Friday, November 20, 2020

ఇష్టాఇష్టాలు - బంధాలు..

🍀🌸💖🌲🧚‍♀️🌲💖🌸🍀

🌸 ఇష్టాఇష్టాలు - బంధాలు.. 🌸

🌸 మనకోసం మనతో ఉన్న బంధాలు అన్ని మనం తోడు తెచ్చుకున్నవే... కానీ మనకు మొదట అభిప్రాయభేదాలు వచ్చేది కూడా వీరితోనే.. ఆమ్మానాన్నలు దగ్గర నుండి అక్క, చెల్లి తమ్ముడు, బామ్మ, తాతయ్య వరకు ఇంట్లో అయితే... స్నేహితులు, బంధువులు, పక్కింటివారు వరకు మనం చిన్నప్పటి నుంచి వీరితో పేచీ పడకుండా కుదరదు... వీరందరితో మనకు ఉన్న బంధం ఏదైనా ఆంతర్లీనంగా ఉన్నది ప్రేమే.. ప్రేమ ఉన్నచోట మనది అని భావన ఇష్టాఇష్టాలను చూపిస్తాం... ఇక్కడే మళ్ళీ పేచీలు పెడతాం... మళ్ళీ సద్దుకుపోతాం... అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నమో అది మనకు అవసరమే... అంటే మనము ఎన్నుకొచ్చిందే... రాజీ పడకపోయిన అక్కడే ఉండాలి... అది ఇష్టాఇష్టాలను దాటి ఉంటుంది... మనకు ఓ అభిప్రాయం ఏర్పడాలి అంటే దానికి తగ్గ అనుభవం కోసమే మనం వారితో ఉన్నాం.. అక్కడ ఎన్ని సవాళ్లు ఎదురైన నిలబడి ఎదుర్కోవాలి లేదంటే అలాంటి సవాళ్లే పదే పదే వస్తాయి... ఇవన్నీ మనకు ఒక రూపు, గుణం, మన శక్తికి పదును పెట్టె చోటు అనుకోవచ్చు..

🌸 ఇక్కడనుంచే మన భూలోక యాత్ర మొదలు... ఎప్పుడైతే జీవితంలో అడుగు పెట్టమొ అప్పటినుంచి ఇష్టాఇష్టాలు మారుతూ పెరుగుతు వస్థాయి... 10 తరగతి వరకు ఇష్టాఇష్టాలు తల్లిదండ్రుల భావాలతో ముడిపడి ఉంటాయి... తరువాత కాలేజి వాతావరణం లో నేర్చుకునేది ఆలోచించేది ఎక్కువ.. ఇక్కడ మన జీవిత పునాది మనమే వేసుకుంటాం దానికి తగ్గ అడుగులు వేస్తూ అందులో ఇమిడిపోయే వారిని కలుపుకుంటు వ్యతిరేకించే వారిని దాటుకుంటూ నడుస్తాం.. ఇక్కడ మన అసలు కథ మొదలు.. ఎందుకంటే గమ్యాన్ని బట్టి మారే ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు మన జీవితాన్ని నిర్ధేశిస్తాయి...
అంటే బాగా చదువుకోవడం అంటే లైబ్రరీ... మంచి ఆటగాడు ప్లేగ్రౌండ్, రాజకీయాలు అంటే బాక్ బెంచ్, జీవితాన్ని సరదాగా తీసుకుంటే సినిమాలు... చక్కటి వ్యక్తిత్వం కోసం ధ్యానాలయాలు ఇలా మారిపోయే ఇష్టాఇష్టాలు పెళ్లి వరకు ఉంటాయి... తరువాత కథలో కొత్త పాత్రలు ప్రవేశం మళ్ళీ ప్రేమ, పేచీ, సర్దుబాట్లు మొదలు...ఇవన్నీ కూడా మనకు అనుభవ జ్ఞానం ఇచ్చే వేదికలు...

🌸 ఇక్కడ మనకు కావలసింది ఈజీగా దొరికితే అక్కడ ఏ భావం పండదు... మనకు సరదాగా జరిగిపోయేవి చాలామందికి కల లాంటివి... వాళ్లకు అపురూపం... మనకు అపురూపమైనవి మనం ఒకరకంగా యుద్ధం చేసి పొందేవే... అవే అనుభవాలుగా రూపుదిద్దుకుని మన భవిష్యత్ కు చక్కటి దారులు ఏర్పరుస్తాయి... మనం ఎవరిమీదనైతే కోపం చూపిస్తామో వారు చాలా దగ్గరగా ఉన్నారు మన బావాలకు.. ఒకే భావాన్ని ఇద్దరు తమ తమ దృష్టితో చూస్తేనే అభిప్రాయం కుదరదు... ఇక్కడ పేచీపడి కొండెక్కి కూర్చకుంటాం... సహజంగా భార్యాభర్తల మధ్యా జరుగుతూ ఉంటుంది... తర్వాత ఎదిగి వచ్చిన పిల్లల దగ్గర మంచి స్నేహితుల మధ్యలో జరిగేది ఇదే... వీల్లే అభిప్రాయం కుదరక శత్రువులుగా ప్రవర్తిస్తారు.. కానీ దీనికి సమాధానం మాత్రం కొంచెం సహనంగా ఉంటే భార్యాభర్తల, పిల్లల తోను సయోధ్య కుదురుతుంది... కానీ స్నేహితులతో కుదరాలి అంటే మూడో వ్యక్తి రానంతవరకు ok... మూడో వ్యక్తి రాగానే జడ్జిమెంట్స్ మొదలై చీలికలు వచ్చేస్తాయి... అక్కడ లేని శత్రువు జీవితంలోకి ప్రవేశిస్తారు... వస్తూనే మనలో ఎరుకను నిద్రలేపి... ఎక్కడైతే బలహీనంగా ఉంటామో అక్కడ ఆ పాఠాన్ని నేర్పి వెళతారు... అంటే సహనాన్ని మనం మన దగ్గిరవారి దగ్గర నేర్చుకునేది కొద్దిపాటిదే కానీ ఎరుకతో నెర్చుంటేనే అది మనలో స్థిరపడి మన జీవితానికి మార్గదర్శి అవుతుంది...

ఇప్పటికి ఇది...

Thank you...🌸🌸🌸

🍀🌸💖🌲🧚‍♀️🌲💖🌸🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment