Saturday, February 6, 2021

మంచి మాట... లు

ఆత్మీయ బంధుమిత్రులైన మీకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు, పూజ్య గురుదేవులు ఆదిశంకరాచార్యులు, గురు రాఘవేంద్ర స్వామి వారు, గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు సాయి నాధునిఅనుగ్రహం తో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... మీ AVB 💐💐💐💐💐
తినటం కోసం బతకకుండా బతకటం తింటే ఆరోగ్యం గా ఉంటాము మన మనసు ను ప్రశాంతంగా ఉంచుకోగలిగితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాము
గురువారం --: 04-02-2021 :--
ఈ రోజు AVB మంచి మాట... లు
మనం ఎంత మందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...

ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు , రెండింటిని సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు .

మనం ఎదుటివారిని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో గలరు . మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండక పోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికి గుర్తుండి పోతాయి .

మనకు బాధల్ని మిగిల్చే బంధుత్వాల కంటే ప్రశాంతతను ఇచ్చే ఒంటరితనము గొప్పది . అవసరాలకు పలకరించే పలకరింపుల కంటే బాధల్ని తగ్గించే కన్నీళ్లే గొప్పవి . అవసరాల్ని తీర్చే ఆస్తులు కంటే ఆకల్ని తీర్చే అన్నం గొప్పది .

మిత్రమా ! నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వారికి దూరంగా ఉండు కానీ ! ద్రోహం చేయాలని చూడకు ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చేయాలి అనుకుంటావో నీకు తిరిగి ఎదో రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుందని తెలుసుకో.

సేకరణ ✒️*మీ ... AVB సుబ్బారావు 🌷💐🤝🕉️🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment