Sunday, December 6, 2020

మంచిమాటలు

బుధవారం --: 04-11-2020 :--
ఈ రోజు AVB మంచిమాటలు ...

మంచి మనసుతో చేసిన సహాయం మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికి వృధా కాదు మంచి తనానికి డబ్బుతో పని లేదు మంచి మనసుంటే చాలు స్నేహానికి చుట్టరికం అక్కల్లేదు మనసులోని భావాలు కలుస్తే చాలు నీకు నచ్చినట్లు బతకాలంటే దైర్యం కావాలి , ఎదుటి వారికి నచ్చేలా బతకాలంటే సర్దుకు పోవాలి , ప్రపంచంమంతటికి నువ్వు నచ్చలంటే చిరునవ్వుతో బ్రతకాలి .

మనం డబ్బుతో పొందగలిగింది ఏదీ మనకు శాశ్వతం కాదు కానీ మనసుతో పంచే స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి నేస్తమా !

మనం ప్రయశ్నించనిదే మనకు సమాదానం దొరకదు అలాగే మనం ప్రయత్నించనిదే మనకు విజయమూ దక్కదు .

మనకున్న కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువుండదు .

కోపం , బాధ , ప్రేమ ఇవి అందరిమీద చూపించలేం , మనం ఇష్టపడే వారి మీద , ప్రేమించే వారి మీద మాత్రమే చూపించ గలం , మీరెంత తిట్టినా బాధపెట్టినా మీ కోసం ఏదైనా భరిస్తారు . అలాంటి వారిని వదులుకోకండి మిరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుంచుకోండి ‌.

సేకరణ ✒️ *మీ ... AVB సుబ్బారావు 🛕🤝💐🌷🕉️🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment