ప్రశాంత జీవనానికి పదునెనిమిది సూత్రాలు
ప్రశాంతతను చెడగొట్టి అశాంతిని కలిగించే కష్టాలు దుఃఖాలు ఎదుర్కోవాలి?
ఈ లోకంలో ప్రతి మానవుడు సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటాడు. ఏ రకమైన అలజడులు, అశాంతి, ఆందోళన, అసంతృప్తి లేకుండా జీవితం గడిచిపోవాలనుకుంటాడు. బాగా డబ్బు, సంపదలు, భోగభాగ్యాలు, విలువైన వస్తువులు, మంచి ఇల్లు, అందమైన భార్య, బుద్ధి మంతులైన బిడ్డలు ఉంటే ప్రశాంతంగా తన జీవితం గడిచిపోతుందని, ఆనందంగా ఉండవచ్చునని అనుకుంటాడు. కాని లోకంలో మన అనుభవం మాత్రం వేరుగా ఉంటున్నది. పైన చెప్పిన వాటిల్లో కొన్ని ఉన్నా - లేక అన్నీ ఉన్నా కూడా ఎప్పుడూ ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా జీవించటం అనేది కుదరదు. ఏవో సమస్యలు, కష్టాలు, దుఃఖాలు వస్తూనే ఉంటాయి. అవి మన ప్రశాంతతను చెడగొడుతూనే ఉంటాయి. అలాంటి స్థితిలో కూడా మనం ప్రశాంతంగా జీవించటం ఎలా సాధ్యమౌతుంది?
మన ఆలోచనలను, మన ఆచరణను, మన పనులను, మనం మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. కొన్ని సూత్రాలను పాటించాలి. అప్పుడే ప్రశాంత జీవనం సాధ్యమౌతుంది. ఎలా మార్చుకోవాలి? ఏ సూత్రాలను పాటించాలి?-
(1) మన ప్రశాంతతను చెడగొట్టి అశాంతిని కలిగించేవి మనకు వచ్చే కష్టాలు దుఃఖాలే. మరి వాటినెలా ఎదుర్కోవాలి?ఈ సందర్భంలో మనం కొన్ని సత్యాలను తెలుసుకోవాలి అవేమిటంటే -
నీవు కోరినా కోరకపోయినా నీవు పూర్వంలో చేసిన కర్మల ఫలితంగా, రావలసిన సమయంలో సుఖాలు ఎలా వచ్చి తీరతాయో - అలాగే నీవు కోరకపోయినా నీ పూర్వజన్మకర్మల ఫలితంగా రావలసిన సమయంలో కష్టాలు తప్పక వచ్చి తీరతాయి - అని నీవు గ్రహించాలి. అంతేకాదు ఈ కష్టాలు, దుఃఖాలు రాకుండా తప్పించుకొనే ఉపాయం ఏమీ లేదని కూడా తెలుసుకోవాలి. ఈ కష్టాలను, దుఃఖాలను రాకుండా తప్పించుకోవటానికి పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేయవచ్చు గదా! అనుకుంటావేమో - ఇవన్నీ భవిష్యత్తులో నీకు మంచి ఫలితాలనిచ్చే సత్కర్మలే గాని ఇప్పటి కష్టాలను తప్పించుకోవటానికి పనికిరావు అని గ్రహించాలి. ఎలాగూ తప్పించుకొనుటకు వీలులేని ఈ కష్టాలను, దుఃఖాలను తప్పక అనుభవించి తీరవలసిందే. కాకపోతే భగవంతుని బిడ్డగా - భగవంతుని భక్తునిగా వాటిని అనుభవిస్తుంటే తీవ్రత తగ్గుతుంది. ఎలా ? -
ఈ కష్టాలు దుఃఖాలు కలిగినప్పుడు వాటిని తలచుకొని కుమిలిపోకుండా, క్రుంగిపోకుండా ఇలా భావన చెయ్యి.
i) ఈ కష్టాలు కలకాలం ఉండవని, కష్టం తర్వాత వచ్చేది సుఖమేనని, కష్టసుఖాలు రెండూ రాకడ పోకడ కలిగినవని భావిస్తూ నిబ్బరంగా ఉండు. వచ్చే సుఖాన్ని తలచుకొంటూ ఉండు.
ii) కష్టాలనేవి మనుషులకు రాక మ్రానులకొస్తాయా? అని, అసలు కష్టాలు, దుఃఖాలు రాని, లేని మనుషులు ఎక్కడ ఉంటారు? అని భావించు.
iii) మనకు సుఖాలనేవి వచ్చినవంటే మనం పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఖర్చైపోతున్నదని - అలాగే మనకు కష్టాలు, దుఃఖాలు వచ్చినవంటే మనం పూర్వజన్మలలో చేసుకున్న పాపాలు ఖర్చైపోతున్నాయని తెలుసుకొని, మన పాపాలు తరిగిపోతున్నందుకు సంతోషించాలి. అలా భావించి, సంతోషిస్తూ కష్టాలను అనుభవించాలి. అప్పుడే బాధలో కూడా సౌఖ్యాన్ని దర్శించటం కుదురుతుంది. “బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” అనే సినీగీతాన్ని గుర్తుచేసుకో.
iv) కష్టాలు దుఃఖాలు మనకు భగవంతుణ్ణి గుర్తు చేస్తాయని; మనను భగవంతుని దగ్గరకు చేరుస్తాయని - అలాగే సుఖాలు గనుక అయితే మత్తు కలిగించి భగవంతునికి దూరం చేస్తాయని - విశ్వసించి - భగవంతుని దగ్గరకు చేర్చే కష్టాలే నాకు మంచిది అని భావిస్తే దుఃఖభారం తగ్గుతుంది.
‘అభినవ వ్యాస' 'జ్ఞాన ప్రపూర్ణ'
సద్గురు శ్రీ చలపతిరావుగారు
www.srichalapathirao.com
Source - Whatsapp Message

No comments:
Post a Comment