Monday, March 29, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయం శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ..
శని వారం --: 27-03-2021
ఈ రోజు AVB మంచి మాట.. లు
జీవితంలో ఆనందంగా మనం ఉండాలంటే ఆస్తులు ఉండవలసిన అవసరం లేదు . మనమే ఒక ఆస్తిగా భావించే ఓ తోడు ఉంటే చాలు . జీవితంలో బాధలు లేకుండా ఉండాలంటే బంగ్లాలు , కారులు ఉండవలసిన అవసరం లేదు . మనకు బాధే తెలియకుండా చూసే ఓ బంధముంటే చాలు .

ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసినా మనిషి చనిపోగానే తిరిగి రమ్మని , బతికి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకుని బోరున ఏడుస్తాం అంత ప్రేమ మనిషి బతికుండగా చూపించరు ఎందుకని ? .

మనం నవ్వినా కన్నీళ్లు వస్తాయ ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి కానీ ! మనల్ని నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటాడు , కాని మనల్ని బాధపెట్టినా వారు బతుకంతా గుర్తుంటాడు .

తనవరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది . అనుభవమే మనిషికి గుణపాఠం .

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏
📞9985255805

Source - Whatsapp Message

No comments:

Post a Comment