పదునైన ఆయుధం
అనగనగా ఒక రాజు తన ప్రజలని సంతోషపెట్టే విషయముల గురించి తెలుసుకుందామని అనుకున్నాడు.
అందుకోసమని ఒక ప్రదర్శనని ఏర్పాటు చేసి ,తమ రాజ్యంలోని తెలివైన వారిని ఆహ్వానించాడు. వారిని ఆ ప్రదర్శనకి ప్రజలని సంతోషపెట్టే వస్తువులని తీసుకురమ్మని ఆదేశించాడు.
తాను స్వయంగా ప్రదర్శనని చూద్దామని వెళ్ళాడు.
అక్కడ ఎన్నో కనువిందు కలిగించే పూలు,పండ్లు ,మొక్కలు,మిఠాయిలు,బట్టలుసంగీత వాయిద్యములు,బంగారు నగలు,చిత్ర కళలు ఇలా ఎన్నో వస్తువులను చూశాడు.
కానీ ఇవేవి ప్రజలకి ఆనందం కలిగిస్తాయని రాజుగారికి అనిపించలేదు.
చివరకి అక్కడ బంక మట్టి తో చేయబడ్డ ఒక రంగుల శిల్పం ఆయన కంట బడింది.అది ఎంతో ఆకలితో , నాలుకబయిటకి తెరుచుకుని ఉన్న ఒక ముసలి మనిషి శిల్పం . శిల్పం కింద “మంచి నాలుక” అని రెండు పదాలు చెక్కడబడి ఉన్నాయి.
రాజు గారు ,శిల్పిని పిలిపించి ,శిల్పాన్ని ఎందుకలా వింతగా చెక్కావని అడిగారు . దానికి జవాబుగా ఆ శిల్పి,”రాజా ,ఈ ప్రదర్శనలో ఉన్న ఇతర వస్తువుల వల్ల కలిగే సంతోషము తాత్కాలిక మైనది. కాని, దయ మరియు ప్రేమపూరితమైన మాటలు పలికే ఒక మంచి నాలుక ,మనని ఎన్నో ఏళ్ల వరకు ఆనందంగా ఉంచగలదు . మంచి నాలుక మాట్లేడే మాటలు బాధలో ఉన్న వారిలో ఆశ,మరియు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నిర్బలులలో ధైర్యాన్ని,.ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అనాధులకి ప్రేమ ,జాలి అందిస్తాయి.కనుక ఒక మంచి నాలుక మటుకే అందరినీ అన్నివేళలా ఆనందంగా ఉంచగలదు”, అన్నాడు.
శిల్పి ఆలోచనా విధానాన్ని ప్రశంసిస్తూ రాజుగారు అతనికి ఒక కుండ నిండా బంగారు నాణాలను బహూకరించారు.
మరి కొన్ని రోజులు గడిచాక రాజుగారు మనుషులని బాధపెట్టే విషయములేమిటి అని తెలుసుకుందామని మరొక సారి ఒక ప్రదర్శనని ఏర్పాటు చేయమని ఆదేశించారు. మళ్ళీ రాజ్యంలోని మేధావులని పిలిపించి ఆ ప్రదర్శనలో మనుషులకి బాధను కలిగించి, వారి జీవితాన్ని విషాదంలో ముంచెత్తే వస్తువులని ప్రదర్శించమని కోరారు.
రాజుగారి ఆదేశానుసారం మేధావులు ప్రదర్శనలో కత్తులు,ఖడ్గములు ,కొరడాలు,మధ్యపానము, విషము ,మొరిగేకుక్కలు ఇలా మనుషులకి ఇబ్బందిని , కీడుని కలిగించే వస్తువులని ఉంచారు.
కాని ,ఏ వస్తువులు కూడా రాజుగారిని సమాధానపరచలేదు.
చివరికి ఆయనకి ఇదివరకు లాగానే బంకమట్టితో చేయబడ్డ ఒక మనిషి విగ్రహం కనిపించింది.
ఈ సారి అది కోపంతో మండుతున్న ఎర్రటి కళ్ళు మరియు నల్లటి నాలుక ఉన్న ఒక విగ్రహము. అతను , ఆకలితో బాధపడుతున్న ఒక పేదమనిషిని తిట్టిపోస్తున్నాడు. దాని కింద “చెడు నాలుక” అని రెండు పదాలు చెక్కబడి ఉన్నాయి.
శిల్పిని పిలిచి రాజుగారు ,అటువంటి శిల్పాన్ని ఈ ప్రదర్శనలో ఉంచడం వెనుక కారణమును వివరించమని అడిగారు.
దానికి జవాబుగా శిల్పి,”రాజా! ఒక చెడు నాలుక, మనుషుల ఆనందాన్ని ఆశని,ఉత్సాహాన్ని,ధైర్యాన్ని నశింపచేసి వారిని విషాదంలో ముంచేస్తుంది.
చెడునాలుక మనిషుల హృదయాన్ని ఎంత గాయపరుస్తుందంటే ,కొన్నేళ్ల తరవాత కూడా ఆ గాయం మానటం చాలా కష్టము. అందుకే చెడు నాలుక మనిషికి అన్నిటికంటే బద్ధ శత్రువు.
రాజుగారు శిల్పి సమాధానాన్ని మెచ్చుకుని అతని ఆలోచనని ప్రశంసిస్తూ అతనికి కుండనిండా బంగారు నాణాలు,వజ్రములు బహూకరించారు.
అంతే కాకుండా శిల్పి చెక్కిన ఈ విగ్రహములు తనకి ఎంతో విలువైన పాఠములు నేర్పాయని మెచ్చుకున్నారు.
నీతి :
చెడు తలంపులు, మాటలతో ఇతరులకి బాధ కలిగించడం వారిని హింసించడమే అవుతుంది.అటువంటి మాటల వలన కలిగే గాయములు ఒక పట్టాన మానవు.
కానీ, ప్రేమతోతీయగా మాట్లాడే మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే ఇతరులని ఎల్లప్పుడూ ఒప్పించలేకపోయినా,వారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు. దయగల హృదయంతో మధురంగా మాట్లాడటం నేర్చుకోవాలి*
ఈ ప్రపంచంలో నాలుకకు మించిన పదునైన ఆయుధం ఇంకొకటి ఏదీ లేదు. ఇది మనిషి యొక్క గౌరవ మర్యాదలను పెంచగలదు, తగ్గించగలదు. రాజ్యాధికారం లను తెచ్చి పెట్టగలరదు రాజ్యాధికారం లను పోగొట్ట గలదు, హరిశ్చంద్రుని కోసం
దేవతలను సైతం భూమి మీదకి తీసుకు వచ్చినది ఈ నాలుక యే, దుర్యోధన వంటి మహా చక్రవర్తిని కూడా దిక్కు లేని చావు చచ్చేటట్టు చేసింది,
సీతాదేవి వంటి మహా ఇల్లాలు
అష్ట కష్టాలపాలు చేసింది చాకలి వాడి నాలుక యే,
దీని అదుపు గాను వాడుకుంటే
ఎన్నో మంచి పనులు చేసి పెడుతుంది, లేదంటే మన వినాశనానికి పునాదులను కూడా నిర్వహిస్తుంది. వాడుకున్న వారికి వాడుకున్నంత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
Source - Whatsapp Message

No comments:
Post a Comment