Friday, June 11, 2021

రెండు వాస్తవ కథలు

రెండు వాస్తవ కథలు: చదివిన తర్వాత మీ జీవన విధానంలో మార్పు వస్తుంది....

మొదటి కథ:

శ్రీ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా రాష్ట్రపతి అయిన తర్వాత ఒకరోజు (వారి సురక్ష బలంతో కలిసి )వారి అంగరక్షకులతో కలిసి హోటల్ కు భోజనంకు వెళ్తారు. అందరు కూడా వారికి ఇష్టమైన పదార్థాలను ఆర్డర్ ఇచ్చి వాటి రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నారు.
అదే సమయంలో మండేలా గారి సీటుకు ముందు ఉన్న సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి భోజనం రాకకై ఎదురు చూస్తున్నారు. మండేలా తన అంగరక్షకులతో చెప్పి ఆ వ్యక్తిని కూడా వారి టేబుల్ దగ్గరికి పిలిపించుకున్నాడు. తర్వాత భోజనం వచ్చింది, అందరూ భోజనం చేస్తున్నారు. ఆ వ్యక్తి భోజనం చేస్తున్నాడు కానీ చేతులు వణుకుతున్నాయి. భోజనం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తల కిందకి పెట్టుకొని హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత మండేలా గారితో వారి అంగరక్షక అధికారి ఆ వ్యక్తి అనారోగ్యంతో వణుకుతున్నాడు అని చెప్పారు. అప్పుడు మండేలా గారు అది కాదు నేను జైల్లో ఉన్నప్పుడు పని చేసిన జైలు అధికారి అతను..... నన్ను రోజంతా నానా రకాలుగా హింసించేవారు. ఆ బాధలు భరించలేక దాహం వేసి నీళ్ళు అడిగితే ఇతడు నాపై మూత్రం పోసేవాడు.
ఇప్పుడు నేను రాష్ట్రపతిని అయ్యాను. నేను కూడా అతని లాగానే వ్యవహరిస్తనేమోనని ప్రతీకారము తీర్చుకుంటానేమోనని భయపడినట్లు ఉన్నాడు కానీ నా స్వభావము అది కాదు. “ ప్రతీకారం తీర్చుకోవాలనే భావన వినాశనమునకు దారితీస్తుంది. ధైర్యం మరియు సహిష్ణుత కలిగిన మానసిక స్థితి వికాసానికి దారితీస్తుంది"


రెండవ కథ:

ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న రైలులో సీటు కింద దాగి ఉన్న అమ్మాయిని.... నీ టికెట్ ఎక్కడ ఉందని టి. సి అడుగుతాడు?. అమ్మాయి వణుకుతూ భయపడుతూ నా దగ్గర టికెట్ లేదు సార్ అంటుంది. లేకుంటే దిగిపో అంటాడు టి. సి . వెనక నుండి ఒక యాత్రికురాలు ఉషా భట్టాచార్య వృత్తిరీత్యా ప్రొఫెసర్. ఆ అమ్మాయికి టిక్కెట్టుకు డబ్బులు నేను ఇస్తాను సార్...
ఉషా జి: నువ్వు ఎక్కడికి వెళ్లాలి?
పిల్ల: తెలియదు మేడమ్!
ఉషా జి: అయితే నాతో రా బెంగళూరు దాకా!
ఉషా జి: నీ పేరు ఏంటి?
పిల్ల : చిత్ర
బెంగళూరు చేరుకున్న తర్వాత తెలిసిన స్వచ్ఛంద సంస్థతో మాట్లాడి ఆ అమ్మాయికి వసతి, ఒక మంచి పాఠశాలలో చదువు కొరకై చేర్పిస్తుంది.
ఉషా జి కి త్వరలోనే ఢిల్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని కారణంగా చిత్ర తో సంబంధం తెగిపోతుంది. అప్పుడప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడడం జరుగుతుండేది.
సుమారు 20 సంవత్సరాల తర్వాత ఉషా గారు శాన్ ఫ్రాన్సిస్కో( అమెరికా) ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళవలసివచ్చింది. ఉపన్యాసం తర్వాత హోటల్ లో బిల్ చెల్లించడానికి రిసెప్షన్ దగ్గరికి వెళితే అప్పటికే వారి వెనక నిలబడిన దంపతులు చెల్లించినట్లు తెలిసింది.
ఉషా జి : "నా బిల్లు మీరెందుకు చెల్లించారు"
" మేడం ముంబై నుంచి బెంగళూరుకు తీసుకున్న రైలు టికెట్ ముందు ఇదేం పెద్ద విషయం కాదు"...
ఉషా జి: "అరే చిత్ర"
చిత్ర ఎవరో కాదు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా మూర్తి మరియు ఇన్ఫోసిస్ కంపెనీ సంస్థాపకులు నారాయణ మూర్తి గారి భార్య..
ఈ చిన్న కథ సుధా మూర్తి రాసిన పుస్తకం "ద డే ఐ స్టాండ్ డ్రింకింగ్ మిల్క్” పుస్తకం నుండి తీసుకోబడింది. అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న సేవలు కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతాయి.

కాబట్టి జీవితంలో ఏదైనా సంపాదించాలంటే పుణ్యాన్ని సంపాదించుకోండి. అదే మనల్ని స్వర్గం దాకా తీసుకెళుతుంది.

మరి ముఖ్యంగా కరోనా వ్యాప్తి చెందుతూ అనేకులు బాధించబడుతున్న ఈ తీవ్ర దుర్భిక్ష దినములలో మన కనీస కర్తవ్యం గా అవసరతలో ఉన్న వారిని చేతనైన విధంగా ఆదుకుందాం.. జీవుల్లో దేవుడ్ని చూద్దాం. ఆ కైలాసవాసుడు లేదా మీరు నమ్మిన దైవం మిమ్మల్ని చల్లగా చూస్తాడు*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. .

Source - Whatsapp Message

No comments:

Post a Comment