Monday, April 19, 2021

ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు వస్తే ఏమి చెయ్యాలి?

🌸ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు వస్తే ఏమి చెయ్యాలి?🌸

🌺ముందుగా ఆలోచనలను గురించి కొంత స్పష్టత తెక్చుకుందాం:

🌷మొట్టమొదటగా, ఆలోచనలు చెడ్డవి కావని తెలుసుకోవాలి. ఆలోచనలు లేకపోతే జీవితమే లేదు. ఆలోచనతోనే మనిషి మనుగడ సాగేది. మన మనుగడ సాగడానికి మనకు మంచి ఆలోచనలు అవసరం.

🌷అయితే ఈ ఆలోచనల్లో నకారాత్మకమైన ఆలోచనలు, సకారాత్మకమైన ఆలోచనలు, దివ్యమైన ఆలోచనలు అన్నీ ఉంటాయి.మన ఆధునిక మానసిక శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం, మనిషికి ప్రతి రోజూ సుమారు 70, 000 కు పైగా ఆలోచనలు వస్తాయి. అందులో అరవై శాతం పనికిరాని నకారాత్మకమైన ఆలోచనలే ఉంటాయి. ఇవి మన శక్తిని పీల్చేస్తాయి. నకారాత్మకమైన ఆలోచనలు చాలా బరువైన ఆలోచనలు.

🌷ఈ ఆలోచనలన్నీ పుట్టేది మనసులోనే. అందుకే మనసును క్రమశిక్షణలో పెట్టడం అవసరం. దానికి ద్యానం తప్ప మరో మార్గం లేదు.

🌷అయితే ఈ ఆలోచనలు కళ్ళు తెరచి ఉన్నప్పుడు కంటే కూడా మూసుకున్నప్పుడే ఎక్కువగా వస్తున్నట్లు అనిపిస్తాయి. కాని ఇది వాస్తవం కాదు. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా అలాగే వస్తుంటాయి కాని మనం లోపలికి చూడకపోవడం మూలాన లేనట్లనిపిస్తాయి.

🌷మన ఇంద్రియాలన్నీ బయట వస్తువులను గమనించడమే అలవాటు మూలాన, లోపలికి అంతరంగ లోకి చూడటం అలవాటు లేకపోవడం మూలాన కూడా ఈ ఆలోచనలు భంగపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది.

🌷ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం కాబట్టి, మిగిలిన అన్ని ఇంద్రియాలను మూసివేస్తాం కాబట్టి అవి ధ్యాన భంగం విపరీతంగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

🌷మనం కళ్ళు మూసుకొని హృదయంలో దివ్యమైన వెలుగు ఉందన్న ఆలోచనతో కూర్చున్నప్పుడు, అన్ని రకాల ఆలోచనలు దండేత్తి రావచ్చు. వాటిపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే, వాతంతట అవే రాలిపోతాయి.

🌷ఆలోచనలకు స్వతహాగా వాటికి శక్తి ఉండదు. మనం వాటిపై దృష్టి సారించినప్పుడే వాటికి మనం బలం ఇచ్చినవాళ్ళమవుతాం. అందుకే వాటిని పట్టించుకోకుండా ఉంటే అభ్యాసం చేయగా-చేయగా వాటంతట అవే రాలిపోతాయి. కొన్ని రోజులకు బాగా తగ్గిపోతాయి.

🌷వాటిని పిలువకుండా వచ్చిన అతిథులుగా భావించాలి. అవే తగ్గిపోతాయి, అంటారు. నిర్లక్ష్యం చేయడమే దీనికి ఏకైక ఆయుధం.

🌷ఆలోచనలతో పోరాడవద్దు, ఆపే ప్రయత్నం చేయకూడదు; రానివ్వండి, కాని వాటిని పట్టించుకోకండి. ఇది అభ్యాసం వల్ల కొన్ని రోజుల్లోనే పట్టు వస్తుంది. అభ్యాసం చాలా చాలా చాలా అవసరం.

మీ రామిరెడ్డి మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment