Thursday, October 1, 2020

తన్ను తాను చూడడమంటే, తాను దైవాన్ని చూడడమే.

 

🌹💚🌹💚🌹💚🌹💚🌹


🌹తన్ను తాను చూడడమంటే
తాను దైవాన్ని చూడడమే.

తాను దైవాన్ని చూడడమంటే
తనను తాను చూడడమే.

ఒకే వస్తువుకున్న రెండు పేర్లు అవి -
1.తాను 2.దైవం.

తాను(దైవం) సదా ఏకవచనం.
ఎవడైనా తనను గురించి చెప్పేటప్పుడు
నేను అంటాడేగానే మేము అనడు.

చూడడానికి, తెలుసుకోవడానికి తనకు అన్యం లేని అనంతవస్తువే తాను.
తాను, దైవం వేఱు వేఱు కాదు కాబట్టి
తాను దైవాన్ని చూడడం అనే క్రియే లేదు.



దైవాన్ని చూడడమంటే-
వ్యక్తిగతమైన తాను(అహమిక)

ఆ సర్వగతమైన తనకు(దైవానికి)
ఆహారం ఐపోవడమే.



ఓ కప్ప పామును గుఱించి వినడమేగాని, ముఖాముఖిగా యెన్నడూ చూడలేదట.
పామును ఎలా అయినా చూడాలని అందరినీ విచారిస్తూ, నానా ప్రయత్నాలే చేసిందట.
ఎట్టకేలకు పాము కంట పడింది.
మరుక్షణం కప్ప ఈ భూమ్మీద లేదు.
పాముకు ఆహారమైపోయింది.

వ్యక్తికి దైవసాక్షాత్కారం కలగడం కూడా అంతే.

తాను ఉండి, తాను దైవాన్ని చూడడం కాదు,
దైవానికి తాను ఆహారమైపోయి, 'దైవం' ఒక్కటే మిగలడమే దైవసాక్షాత్కారము.

"నేను ముక్తి పొందడం ఎలా?" అడుగుతాడు శిష్యుడు.
"నేను" పోతే ముక్తి అంటాడు గురువు.

నీవు 'పోయాక' కోటిరూపాయిలు ఇస్తాం అన్న ఇన్సురెన్సు పాలసీలా అనిపిస్తుంది శిష్యునికి.

నిజానికి నేను పోగొట్టుకోవడానికి దిగులు చెందనవసరం లేదు.

నది సముద్రంలో కలిసి సముద్రంగా మారుకున్నట్టు
ఈ పరిమితమైన నేను అనంతమైన నేనుగా మారుకుంటుంది.

కాబట్టి శరణాగతి అనేది సర్వం దైవానికి సమర్పించి, సర్వం పొగొట్టున్నట్టు అనిపిస్తుంది.

కానీ 'సర్వం పొందడమే' శరణాగతికి ఫలం.

పావలా పోగొట్టుకుని 'రూపాయి'ని పొందినట్టుగా.



రూపాయి చిల్లరలో పావలా విడిగా కనబడుతుందే గాని
రూపాయి నాణెంలో పావలా ఉన్నా విడిగా కనబడదు.

అలాగే నిద్రలో, మరణంలో అహమిక ఉంటుంది.
ముక్తిలో అహమిక ఆత్మలో తల్లీనమైపోయి ఉంటుంది.

అందువలన నిద్ర, మరణం అనేవి అజ్ఞానస్థితులు.
తురీయం, మోక్షం అనేవి జ్ఞానస్థితులు.



మరణంలో అహమిక మరో శరీరాన్ని, మరో ప్రపంచాన్ని అది సృష్టించుకుంటుంది.

కాబట్టి జీవించి ఉండగానే తాను(అహమిక) చావాలి.
అదే జీవన్ముక్తి.

తాను మరో శరీరంగా మొలకెత్తకుండా
ఆత్మలో తల్లీనమై ఉండడమే పరమపదం.



ఒక్కసారి అంతర్ముఖం అయ్యి....
'నేను' మూలాన్ని అన్వేషిస్తే చాలు...

అక్కడ మరో 'నేను' సాక్షాత్కరించి
ఈ వ్యక్తిగతమైన 'నేను'ను కబళించేస్తుంది.
j
తరువాత కూడా తాను ప్రపంచానికి కనబడుతున్నట్టు ఉంటాడేగాని,

నేను-నేను అంటూ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తాడేగాని

నిజానికి తనకు తానుండడు.



22.

రెండు విరుద్ధమైన విషయాలు చెప్పారు భగవాన్-

1.బుద్ధి చేత దైవాన్ని తెలుసుకోలేం.
2.బుద్ధి చేతనే దైవాన్ని తెలుసుకోగలం.

విరుద్ధమైన ఈ రెండు విషయాలను ఎలా సమన్వయపరచడం?

1.బుద్ధి చేత (బాహ్యవస్తువును తెలుసుకున్నట్టు ఓ విషయంగా)దైవాన్ని తెలుసుకోలేం.

2.బుద్ధి చేతనే(అనగా బుద్ధిని లోనికి త్రిప్పడం వలన) దైవాన్ని తెలుసుకోగలం.



ఆత్మ యొక్క ప్రకాశవైభవమే బుద్ధి.

బుద్ధి ఆత్మకాదు, ఆత్మకు భిన్నమూ కాదు.
కిరణం సూర్యుడు కాదు, సూర్యునికి భిన్నమూ కాదు.

అది వెలిగా వచ్చి లోక విషయాలను వివేచించి తెలుసుకోగల సామర్థ్యమూ దానికి ఉంది.

అది లోపలికి వెళ్లి అహంమూలాన్ని శోధించి ఆత్మలో లీనమయ్యే సామర్థ్యమూ దానికి ఉంది.



విషయసంగ్రహణ చేస్తూ బుద్ధివైభవాన్ని
ప్రకటించేవాడు విజ్ఞాని అవుతాడు.

బుద్ధిని అంతర్ముఖం గావించి ఆత్మలో లీనం
చేసేవాడు జ్ఞాని అవుతాడు.



తెలుసుకోవడం - విజ్ఞానం.
తెలుసు అనడం - అజ్ఞానం.
తెలియదు అనడం - జ్ఞానం.

విజ్ఞానం మనల్ని అనేకం వైపుకు తీసుకెళుతుంది.
జ్ఞానం మనల్ని ఏకం వైపుకు తీసుకెళుతుంది.

విజ్ఞానం బాహ్యవిషయం.
జ్ఞానం ఆంతరవిషయం.



బుద్ధిని లోనకి త్రిప్పడం అంటే,
బాహ్య(ఐహిక)బంధాలను త్రెంపడమే.

బాహ్యబంధాలను త్రెంపడం అంటే,

"నేను-నాది అనేవి ఆత్మ(ప్రొజెక్టర్)నుండి వెలువడే కాంతి తెరపై(మనసుపై) పడడం వలన కదలాడే నీడలే"

అని వైరాగ్యం కలిగి ఉండడం.

"ఇతరములన్నియు నేమిటికి?
మతి చంచలమే మానుట పరము"
అంటాడు అన్నమయ్య.



పారమార్థిక పరిభాషలో చెప్పుకోవాలంటే-

బుద్ధి ఉన్నవాడు బుద్ధిమంతుడు.
బుద్ధి లేనివాడు జ్ఞానవంతుడు.

*

Source - Whatsapp Message

No comments:

Post a Comment