Sunday, January 24, 2021

జీవిత సత్యాలు

జీవిత సత్యాలు
1) నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.

2) నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది అని వెతకకు, అది నీ అంతరంగంలోనే అంతర్యామి అయిన అంతరాత్మలోనే ఉంటుంది.

3) సంతోషానిచ్చేది , సంపదలు , అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే.

4) నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.

5) మన సమస్యలకు , మన దుఃఖాలకు , మన బాధలకు పరిస్కారాలు మన దగ్గరే ఉంటాయి , కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము.

6) సంతోషం అనేది ఎంతో మధురమైనది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.

7) విజయం సాధించడములో ఎవరు నిన్ను మోసము చేయలేరు-నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్ప.

8) నీలో ఉన్న శక్తిని నీవు తెలుసు కున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో.

9) నిన్ను నీవు విమర్శించించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది.

10) నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో.

11) నిన్ను నీవు మోసాగించు కున్నంతగా , ఇంకొక రెవరూ నిన్ను మోసాగించరు.

12) దేని నైనా ఆశించబోయే ముందు అందుకు కావలిసిన అర్హతను సంపాదించుకో – తనను తానూ జయించు కోగల వ్యక్తీ అన్నింటిని జయించగలడు.

13) దీపము తానూ వెలుగుతూ ఉంటేనే మరో దీపాన్ని వెలిగించ గలదు.

14) నీమీద నీకు నమ్మకం పెరుగు తున్నప్పుడు, నీ సమర్ధత కూడా పెరుగతుంది.

15) అనుభవం నుంచి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది👌

Source - Whatsapp Message

No comments:

Post a Comment