మహిమలున్న రాయి
🎊💦🌈🌹🎈🦚🍇
వారణాసిలో ఉంటున్న శివరాం కు పురాతన కాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది.
అతడా పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు.
గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయనీ, స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందనీ అక్కడ రాసుంది.
వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లకోసం వెతకడం ప్రారంభించాడు శివరాం.
ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది.
నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు..
అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు.
రెండు వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు.
తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో - శివరాం ఎంతో నిరాశ చెందాడు.
ఒక్కోరాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు.
చివరకి అతడికది అలవాటుగా మారింది
వెతగ్గా వెతగ్గా ఓ రోజు మహిమలున్న వెచ్చనిరాయి అతడి చేతికి దొరికింది.
ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు.
రాయి చేతినుంచి జారిపోయే ఆఖరు క్షణంలోగానీ అతడా విషయాన్ని గమనించలేదు.
అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.
శివరాం శ్రమంతా వృధా అయిపోయింది.
నీతి: అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలే తప్ప ఏమాత్రం ఆలక్ష్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి.
చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
స్వాతి కార్తె యందు వర్షపు బిందు చిప్పయందు పడినచో ముత్తెమగును. నీటియందు పడినచో నీటిలో కలిసిపోవును, కనుక ప్రాప్తి ఉన్నచో అదృష్టము ఎక్కడికీ పోదని భావం.
🌹🌷🌹🌷🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment