Sunday, October 11, 2020

తృప్తి - అసంతృప్తి.

తృప్తి - అసంతృప్తి.🌸

🌸 తృప్తి... అసంతృప్తి మనిషికి రెండుకాళ్ళ వంటివి..
ఇవి జీవితంలో ఉన్నంతవరకు మనిషి నడక ఆగదు... ఎదుగుదలకు అవరోధము ఉండదు... కారణం తృప్తిగా అనిపించింది అంటే అక్కడితో ఆ నడక ఆగినట్లే... అసంతృప్తితో రగిలే మనిషి నిరంతరం తృప్తి వైపు ప్రయాణం చేస్తూనే ఉంటాడు...

🌸 తృప్తి ఉంటే మనిషి మనసు శాంతిస్తుంది... లేకపోతే నిద్రిస్తున్న మనసును పరుగులు పెట్టిస్తుంది అసంతృప్తి...
అసంతృప్తి ఉండాలి కానీ అన్ని సమయాలలో కాదు... మనిషిని మహాత్ముడును చేసేది అసంతృప్తి... ఒకరకంగా.. కానీ తృప్తి మనిషిని నిస్చెలంగా ఉంచుతుంది... మనం ఏ పని మొదలు పెట్టిన పూర్తి చేస్తే తృప్తి... పూర్తి కాకపోతే అసంతృప్తి.. కానీ వీటి మధ్య నలిగి అనుభవం ప్రకారం నడిస్తే నిశ్చలత... మనిషికి నిస్చెలత్వం వచ్చేవరకు వీటి మధ్య నలుగుతాడు... అలా నలగడమే ఎదుగుదల అదే అనుభవం... అంటే తనని తాను ఉలితో చెక్కుకుంటున్నాడు అనేది స్పష్టం... తనని తాను మలుచుకునే క్రమంలో తృప్తి అసంతృప్తి రెండు చక్కటి మొనలున్న ఉలులు... తాను గొప్పకోసం చేస్తే ఈ రెండు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి..
అక్కడ నేను ను చూపించడం కోసం వత్తిడి పెంచుకుని తనను తానే కోల్పోవడం జరుగుతుంది.. భౌతికంగా..

🌸 తృప్తికి అసంతృప్తి కి ఆధ్యాత్మికతలో చోటు ఇస్తే ఇక్కడ కూడా పరుగు మొదలు... విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యేవరకు అసంతృప్తి అనే దావాగ్ని లో జ్వలిస్తూనే ఉన్నాడు...
ఆధ్యాత్మికతలో ధ్యాన సాధన నిశ్చలత్వం నింపుతుంది ఎలాంటి సాధకుడికైనా... అలా జరగకపోతే అది ఖచ్చితంగా ఆహాన్ని సంతృప్తి పరచటం కోసమే.. మరో విశ్వామిత్ర కదా పునరావృతం...

ఆధ్యాత్మికతలో నిశ్చలత్వం ద్వారా నైపుణ్యం సాధించటం తేలిక అక్కడ మనసు వత్తిడి వైపు చూడదు..

ఆధ్యాత్మికతలో తృప్తి అసంతృప్తి రెడింటికి చోటు ఉండదు ఉండేది సృజనాత్మకత మాత్రమే...

ఆధ్యాత్మిక0గా ఎదుగుదల ధ్యాన సాధన ద్వారానే సాధ్యం.. పోటీ ద్వారా కాదు...

తృప్తి కోసం పరుగు ఆగేది ఆధ్యాత్మిక సాధనలోనే...
అసంతృప్తి ఆవిరి అయ్యేది కూడా ధ్యాన సాధనలోనే..

మనల్ని మనం సృష్టించుకునేది సాధన ద్వారానే... మనలో అసంతృప్తిని ఆవిరి చేసే ఉలులు సాధన, స్వాధ్యాయా, సజ్జనసాంగత్యం లు వీటిని వాడిన కొద్దీ పదునెక్కుతాయి..

🌸 తృప్తి అనేది ప్రశాంతత నిస్తుంది చక్కటి నిద్ర వస్తుంది...
తృప్తి అసంతృప్తి రెండు మనసు సృష్టించిన రెండు విభిన్న శక్తులు... వాటితో నడిస్తే కొంతవరకు ok... కానీ సాధన మొదలైన తర్వాత కూడా అవి మనలో ఉంటే మాత్రం మనము మనల్ని ఉద్దరించుకు0టున్నాం అనేది వట్టి మాట మాత్రమే... ఇవి మన నుండి ఆవిరైయ్యేది మాత్రం ధ్యానసాధనలోనే అంటే ఆధ్యాత్మికత లోనే...

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment