కోపం వలదు...
““““““““””””””””
కోపం మంచి వాళ్ళకి వచ్చినా....
చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులని బాధిస్తుంది.
చందనం చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒక్కలాగే దహించి వేస్తంది కదా?
కోపం అగ్ని లాంటిదన్న మాట.
అది ఇతరులనే కాదు,
మనలనీ దహించి వేస్తుంది.
అందుకే పెద్దలు శాంతంగా ఉండండర్రా అని చెబుతూ ఉంటారు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష,
దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
అని బద్దె భూపతి చెప్ప లేదూ?
కోపం వలన తపస్సు చెడి పోతుంది. అణిమాది సిద్ధులు పనికి రాకుండా పోతాయి. కోపం ధర్మ విధులకు ఆటంకం కలిగిస్తుంది. మునులకు కోపం తగదు.
చీటికీ మాటికీ వెర్రి కోపంతో ఊగి పోతూ శాపాలిచ్చే దూర్వాస ముని తెలుసు కదా?దాని వలన అతని
తపో ఫలితమంతా హరించుకు పోయేది.
అందు చేత కోపం తగ్గించు కోవడం మంచిది.
కోపం వల్ల ఎంత వినాశం జరిగిందో చెప్పడానికి మన పురాణాలలోనూ, కావ్యాలలోనూ ,ప్రబంధాలలోనూ అసంఖ్యాకమైన వృత్తాంతాలున్నాయి.
అవన్నీ నేను చెప్పడం మొదలు పెడితే చదవడానికి విసుగు వేసి మీకు కోపం రావచ్చు.
మీ.... మోహన్
Source - Whatsapp Message

No comments:
Post a Comment