Tuesday, January 19, 2021

ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి

శ్రీనివాస సిద్ధాంతి.9494550355

ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి

నిలబడి ఉన్న లక్ష్మి దేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు.కూర్చుని ఉన్న ఫోటో ని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మి దేవి బొమ్మను కాని ఫోటో ని గాని దర్వాజాలకు దగ్గరగా ఉంచరాదు. గృహం వెలుపల ఉంచరాదు. లక్ష్మి మాత ఫోటో ను పూజ మందిరం లో ఉంచుట మంచిది.
వ్యాపారస్తులు చాలామంది వారి వారి వ్యాపారాలకు లక్ష్మి దేవి పేరు ను పెడతారు. ఈ సందర్భంలో చాలామంది తమ వ్యాపారాల బోర్డ్ ల పై లక్ష్మి మాత బొమ్మను ఉంచుతారు. ఇది మంచిది కాదు. ఈ విధంగా చేస్తే ఆ వ్యాపారాలు తీవ్ర నష్టాలకు లోనై వ్యాపారం అమ్మివేయడం జరుగుతుంది..తీవ్ర నరఘోష తో బాధపడేవారు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఫోటోను గృహం లో ఉంచి ప్రతి రోజు అర్చించాలి. శుక్రవారం రోజు విశేష పూజా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతను కోరెవారు శ్రీరామపట్టాభిషేకం ఫోటో ను గృహం లో ఉంచాలి. ఇంటి ఎలివేషన్ పై కూడా ఈ ఫోటో ను ఉంచాలి.అనేక భయాలతో బాధపడేవారు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని ఉంచుకోవాలి. శని, మంగళ వారాలలో విశేష పూజ చేయాలి. నెలకు 1 మంగళవారం అయిన హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేయాలి.
సుఖప్రదమైన వివాహ జీవితానికి ఉమామహేశ్వరుల ఫోటోను గృహంలో ఉంచాలి. ఉమా మహేశ్వరుల ఫోటో ను గృహం లో ఉంచి సోమ, శుక్ర వారాలలో విశేషపూజ చేయాలి.
మంచి ఆరోగ్యం కోసం లక్ష్మీనారాయణుల ఫోటో ను ఉంచాలి. అదే విధంగా అన్నిటా జయం, సర్వత్ర అభివృద్ది కొరకు శ్రీ లలిత దేవి ఫోటో ను ఉంచి పూజించాలి. ప్రతిరోజూ శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రం గృహం లో పారాయణ చేస్తే సకల మంగళ ప్రదంగా ఉండి, సుఖశాంతుల లభిస్తాయి.
దేవును విగ్రహాలను గృహంలో ఉంచితే నిత్య పూజ తప్పనిసరి. 6 అంగుళాల లోపు ఉండే విగ్రహాలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చు. అయితే పెద్ద విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు. శని సింగన పూర్ నుండి తెచ్చిన శని యంత్రాలు ఇంట్లో ఉంచరాదు. నాడా, నల్లని విగ్రహం . ఇంట్లో ఉంచరాదు.
ఈ విధంగా ఆలోచించి విజ్ఞుని సలహా మేరకు గృహంలో దేవుని ఫోటోలు, విగ్రహాలు పెట్టుకొంటే మంచి అభివృద్ది ఉంటుంది.

జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును. జాతక చక్రం post ద్వారా పంపబడును. ద్విస్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.
9494550355
plz forward the message🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment