Saturday, October 24, 2020

సదా సర్వదా, కేవలం మంచి పనులే చేయాలి. ఇంతకు మించి సంక్షిప్తంగా ఏమైనా చెప్పగలమా !!

🔥జ్ఞాన బోధ🔥 ఒకసారి ఒక నగరంలో ఒక ధార్మిక సమ్మేళనం ఏర్పాటు చేయబడింది.

దేశం నలుమూలల నుండి పండితులని ఆహ్వానించారు.

ధర్మమార్గాన నడవడం, నైతిక విలువలను పాటించడం గురించి వివరించడం ఆ సదస్సు ఉద్దేశ్యం ....

ఆ జ్ఞానామృతాన్ని అందరికీ పంచాలని మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు...

దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరి నుండి ఒక యువకుడు రోజు అక్కడికి వస్తున్నాడు.అతను తనతో పాటు తమ పొరుగున వున్న ఒక (నిరక్షరాస్యుడైన) పెద్దాయనని
వెంటపెట్టుకుని వస్తున్నాడు.

రెండురోజుల కార్యక్రమంలో
జ్ఞానగంగ ఉధృతంగా ప్రవహించింది.

అది మూడవరోజు..
ఆ పెద్దాయన పక్కనున్న
యువకునితో అన్నాడు..
" వీళ్ళంతా మూడు రోజుల నుండి ఇంత కష్టపడి చెబుతున్నది నేను రెండు వాక్యాల్లో చెప్పగలను. !"

సరిగ్గా అదే సమయంలో ఆ పక్కనుండి ఆ సదస్సు నిర్వాహకులలోని ఒక వ్యక్తి వెళుతూ ఇది వినటం తటస్థించింది.

అతను వెంటనే స్టేజ్ పైకి వెళ్ళిఆ పెద్దాయన ని పిలిచాడు..
" మేము ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన సదస్సు సారాంశాన్ని మీరు రెండు వాక్యాల్లో చెప్పగలను అన్నారు.దయచేసి మాకు వివరించగలరా ?? "

అందరూ కుతూహలంతో చూసారు....

ఆ పెద్దాయన స్టేజ్ పైకి వచ్చాడు...

మైకు చేతిలోకి తీసుకొని అన్నాడు, " చూడండి.. నేను అసలు ఏమీ చదువుకోలేదు.
గ్రంథాల్లో ఏముందో నాకు తెలియదు.
నాకు తెలిసిన రెండు మాటలు చెబుతాను.వినండి..

🔹 రాత్రివేళ అశాంతితో నిద్రపట్టనీయకుండా చేసే ఏ పనీ పగలు చేయవద్దు.

🔹
పగటివేళ ఎవరికీ కన్పించకుండా ముఖం దాచుకోవాల్సి వచ్చే ఏపనీ రాత్రి చేయవద్దు....

ఇంక చెడ్డ పనులు ఎప్పుడు చేయాలి ???
ఎప్పుడూ చేయకూడదు.
పగలు-రాత్రి, ఎల్లవేళలా
సదా సర్వదా, కేవలం మంచి పనులే చేయాలి.
ఇంతకు మించి సంక్షిప్తంగా ఏమైనా చెప్పగలమా !!!!!*

🕉️🌞🌎🏵️🌼

Source - Whatsapp Message

No comments:

Post a Comment