యాచించవలసిన పనిలేదు’ అని ఆయన చెప్పగా యువకుడికి జ్ఞానోదయం కలిగింది.
ఆ విశిష్టవ్యక్తి- ప్రసిద్ధ రష్యన్ కథా రచయిత టాల్‌స్టాయ్.
ఈశ్వర చంద్రవిద్యాసాగరుడి వద్దకు ఒక బాలుడు వెళ్ళి ‘అయ్యా! ఆకలవుతున్నది, ఒక పైసా దానం చేయండి’ అని యాచించాడు.
‘రెండు పైసలిస్తే ఏం చేస్తావ్?’ అడిగాడు విద్యాసాగరుడు.
‘మా అమ్మకు శెనగలు కొనుక్కుపోతా!’
‘రూపాయి ఇస్తే ఏం చేస్తావ్?’
‘చవగ్గా దొరికే వస్తువులు కొని, వాటిని బజారులో అమ్మి, స్వశక్తితో జీవిస్తా. ఇక అప్పుడు అడుక్కోవలసిన దుస్థితి నాకు ఉండదు.’
ఈ సమాధానం విన్న వెంటనే విద్యాసాగరుడు ఒక రూపాయి తీసి ఆ బాలుడి చేతిలో పెట్టాడు.
కొంతకాలానికి ఆయన ఒక పనిపై ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళడం సంభవించినప్పుడు, అక్కడ కొత్తగా ఒక దుకాణం వెలసి ఉండటం గమనించాడు. ఒక యువకుడు గబగబ వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి- ‘ఇదంతా ఆనాడు మీరిచ్చిన రూపాయి చలవే’ అన్నాడు.
‘డబ్బుకంటే విలువైనది కృషి! అది నీ దగ్గరుంది.
కృషి చేసేవాళ్లకు దరిద్రం ఉండదు’ అన్నాడు విద్యాసాగరుడు ఆ యువకుడిని మనసారా అభినందిస్తూ.
శరీరాన్ని శ్రమ పెట్టేవాళ్లకు ఆరోగ్యం, ఆనందంతోపాటు సంపద కూడా సిద్ధిస్తుంది.
వీధుల వెంబడి తిరిగి గాలి బుడగలు అమ్ముకొనే వ్యక్తి ఇవాళ కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి యజమాని.
అలాగే పెద్ద చదువులు ఏమీ చదువుకోని ఒక చాయ్ వాలా!
ఇవాళ భారత దేశం గర్వంగా చెప్పుకొనే ప్రధాని. ఇవన్నీ సజీవ సాక్షాలు నిలువెత్తు నిదర్శనలు.
రాతి నేలమీద పడ్డా, తడి తగిలేదాకా లోతుగా వేళ్లను విస్తరిస్తూ అతి కష్టం గా మొక్కయి మానై చివరకు పెద్ద చెట్టయి సగర్వంగా చిగుళ్లు తో మోలుస్తుంది విత్తనం.
పులి లాంటి క్రూరజంతువు వేగంగా వెంటాడుతుంటే బతుకు మీద ఆశను వదులుకోకుండా కూరజంతువులా మిగిలిపోకుండా గుండెలు అవిసిపోయేలా ఎగిరిదూకుతూ శాయశక్తులా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది జింక పిల్ల.
సృష్టిలో ఏ జీవీ ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదు. కొన్నిసార్లు ఓడిపోతాయేమోగాని, లొంగిపోవవి. చచ్చిపోవాలని ఏ
ఆశావాదం జీవీ కోరుకోదు- ఒక్క మనిషి తప్ప! జీవితంలో ఘోరంగా ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకు లోనైనప్పుడు చనిపోవాలని ఆలోచించేది మనిషి ఒక్కడే!
ఆ దశలో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని. గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కణకణలాడుతూ ఉండటమే ఆశావాదానికి నిర్వచనం. సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథం మనిషిని విజయ తీరాలకు తప్పక చేరుస్తుందని మన ప్రాచీన సనాతన ధర్మం
కోటి గొంతులతో చాటిచెప్పింది.
జీవం తొణికిసలాడుతూ నిండు నూరేళ్లు చూద్దాం... నూరేళ్లు విందాం... నూరేళ్లూ మాట్లాడుతూ ఉందాం అని వేదం ప్రోత్సహించింది. సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలేఉందన్న ఆశతో మనిషి జీవించాలని మన వాంగ్మయం బోధించింది.
లంకలో సీత కోసం గాలిస్తూ వాయుసుతుడు ఓ దశలో విసిగి వేసారిపోయాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. చనిపోదామనుకున్నాడు. చితిని రగిల్చి దానిలో దేహత్యాగానికి సిద్ధపడ్డాడు. ఆ క్షణంలో గుండెలోతుల్లో చిన్న ఆశ మొలకెత్తింది. సీతమ్మ కంటపడుతుందన్న విశ్వాసం చిగురించింది. ‘జీవన్ భద్రాణి పశ్యతి... చచ్చి సాధించేదేమీ లేదు. బతికిఉంటే సుఖములు బడయవచ్చు’ అనుకున్నాడు. తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు. అద్భుత విజయాన్ని సాధించాడు. తాను బతికాడు, తోటి కపివీరులను బతికించాడు......
ఫ్రెంచి విప్లవంపై తాను అద్భుతంగా రూపొందించిన రాతప్రతి తన కంటి ఎదుటే అగ్నికి ఆహుతి కావడంతో థామస్ కార్లయిల్ అనే గొప్ప రచయిత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. పిచ్చివాడిలా తిరుగుతుంటే ఒక రోజు ఇటుక ఇటుకగా శ్రద్ధగా గోడను నిర్మిస్తున్న తాపీ మేస్త్రీ కనిపించాడు. ఏదో మెరుపు మెరిసినట్లు కార్లయిల్‌లో ఆశావాదం మొలకెత్తింది. తాపీ మేస్త్రీ పనితీరు స్ఫూర్తిగా రోజుకో పేజీ రాయాలన్న ఆలోచన తోచింది. తిరిగి రచన మొదలుపెట్టాడు. అది మొదటిదానికన్నా అద్భుతంగా రూపొందడం చూసి తానే ఆశ్చర్యపోయాడు. రెట్టించిన ఉత్సాహంతో ఆ బృహత్తర గ్రంథాన్ని పూర్తిచేశాడు. ‘వీరులు, వీరపూజ (హీరోస్ అండ్ హీరో వర్షిప్)’ పేరుతో విడుదలైన ఆ పుస్తకం ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. కార్లయిల్‌కు అంతులేని కీర్తిని తెచ్చిపెట్టింది.
విజేతలెవరూ జీవితం నుంచి పారిపోరు. ఓటమిని ఓ పట్టాన అంగీకరించరు.
మాట్లాడటం సరిగ్గా రాదని బాల్యంలో హేళనకు గురైన విన్‌స్టన్ చర్చిల్ పట్టుదలతో ప్రసంగ కళను సాధన చేశాడు. ప్రపంచం చెవులొగ్గి వినే గొప్ప వక్తగా పేరు గడించాడు.
పొట్టివాడివి, సినిమాలకు పనికిరావు పొమ్మని చార్లీ చ్లాపిన్‌ను తొలుత కొందరు నటుడిగా అంగీకరించలేదు. కానీ, అచిరకాలంలో చాప్లిన్ నటనకు పాఠ్యగ్రంథంగా రూపొందాడు.
విజేతలందరూ నమ్ముకొనేది ఆశావాదాన్నే. ఆశావాదాన్ని ఆశ్రయిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఆశావాదం ఎల్లవేళలా గెలుస్తుంది. మనిషిని గెలిపిస్తుంది. బతుకు మీద రుచిని పెంపొందిస్తుంది. ఆశే చీకట్లో చిరుదివ్వై దారి చూపుతుంది.
ముళ్ళ పోదల మధ్య వున్న మొగలిరేకులు తమ పరిమళ గుణాన్ని వదలవు.
అలాగే నీవు కూడా నీ ధైర్యాన్ని నమ్మకాన్ని వదలకూడదు. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో రేపటి నీ విజయని కూడా ఎవరు ఆపలేరు అన్నది సత్యం. మన నమ్మకమే మనలను గెలిపిస్తుంది, విజేత గా ఈ ప్రపంచని కి పరిచయం చేస్తుంది.
Source - whatsapp message

No comments:
Post a Comment