"విభూతి మహిమ" పురాణ గాధ.
దుర్వాస మహర్షి నిత్యం పరమశివుని మనసులో ధ్యానించి, విభూది ధరించి నిత్యానుష్టానాలను ఆరంభించేవారు.
ఒకనాడు ఉదయాన విభూతి ధరించి పితృలోకానికి బయలుదేరారు దుర్వాసమహర్షి. మార్గమధ్యంలో హఠాత్తుగా ఒక బావి కనిపించింది. గతంలో ఎన్నడూ ఆ మార్గంలో ఈ బావి కనబడలేదు. ఆ బావిలో యేమి వున్నదో అని ఉత్కంఠతతో తొంగి చుశారు మహర్షి. ఆ బావిలో పాపాత్ములు
చాలామంది బంధించబడి వున్నారు. ఈ లోకాన పాపాలు చేసినవారు అందరూ ఆ నరకకూపంలో త్రోసివేయబడి వున్నారు. విషయం గ్రహించి తన పయనం సాగించారు దుర్వాసులవారు. ఇంతలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. దుర్వాసమహర్షి తొంగిచూచి వెళ్ళిన వెంటనే ఆ నరకకూపం స్వర్గధామంగా
మారింది. ఆ కూపంలో ఆత్మలకు బాధలు కలిగించిన
విష జంతువులు, సర్పాలు సుగంధ సుమమాలలుగా మారిపోయాయి. సలసల మరిగే
నీరు సుగంధపన్నీరుగా మారింది. తుఫాను లాగ వీచిన ప్రచండ గాలులు
పిల్లతెమ్మరలుగా మారాయి. ఆ దుర్గంధ కూపం సుగంధంగా మారింది. ఇన్ని రోజులు యమయాతన పడిన ఆత్మలు అన్నీ మోక్షాన్ని పొందాయి.
ఈ విపరీత పరిణామం చూసి ఆ నరకకూపంలో ఆత్మలను హింసిస్తున్న కింకరులు భయపడి యమధర్మరాజు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. నరకకూపం స్వర్గంగా ఎలా మారినదో తెలియని యముడు, వేగంగా వచ్చి ఆ కూపాన్ని చూశాడు.
స్వర్గం నుండి ఇంద్రుడు కూడా వచ్చి చూసి, ఎలాగ జరిగినదీ తెలియక, విస్మయం చెందాడు.
ఆశ్చర్యంతో తలమునకలై దేవేంద్రుడు,యముడు
కంగారుగా కారణం తెలుసుకొనేందుకు పరమేశ్వరుని
వద్దకు వెళ్ళారు.
నరకకూపం స్వర్గంగా ఎలా మారినదని ఈశ్వరుని అడిగారు.
త్రికాలజ్ఞుడైన ఈశ్వరునికి ఆ నరకం స్వర్గంగా మారిన కారణం తెలియకుండా వుంటుందా?
పరమ శివభక్తుడైన దుర్వాసమహర్షి శాస్త్రానుసారం విభూతి ధరించి
సదా తనని పూజించేవాడు. ఆయన అనుకోకుండా ఆ నరకకూపాన్ని తొంగి చూసినందువలన, ఆయన నుదుటి నుండి ఒక విభూతి కణం ఆ నరకకూపంలో పడినది.
ఆ విభూతి మహిమ వలన నరకకూపం స్వర్గంగా మారినది, అని వారికి తెలిపాడు పరమశివుడు.
దుర్వాసమహర్షి నిత్యం, ఉంగరపువ్రేలు,మధ్యవ్రేలు
చూపుడువ్రేలు ఈ మూడు వ్రేళ్ళను కలిపి 'ఓం'కార మంత్రాన్ని జపిస్తూ (అకార, ఉకార, మకార) నుదుటన
విభూదిని ధరించడం నియమంగా గల సదాచార సంపన్నుడు.
ఈ విధంగా నిష్టగా ధరించే విభూతి మహా మహిమాన్విత మైనదని మనకి యీ కధ తెలియచేస్తోంది. పరమం పవిత్రం బాబా విభూతిమ్।
పరమం విచిత్రం లీలా విభూతిమ్।
పరమార్ధ ఇష్టార్ధ మోక్షా ప్రదాతం।
బాబా విభూతిమ్ ఇదమాశ్రయామి॥
Source - Whatsapp Message

No comments:
Post a Comment