Wednesday, November 18, 2020

నిత్య జీవితంలో విజ్ఞాన, ఉదయించే సూర్యుడిని అభినందించు

🌞 నిత్య జీవితంలో విజ్ఞాన🌻
🔆 2.ఉదయించే సూర్యుడిని అభినందించు🌞🌄☀️👏🏼

🔺 సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి అరగంట పాటు పాటలు పాడండి. ఒళ్ళు విరుచుకోండి. అరవండి. పెడబొబ్బలు పెట్టండి. ఆ శబ్దాలకు అర్థం ఉండాల్సిన పనిలేదు అది అస్తిత్వం ఉన్నవి అర్థవంతం కావాల్సిన అవసరం లేదు. మీరు వాటిని ఆనందించండి. అంతే దాని అర్థం అదే. మీరు అటూ ఇటూ కదలండి. అది ఉదయించే సూర్యుడికి అభినందంగా ఉండనీయండి. సూర్యుడు ఉదయించక వాటిని ఆగిపోనీయండి.

🔺 ఆ రోజంతా మీలో ఒక లయబద్ధమైన జ్ఞానాన్ని నింపుతుంది. ఉదయం మీరు ఆ స్థితిలో లీనమైన అప్పటినుంచి ఆ రోజంతా భిన్నమైన లక్షణంతో విలక్షణంగా వెలగడం మీరు చూడవచ్చు. మీరు మరింత ప్రేమగా, మరింత అనురాగం తో, మరింత ఆప్యాయతతో, మరింత స్నేహంగా, ఉంటారు. నీలో తక్కువ ధైర్యం తక్కువ కోపం తక్కువ కాంక్ష తక్కువ అహం కనిపిస్తాయి.

🔺 కట్టెలు కొట్టే వ్యక్తి కి రాళ్ళు పగలగొట్టే వ్యక్తికి ఉద్వేగ క్షాళన అవసరం లేదు - రోజంతా వాళ్లు చేసేది అదే. కానీ ఆధునిక మానవుడికి పరిస్థితులు మారాయి.
🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment