Wednesday, February 17, 2021

మంచి మాటలు

ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయం శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రధమ పూజ్యుడు లంబోదరుడు, ఏకదంతుడు వినాయకుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ AVB సుబ్బారావు 🙏
బుధవారం --:
17-02-2021 :--
ఈనాటి
AVB మంచి మాటలు
జీవితం
సాఫీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది కానీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది .

నీలో
రక్తం చుక్కలు చిందికుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకర ఆయుధం మాట దానిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు తెలివైనవారు ఆలోచించి మాట్లాడుతారు .

మనకు మనస్సులో
సంతోషం లేనపుడు నువ్వు ఏడంతస్థుల మేడలో ఉన్నా ఏమీ లేని గుడిసెలో ఉన్నా ఒకటే ! . మనస్సులో ఓర్వలేనితనం ఉన్నప్పుడు నువ్వు ఏడుకొండలు ఎక్కినా ఏడుస్తూ పూజచేసినా ఒక్కటే .

నీకున్నదంతా
ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు . ఇచ్చే గొప్ప ఆవకాశాన్ని నువ్వే వాడుకో . ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు .

సేకరణ ✒️
మీ .. AVB సుబ్బారావు💐🌷🕉️🤝🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment