Thursday, November 19, 2020

యమ నియమాలు

🕉️☀️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️☀️🕉️

☀️ తులసి దళం☀️

(బ్రహ్మర్షి పితామహ పత్రీజీ)

19-11-2020

"యమ నియమాలు"

✨" యమం "అంటే,
" నియంత్రణ ",
" కంట్రోలు" ;
మౌలిక ఆధ్యాత్మిక - జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి పతంజలి మహర్షి అయిదు యమాలను ప్రవచించారు అవి
సత్యం : ఎప్పుడూ ఆత్మ సత్యాన్నే పలకడం
అహింస : హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం
బ్రహ్మచర్యం : ఎప్పుడూ మధ్యేమార్గాన్నే అవలంబించడం
ఆస్తేయం : ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం
అపరిగ్రహం : అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం

💫“ నియమం " - అంటే తప్పనిసరి దైనందిన కార్యకలాపాలు
మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి
పతంజలి మహర్షి అయిదు నియమాలను ప్రవచించాడు .. అవి :
శాచం : శరీరాన్నీ, పరిసరాలనూ శుచిగా, శుభ్రంగా
వుంచుకోవడం
సంతోషం : మనస్సును ఎప్పుడూ ఉల్లాంసంగా
వుంచుకోవడం
స్వాధ్యాయం : చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను సదా
చదువుతూ వుండడం
తపస్సు : నిద్రాహారాదులను క్రమక్రమంగా తగ్గిస్తూ
వుండడం
ఈశ్వరప్రణిధానం : “ అంతా ఈశ్వరమయమే ” అన్న భావనలో సదా వుండడం

💫యమ నియమాలు భౌతికజీవనంలో హస్తగతం కావాలి అంటే నిత్య, అనునిత్య యోగం, ఆధ్యాత్మిక జ్ఞానం వినా వేరే శరణ్యం లేదు
🔺 " పతంజలి మహర్షి ! శతకోటి నమస్కారాలు !
కరిష్యే వచనం తవ ! "

🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺🧘🏼‍♀️🔺🧘🏼‍♂️🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment