Wednesday, November 18, 2020

ఆనందసూక్తము - 4

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 72 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆనందసూక్తము - 4 🌻

అయితే ఆనందాన్ని చేరుకొనే త్రోవ ఏమిటి? ఆ మార్గము సేవ, త్యాగములలో ఉన్నవి. ఆనందానికి సేవ, త్యాగములే ప్రోత్సాహకాలు. అవి అర్థం చేసుకోవటానికి ఎన్ని జన్మలు, పునర్జన్మలో కాలాన్ని హరించటానికి.

ఆనందాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చని భావిస్తాము. అందుకై‌ పడరాని పాట్లు. అవసరమైనవి, ఆవశ్యకమైనవి కొనుక్కొనుటకు మాత్రమే ధనము అవసరమన్న సంగతి మరచిపోతాము.

మనకు అవసరాలు, కోరికలు ఎన్నో!! కోరికల కొరకు వస్తువులు కొనటం మొదలుపెడతాము, కోరిక అనేది‌ అడుగు‌ భాగం లేని పాత్ర అని గ్రహించం. పైగా దానిని డబ్బుతో నింపాలని యత్నించి, డబ్బు సంపాదిస్తూ పోతుంటాము. దానికై కార్యకలాపాలు‌ పెంచుకొంటాము. ఇదంతా ఎందుకంటే అనందంగా ఉండాలని ఉంది కనుక.

"ఆనందంగా జీవించాలనే దురదృష్టవంతునికి ఆనందంగా ఉండటానికి సమయమే చిక్కటం లేదు." అని పవిత్రగ్రంధాలు చెబుతున్నాయి.

ఆనందంగా ఉండటానికి ఏదో‌ ఒకటి చేయాలని అనుకుంటున్నప్పుడల్లా మనకు వైఫల్యమే మిగులుతున్నది. ఎందుచేతనంటే ఆనందమునకు, ఆనందాన్ని కొనగలిగిన మరో వస్తువు లోకంలో లేదు. నిజంగా కొనగలిగితే, అది ఆనందం కంటే విలువయినదయి ఉండాలి. దానిని అంగీకరిస్తే పిచ్చితర్కమని జాలిపడాలి. అంటే దారి తప్పనట్టు లెక్క.

ఇళ్ళతో‌కాని, అతి విలువగల వస్తువులని భావించేవానితో మనం ఆనందాన్ని కొనుక్కోటానికి యత్నిస్తుంటాము. అది టి.వి. కావచ్చు, సోఫాలు కుర్చీలు కావచ్చు. విద్యుత్ పరికరాలు కావచ్చు. అవి మనకు చెంది ఉంటాయి. కాని అవి మనము కాము.

ఆనందం ఒకనికి చెందిన వస్తువు కాదు. అది ఒక విప్పారటం- తెరుచుకోవటం. అది నువ్వే అని మరచిపోకు. పువ్వుకు, రేకకు ఉన్న సంబంధము, నీకూ ఆనందానికి ఉన్న సంబంధము ఒక్కటే. అంటే పువ్వు యొక్క రేకలు ఆ పువ్వుకు చెందినవి కావు. అవి పుష్పంలోని భాగాలే. అవి పుష్పము యొక్క ఏకత్వములోను, సమన్వయములోనూ ఉన్నవి.

...✍ మాస్టర్ ఇ.కె.🌹
🌹 🌹 🌹 🌹 🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment